ప్రధాని మోదీని కలిసిన రష్మిక, విజయ్.. రిసెప్షన్‌కు ప్రత్యేక ఆహ్వానం
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:25 PM
విజయ్, రష్మికలు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న రిసెప్షన్‌కు రావాలని ప్రధానికి ప్రత్యేక ఆహ్వానం అందించారు.
ఇంటర్‌నెట్ డెస్క్: హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న గురువారం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయం 10.10 గంటలకు మూడు ముళ్ల బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో వీరి పెళ్లి జరిగింది. ఉదయం తెలుగు సంప్రదాయం ప్రకారం.. సాయంత్రం కొడవ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి అతి కొద్ది మంది బంధుమిత్రులను మాత్రమే ఆహ్వానించారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. రిసెప్షన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
ప్రధాని మోదీకి ఆహ్వానం
విజయ్, రష్మికలు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న రిసెప్షన్‌కు రావాలని ప్రధానికి ప్రత్యేక ఆహ్వానం అందించారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిశారు. పెళ్లి రిసెప్షన్‌కు రావాలని అహ్వానించారు. ఈ సందర్భంగా ఇన్విటేషన్‌తో పాటు వినాయకుడి విగ్రహాన్ని కూడా ఆయనకు అందించారు. విజయ్, రష్మికల జంట ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి
టీ20 ప్రపంచ కప్ 2026: న్యూజిలాండ్, ఇంగ్లండ్ మ్యాచ్‌కు వాన ముప్పు!
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 943 రకాల సేవలు: మంత్రి లోకేశ్