Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Feb 27 , 2026 | 07:24 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Breaking News

Live News & Updates

  • Feb 27, 2026 10:30 IST

    ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

    • ఏయూ వసతి గృహాల్లో రోజువారీ వేతనాలపై ఎమ్మెల్యే ప్రశ్న

    • వైసీపీ హయాంలో ఉద్యోగుల కేటగిరి మారుస్తామని చెప్పి మోసం: ఎమ్మెల్యే రామకృష్ణబాబు

    • వైసీపీ పాలనలో రాష్ట్ర విశ్వవిద్యాలయాలన్నింటినీ భ్రష్టు పట్టించారు: మంత్రి లోకేశ్

  • Feb 27, 2026 10:29 IST

    రాజస్థాన్‌లో వెలుగులోకి దారుణ సంఘటన

    • కుటుంబకలహాల నేపథ్యంలో అన్న కొడుకును చంపిన తమ్ముడు

    • ఐదేళ్ల తర్వాత బయటపడ్డ విషయం

    • బాలుడి శవం కోసం పోలీసుల అన్వేషణ

  • Feb 27, 2026 10:28 IST

    బ్లాక్ నుంచి 4 వేల మంది ఉద్యోగుల తొలగింపు

    • ప్రకటించిన సంస్థ అధినేత జాక్ డోర్సీ

    • ఇంటెలిజెన్స్‌ టూల్స్‌తో సంస్థ నిర్వహణలో మౌలిక మార్పు వస్తోందని వ్యాఖ్య

    • పలు మార్లు లేఆఫ్స్ చేపట్టే బదులు ఇలా చేశానని వెల్లడి

  • Feb 27, 2026 10:28 IST

    ఏపీ అసెంబ్లీ: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్‌పై ఎమ్మెల్యే ప్రశ్న

    • గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాం: మంత్రి నిమ్మల

    • పోలవరం ఎడమ కాలువ ద్వారా నీరు అందించాలనే ఆలోచనతో ప్రాజెక్ట్ ముందుకు: మంత్రి

    • ఈ ఏడాదిలోనే పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు

  • Feb 27, 2026 10:27 IST

    నిజామాబాద్: పసుపు కొనుగోళ్ల జాప్యంపై స్పందించిన ఎంపీ అర్వింద్

    • ఈ-నామ్ 2.0లో సాంకేతిక సమస్యలపై ఆరా తీసిన ఎంపీ అర్వింద్

    • ఢిల్లీలోని ఈ-నామ్ జాయింట్ సెక్రటరీ చిన్మయితో మాట్లాడిన అర్వింద్

    • పాత పద్ధతిలోనే పసుపు కొనుగోలు చేయాలని కోరిన అర్వింద్

  • Feb 27, 2026 10:26 IST

    ఢిల్లీ జేఎన్‌యూ దగ్గర కొనసాగుతున్న ఉద్రిక్తత

    • రాత్రి విద్యార్థి సంఘాల లాంగ్‌మార్చ్‌ను అడ్డుకున్న పోలీసులు

    • పోలీసుల, విద్యార్థుల మధ్య ఘర్షణ, తోపులాట

    • పోలీసులపైకి రాళ్లు, చెప్పులు, కర్రలు విసిరిన విద్యార్థులు

    • ఘర్షణల్లో పలువురు విద్యార్థులు, పోలీసులకు గాయాలు

  • Feb 27, 2026 10:14 IST

    ఏపీ అసెంబ్లీ: వాట్సాప్ గవర్నెన్స్‌ ద్వారా 943 రకాల సేవలు: మంత్రి లోకేశ్

    • వాట్సాప్ గవర్నెన్స్‌కు AIని జోడించి యూజర్ ఫ్రెండ్లీగా మార్చాం: మంత్రి లోకేశ్

    • వేగంగా స్పందించడం, రసీదు రావాలనే అంశాలపై దృష్టిసారిస్తాం: మంత్రి లోకేశ్

    • సభ్యులు కూడా క్షేత్రస్థాయి పరిస్థితులపై ఫీడ్ బ్యాక్ ఇవ్వాలి: లోకేశ్

    • మనమిత్ర 2.0ను కూడా ప్రారంభించాలని యోచన: మంత్రి లోకేశ్

  • Feb 27, 2026 10:13 IST

    ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

    • పెండింగ్ బిల్లులు రూ.745కోట్లు విడుదల

    • గ్రామ పంచాయతీలకు రూ.389కోట్లు విడుదల చేసిన ఆర్థికశాఖ

  • Feb 27, 2026 10:11 IST

    తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం

    • డీఎంకేలో చేరిన తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం

    • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన స్టాలిన్

  • Feb 27, 2026 09:08 IST

    రాజమండ్రి: మండపేట మండలం ద్వారపూడి వేములపల్లిలో దారుణ హత్య

    • ప్రేమ వివాహం చేసుకున్న వరుడు పోలిపల్లి సూర్యప్రకాష్‌ను హత్య చేసిన వధువు కుటుంబసభ్యులు

