Share News

హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్‌ వచ్చిందంటే.. హాలీవుడ్ వచ్చినట్లే: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Mar 12 , 2026 | 02:05 PM

నెట్‌ఫ్లిక్స్‌తో తన కల నిజం కాబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు తమ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.

 హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్‌ వచ్చిందంటే.. హాలీవుడ్ వచ్చినట్లే:  సీఎం రేవంత్‌రెడ్డి
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): నెట్‌ఫ్లిక్స్‌తో తన కల నిజం కాబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు తమ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఫోర్త్‌సిటీని నిర్మిస్తున్నామని.. నెట్‌ఫ్లిక్స్‌ విస్తరణకు కావాల్సిన భూమిని ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. నెట్‌ఫ్లిక్స్‌ కార్పొరేట్ ఆఫీస్‌ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరారు. హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్ స్టూడియోస్ కార్యాలయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు (గురువారం) ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి డి. శ్రీధర్‌బాబు, సినీనటుడు రానా దగ్గుబాటి, నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ సీఈఓ శ్రీ జెఫ్ షాపిరో, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్‌ దిల్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.


చిత్రరంగంలో అనేక మార్పులు..

తనకు సినిమాలపైన ఆసక్తి ఉందని.. తన బాల్యం నుంచి ఇప్పటి వరకు చిత్రరంగంలో అనేక మార్పులు వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. బాహుబలి, కల్కి, ఆర్ఆర్ఆర్, అరుంధతి వంటి అత్యున్నత సాంకేతికతతో కూడిన సినిమాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. చెన్నైలో ఉన్న తెలుగు సినిమా రంగాన్ని నందమూరి తారక రామారావు , అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్‌కు తీసుకువచ్చారని గుర్తుచేశారు. నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని పేర్కొన్నారు. తమ దృష్టి హాలీవుడ్‌పైనేనని తాను గతంలోనే చెప్పానని ప్రస్తావించారు. ప్రపంచంలోని 500 పెద్ద కంపెనీలను తెలంగాణకు తీసుకురావడానికి తాము ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. తెలంగాణలో మీ పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుందని.. తమ రాష్ట్రం అంటేనే వ్యాపారమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీ మద్యం కేసు.. కవితకు సీబీఐ నోటీసులు

ట్రంప్‌నకు.. మోదీ ఎందుకు భయపడుతున్నారు: ఎంపీ చామల

ఫిరాయింపులను ప్రోత్సహించేలా అసెంబ్లీ స్పీకర్ తీర్పు: బండి సంజయ్

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 12 , 2026 | 04:10 PM