Share News

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. డీఎంకేలోకి పన్నీర్ సెల్వం

ABN , Publish Date - Feb 27 , 2026 | 10:15 AM

అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డీఎంకే పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. డీఎంకేలోకి పన్నీర్ సెల్వం
O Panneerselvam joins DMK

చెన్నై, ఫిబ్రవరి 27: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డీఎంకే పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. డీఎంకే పార్టీ పన్నీర్ సెల్వంకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. తేని జిల్లాలోని బోడినాయకనూర్ నియోజకవర్గం నుంచి పన్నీర్ సెల్వం పోటీచేసే అవకాశం కనిపిస్తోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీలో నిలిచే అవకాశం ఉంది.


కాగా.. వారం రోజుల క్రితం పన్నీర్ సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే ఐదేళ్ల పాలనపై ప్రశంసల జల్లులు కురిపించారు. డీఎంకే ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుందని, ఐదేళ్లుగా సీఎం స్టాలిన్ విజయవంతమైన, సుపరిపాలన అందించారని అన్నారు. అందుకే తాను సీఎం స్టాలిన్‌ను కలిసి.. అభినందనలు తెలిపానని చెప్పారు. డీఎంకే పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో మళ్లీ డీఎంకేనే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

గోల్డ్ రేట్ యూటర్న్.. తగ్గినట్టే తగ్గి మళ్లీ..

గుండబోయిన రాము ఏమయ్యాడు..?

Updated Date - Feb 27 , 2026 | 11:56 AM