    • రాయవరం మండలం డిప్యూటీ తహసీల్దార్‌ సంధ్య, వేములపల్లికి చెందిన వస్త్ర వ్యాపారి ప్రేమ వివాహం

    • అన్నవరం ఆలయంలో పెళ్లి చేసుకున్న సంధ్య, సూర్య ప్రకాష్

    • ప్రేమ వివాహం తర్వాత వేములపల్లికి వచ్చిన వధూవరులు

    • ప్రేమ పెళ్లి ఇష్టం లేని వధువు బంధువులు సూర్యప్రకాష్‌పై రాళ్లతో దాడి, హత్య

  • Feb 27, 2026 09:06 IST

    పాక్‌ F-16 విమానాన్ని కూల్చేశాం: అఫ్గానిస్థాన్ ప్రకటన

    • తమ గగనతలంలోకి ప్రవేశించడంతో కూల్చివేశాం: అఫ్గానిస్థాన్

    • F-16 యుద్ధ విమానం కూల్చివేతపై స్పందించని పాకిస్థాన్‌

  • Feb 27, 2026 08:52 IST

    భారత క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత

    • రింకు సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ కన్నుమూత

    • క్యాన్సర్‌తో బాధపడుతున్న ఖచంద్ర సింగ్

    • ఇవాళ తెల్లవారుజామున మృతిచెందిన ఖచంద్ర సింగ్

    పూర్తి కథనం

  • Feb 27, 2026 08:33 IST

    తెనాలిలో నేడు ఆయేషా మీరా శరీర అవశేషాలు ఖననం

    • 2019లో రీపోస్టుమార్టం కోసం సేకరించిన శరీర అవశేషాలను..

    • నేడు ఆయేషా మీరా తల్లిదండ్రులకు అప్పగించనున్న CBI

    • మధ్యాహ్నం చెంచుపేటలోని ఖబరస్తాన్‌లో శరీర అవశేషాలు ఖననం

  • Feb 27, 2026 08:08 IST

    ఇమ్రాన్‌ ఖాన్‌పై చర్చ

    • యూకే పార్లమెంట్‌లో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై చర్చ

    • పాక్‌కు నిధులను ఆపాలని యూకే ఎంపీల డిమాండ్

  • Feb 27, 2026 07:40 IST

    నేడే విచారణ..

    • నేడు స్పీకర్ ఎదుట విచారణకు హాజరుకానున్న దానం నాగేందర్

    • దానంపై అనర్హత వేటు పిటిషన్ దాఖలు చేసిన కౌశిక్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి

  • Feb 27, 2026 07:40 IST

    నేడు 12వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

    • ఉదయం 9గంటలకు సభలో ప్రశ్నోత్తరాలు

    • పలు కీలక బిల్లులను ఆమోదించనున్న ఏపీ అసెంబ్లీ

  • Feb 27, 2026 07:30 IST

    సౌదీ రాజధాని రియాద్‌లో ఘోరం

    • తల్లిదండ్రులను చంపి ఆత్మహత్యకు పాల్పడ్డ భారతీయ టీనేజర్

    • తల్లిదండ్రులను చంపాక ఆన్‌లైన్‌లో ఫుడ్ తెప్పించుకుని తిన్న తనయుడు

    • అనంతరం మరో చోటకు వెళ్లి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య

  • Feb 27, 2026 07:26 IST

    నేటి బంగారం, వెండి ధరలివే

    • నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,61,010

    • 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,590

    • కిలో వెండి రూ.2,94,900

    పూర్తి కథనం

  • Feb 27, 2026 07:25 IST

    మారుతున్న పులుల స్వభావం

    • మనుషులను టార్గెట్ చేస్తున్న పులులు

    • 2024తో పోలిస్తే.. 2025లో గణనీయంగా పెరిగిన దాడులు

    • సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ నివేదికలో ఆసక్తికర విషయాలు

    పూర్తి కథనం

  • Feb 27, 2026 07:24 IST

    పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు

    • పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ ప్రతీకార దాడులు

    • 55 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్టు తాలిబన్లు ప్రకటన

    • 19 పాక్ అవుట్ పోస్టులు, 2 స్థావరాలను ధ్వంసం చేసినట్టు అఫ్గాన్ వెల్లడి

    పూర్తి కథనం