Share News

గ్యాస్ సిలిండర్ల సమస్య.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయి: కేటీఆర్

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:34 AM

పశ్చిమాసిమా యుద్ధం ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఎక్కువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు. గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు..

గ్యాస్ సిలిండర్ల సమస్య..  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయి: కేటీఆర్
KTR

హైదరాబాద్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసిమా యుద్ధం ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఎక్కువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) వ్యాఖ్యానించారు. గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. గ్యాస్ కొరతను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. గ్యాస్ కొరతతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500లకే సిలిండర్ ఇస్తామని చెప్పడంతో.. ఉజ్వల కొనుగోళ్లు ఆగిపోయాయని తెలిపారు. ఎల్‌పీజీ కోసం ప్రజలు పెద్దఎత్తున్న క్యూలు కడుతున్నారని ప్రస్తావించారు.


గ్యాస్ కొరత లేదని కేంద్రం ఎలా చెబుతోంది..

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో గ్యాస్ కొరత లేదని.. అంతా బాగానే ఉందని ఎలా చెబుతోందని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమేమో పెట్రోలియం కేంద్రం అధీనంలో ఉందని అంటోందని అన్నారు. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత.. అంటే మే 4 తర్వాత సిలిండర్ సైజ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కొరత లేదని కేంద్రం, సప్లై లేదని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూ డ్రామాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని ఆగ్రహించారు. ప్రతీ ఇంట్లో సిలిండర్ల సమస్య ఉందన్నారు. ఇంట్లో తన భార్య కూడా గ్యాస్ గురించి అడుగుతోందంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోందని అన్నారు. ఇరాన్‌లో ఇబ్బంది ఉంటే వేరే చోట నుంచి గ్యాస్ సిలిండర్లు తెప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీఎం రేవంత్‌రెడ్డి

ఘోర ప్రమాదం: మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు గాయాలు.. ఒకరికి సీరియస్

బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య.. సీఎంపై కిషన్‌రెడ్డి ధ్వజం

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 24 , 2026 | 01:07 PM