ఢిల్లీ మద్యం కేసు.. కవితకు సీబీఐ నోటీసులు
ABN , Publish Date - Mar 12 , 2026 | 01:21 PM
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు ఈరోజు నోటీసులు జారీ చేశారు. కవితతో పాటు అరుణ్ రామచంద్ర, అభిషేక్ బోయిన్‌పల్లి, శరత్ రెడ్డి, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డిలకు ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు (Kavita) సీబీఐ అధికారులు ఈరోజు (గురువారం) నోటీసులు జారీ చేశారు. కవితతో పాటు అరుణ్ రామచంద్ర, అభిషేక్ బోయిన్‌పల్లి, శరత్ రెడ్డి, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డిలకు ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఇదే కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కవితకు క్లీన్‌చిట్ ఇచ్చినప్పటికీ, ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలోనే సీబీఐ అధికారులు మళ్లీ రంగంలోకి దిగడం గమనార్హం.
కవిత అనారోగ్యంతో ఉండటంతో ఆమె భర్త అనిల్‌కి నోటీసులు అందజేశారు. ఈ నెల 16వ తేదీన ఢిల్లీ హైకోర్టులో విచారణ ఉందని సీబీఐ అధికారులు తెలిపారు. ఇప్పటికే ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. అయితే, ఈ నోటీసులపై కవిత అనుచరులు తీవ్రంగా స్పందించారు. ఒకసారి కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చిన తర్వాత మళ్లీ నోటీసులు ఇవ్వడం కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ఆరోపించారు. చట్టంపై తమకు గౌరవం ఉందని, నిజం గెలుస్తుందని కవిత మొదటి నుంచి చెబుతున్నారని అన్నారు. ఈ నోటీసులకు కూడా చట్టబద్ధంగానే సమాధానం ఇస్తామని కవిత అనుచరులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు ఢిల్లీ హైకోర్టు పరిధిలో ఉన్నందున, మార్చి 16వ తేదీన జరిగే తదుపరి విచారణ అత్యంత కీలకం కానుంది. క్లీన్‌చిట్ నిలబడుతుందా లేదా మళ్లీ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందా అనేది వేచి చూడాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
ట్రంప్‌నకు.. మోదీ ఎందుకు భయపడుతున్నారు: ఎంపీ చామల
దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
ఫిరాయింపులను ప్రోత్సహించేలా అసెంబ్లీ స్పీకర్ తీర్పు: బండి సంజయ్
Read Latest International News And Telangana News And AP News And Telugu News