Share News

గోల్డ్ రేట్ యూటర్న్.. తగ్గినట్టే తగ్గి మళ్లీ..

ABN , Publish Date - Feb 27 , 2026 | 10:40 AM

బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి నేడు మళ్లీ పెరిగాయి. సుమారు రూ.500 మేర పెరుగుదల నమోదైంది. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయో కథనంలో తెలుసుకుందాం.

గోల్డ్ రేట్ యూటర్న్.. తగ్గినట్టే తగ్గి మళ్లీ..
gold, Silver Rates on Feb 27

ఇంటర్నెట్ డెస్క్: బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. గురువారం తగ్గిన ధరలు శుక్రవారం ట్రేడింగ్ మొదలు కాగానే మళ్లీ పుంజుకున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, హైదరాబాద్‌ బులియన్ మార్కెట్‌లో ఉదయం 10.00 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,61,570కు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే రూ.550ల మేర పెరిగింది. 22 క్యారెట్ ఆర్నమెంటల్ బంగారం ధర కూడా రూ.500ల మేర పెరిగి రూ.1,48,100కు చేరుకుంది. ఇక నగరంలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.95 లక్షల వద్ద కొనసాగుతోంది (Gold, Silver Rates on Feb 27).


చెన్నైలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,550గా ఉంది. ముంబైలో రూ.1,61,570గా, ఢిల్లీలో రూ.1,61,720గా ఉంది. ఇక కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో కూడా మేలిమి బంగారం ధర రూ.1,61,570గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర అత్యధికంగా రూ.1,49,000 వద్ద కొనసాగుతోంది. ముంబైలో రూ.1,48,100గా, ఢిల్లీలో రూ.1,48,825గా ఉంది. ఇక ముంబై, ఢిల్లీ, కోల్‌‌కతా నగరాల్లో కిలో వెండి ధర రూ.2.85 లక్షలుగా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.2.95 లక్షలు పలుకుతోంది.


ఈ వార్తలూ చదవండి

ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ

కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ

Updated Date - Feb 27 , 2026 | 10:47 AM