Share News

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.745 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదల!

ABN , Publish Date - Feb 27 , 2026 | 11:10 AM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల ఆర్థిక బకాయిల విషయంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.745 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదల!
Good News for Government Employees

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల ఆర్థిక బకాయిల విషయంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నాడు ఆయన ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు రూ.745 కోట్ల పెండింగ్ బిల్లు(Pending Bills)లను విడుదల చేశారు. గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన తర్వాత పెండింగ్ బిల్లులను విడతల వారీగా క్లియర్ చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది.


ప్రభుత్వం విడుదల చేసిన రూ.745 కోట్లతో ఉద్యోగులకు పెద్ద ఊరట లభించినట్లయింది. కేవలం ఉద్యోగులకే కాకుండా, గ్రామాల్లో అభివృద్ధి పనులు, పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వం అదనంగా రూ389 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ నిధుల విడుదల ద్వారా గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు వేగవంతం కావడంతో పాటు, ఎంతోమంది ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని అంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

హమ్మయ్య! గోల్డ్ రేట్ తగ్గిందిగా!

మూడో డిస్కమ్‌ ఏర్పాటులో మరో కీలక అడుగు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 27 , 2026 | 11:59 AM