Share News

టీ20 ప్రపంచ కప్ 2026: న్యూజిలాండ్, ఇంగ్లండ్ మ్యాచ్‌కు వాన ముప్పు!

ABN , Publish Date - Feb 27 , 2026 | 11:53 AM

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 గ్రూప్-2లో భాగంగా ఇవాళ కొలంబోలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌ జరగనుంది. సాయంత్రం 7: 00 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.

టీ20 ప్రపంచ కప్ 2026: న్యూజిలాండ్, ఇంగ్లండ్ మ్యాచ్‌కు వాన ముప్పు!
England vs New Zealand

స్పోర్ట్స్ డెస్క్: టీ20 వరల్డ్ కప్(T20 ప్రపంచ కప్ 2026) సూపర్-8 గ్రూప్ -2లో భాగంగా ఇవాళ(శుక్రవారం) కొలంబోలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌ జరగనుంది. సాయంత్రం 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై గెలిచినా, వర్షం కారణంగా రద్దైనా కివీస్ సెమీ ఫైనల్‌కు చేరే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఓడితే మాత్రం పాకిస్థాన్, శ్రీలంక ఫలితం కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. దీంతో ఇవాళ జరిగే మ్యాచ్‌పై అటు కివీస్, ఇటు పాకిస్థాన్ అభిమానుల దృష్టి అంతా నిలిచింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ ఫలితం పాకిస్థాన్ సెమీఫైనల్ ఆశలను నేరుగా ప్రభావితం చేయనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ మ్యాచ్ కు వాన ముప్పు ఉందా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...


స్థానిక నివేదికల ప్రకారం.. శుక్రవారం కొలంబోలో భారీ వర్షం(Rain Alert) అవకాశం తక్కువగా ఉంది. అయితే స్వల్పంగా వాన ముప్పు పొంచి ఉంది. మధ్యాహ్నం సమయంలో వాతావరణం కాస్త మేఘావృతమై ఉంటుందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. అయితే మ్యాచ్ సమయానికి వరుణుడి ముప్పు పెద్దగా ఉండకపోవచ్చని స్థానిక వాతావరణ శాఖ చెబుతుంది. ఇది పాకిస్థాన్‌కు కొంత ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే, శ్రీలంకలో ఇప్పటికే కొన్ని మ్యాచ్‌లు వర్షం కారణంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే.


పిచ్‌పై స్పిన్ ప్రభావం..

ఇవాళ జరిగే మ్యాచ్ జరిగే కొలంబో పిచ్ స్పిన్నర్లు అనుకూలంగా ఉంటుంది. గతంలో శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆరుగురు స్పిన్నర్లను ఎదుర్కొని సౌకర్యంగా ఆడిన సంగతి తెలిసిందే. మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, కోల్ మెకాన్‌చీ వంటి ఆల్‌రౌండర్లు కొలంబో పిచ్‌పై కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక ఇంగ్లండ్ తరఫున హ్యారీ బ్రూక్, విల్ జాక్స్ స్పిన్‌ను బాగా ఎదుర్కొంటున్నారు. పిచ్ స్వల్పంగా టర్న్ అవుతుందని అంచనా ఉండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారే ఛాన్స్ ఉంది.


ప్రస్తుత గ్రూప్-2 పాయింట్ల పట్టిక

  • ఇంగ్లండ్: 4 పాయింట్లు, 2 మ్యాచ్‌లు, నెట్ రన్‌రేట్ +1.491

  • న్యూజిలాండ్:3 పాయింట్లు, 2 మ్యాచ్‌లు, నెట్ రన్‌రేట్ +3.050

  • పాకిస్థాన్: 1 పాయింట్, 2 మ్యాచ్‌లు, నెట్ రన్‌రేట్ -0.461

  • శ్రీలంక: 0 పాయింట్లు, 2 మ్యాచ్‌లు, నెట్ రన్‌రేట్ -2.800


ఇవి కూడా చదవండి:

కీలక మ్యాచ్‌లో గెలిచినా.. ఆందోళనలో టీమిండియా అభిమానులు!

విషాదం: భారత క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత..

Updated Date - Feb 27 , 2026 | 12:02 PM