Share News

కీలక మ్యాచ్‌లో గెలిచినా.. ఆందోళనలో టీమిండియా అభిమానులు!

ABN , Publish Date - Feb 27 , 2026 | 10:10 AM

సెమీస్ ఆశలు సజీవంగా నిలవాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్2026 సూపర్-8లో భాగంగా ఫిబ్రవరి 26న భారత్, జింబాబ్వే మధ్య కీలక మ్యాచ్ జరిగింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.

కీలక మ్యాచ్‌లో గెలిచినా..  ఆందోళనలో టీమిండియా అభిమానులు!
India vs West Indies

స్పోర్ట్స్ డెస్క్: సెమీస్ ఆశలు సజీవంగా నిలవాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026) సూపర్-8లో భాగంగా ఫిబ్రవరి 26న భారత్, జింబాబ్వే మధ్య కీలక మ్యాచ్ జరిగింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టీమిండియా సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.


సూపర్-8లో భారత్ తన చివరి మ్యాచ్‌ను వెస్టిండీస్‌(West Indies)తో ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే.. సెమీస్‌కు లేదంటే.. ఇంటికి వెళ్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నా... జింబాబ్వేపై భారీ విజయం సాధించిన తర్వాత కూడా టీమిండియా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెస్టిండీస్‌తో మ్యాచ్ భారత్ గెలిచేది, ఓడేది పక్కన పెడితే.. ఆ ఒక్కటి జరగకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి... ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..


ప్రస్తుతం సూపర్-8 గ్రూప్-1 పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో సౌతాఫ్రికా టాప్ ప్లేసులో ఉండటమే కాకుండా.. సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. అలానే రెండేసి పాయింట్లతో తరువాత స్థానాల్లో వెస్టిండీస్, భారత్ జట్లు ఉన్నాయి. అయితే నెట్ రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో విండీస్ రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం వెస్టిండీస్, భారత జట్ల నెట్ రన్‌రేట్ +1.791, -0.100గా ఉన్నాయి. నిన్న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ బౌలర్లు ఆశించిన మేర రాణించలేదు. ఇంకా భారీ విజయం నమోదు కావాల్సింది.. సూర్య కుమార్ తప్పుడు నిర్ణయాలు, దూబె ధారళంగా పరుగులు ఇవ్వడంతో పరిస్థితులు మారిపోయాయని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. దాదాపు100 పరుగుల తేడాతో గెలిచి ఉంటే... నెట్ రన్‌రేట్‌లో విండీస్ జట్టును భారత్ దాటేది.


నిన్న జింబాబ్వేపై భారత్ గెలిచిప్పటికీ.. టీమిండియా(Team India) బౌలింగ్‌పై అభిమానులు ఆసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తంగా ప్రస్తుత పరిస్థితులో భారత్ గెలిస్తే మాత్రమే సెమీస్‌కు వెళ్తుంది. కానీ విండీస్ ముందు రెండు అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ గెలిచినా, మ్యాచ్ రద్దైనా కరేబియన్ జట్టు సెమీ ఫైనల్స్‌కు చేరుతుంది. ఇదే ప్రస్తుతం భారత అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. మార్చి 1న విండీస్, భారత్ మ్యాచ్ కు ఈడెన్ గార్డెన్ వేదికగా జరగనుంది. ఇటీవల భారత్ లోని పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. దీంతో వర్షం కారణంగా విండీస్ తో జరిగే మ్యాచ్ రద్దు అవుతాదేమో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

విషాదం: భారత క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత..

టీ20 ప్రపంచ కప్ 2026: యువరాజ్ రికార్డు సమం చేసిన ఇషాన్, హార్దిక్

Updated Date - Feb 27 , 2026 | 10:15 AM