2020లో మాయం అయ్యాడు.. ఐదేళ్ల తర్వాత..
ABN , Publish Date - Feb 27 , 2026 | 09:23 AM
కుటుంబ కలహాల నేపథ్యంలో బాబాయ్ ఘాతుకానికి ఒడిగట్టాడు. భార్యతో కలిసి అన్న కొడుకును అతి కిరాతకంగా చంపేశాడు. భార్యాభర్తలు కలిసి బాలుడి శవాన్ని హైవే పక్కన పూడ్చి పెట్టారు. రాజస్థాన్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో బాబాయ్ ఘాతుకానికి ఒడిగట్టాడు. భార్యతో కలిసి అన్న కొడుకును అతి కిరాతకంగా చంపేశాడు. భార్యాభర్తలు కలిసి బాలుడి శవాన్ని హైవే పక్కన పూడ్చి పెట్టారు. ఐదేళ్ల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఐదేళ్లుగా కొడుకు కోసం అల్లాడిపోతున్న బాలుడి తల్లిదండ్రుల గుండె బద్దలైంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. దౌసా జిల్లాకు చెందిన ప్రిన్స్ అలియాస్ టిల్లు అనే నాలుగేళ్ల బాలుడు 2020 ఆగస్టు 16వ తేదీన ఇంటినుంచి కనిపించకుండా పోయాడు.
కుటుంబసభ్యులు ఎంత వెతికినా పిల్లాడి ఆచూకీ లభించలేదు. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయినా కూడా ఎలాంటి లాభం లేకుండా పోయింది. కుటుంబసభ్యులు 2021లో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఐదేళ్లలో ఐదుగురు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు మారారు. పిల్లాడి ఆచూకీ మాత్రం చిక్కలేదు. పిల్లాడిని ఎలాగైనా సరే కనిపెట్టి తీసుకురావాలంటూ పోలీసులకు కోర్టు తేల్చి చెప్పింది.
రాజస్థాన్ పోలీసులు ఐదేళ్ల తర్వాత ఈ కేసును ఛేదించారు. ప్రిన్స్ హత్యకు గురయ్యాడని తేల్చారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రిన్స్ తండ్రిపై పగ పెంచుకున్న ప్రిన్స్ బాబాయ్ అనిల్, పిన్ని అర్చనలు ఈ దారుణానికి ఒడిగట్టారు. బాలుడి శవాన్ని ఢిల్లీ - ముంబై హైవే పక్కన పూడ్చిపెట్టారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు వారికి మార్చి 1వ తేదీ వరకు కస్టడీ విధించింది. నిందితులు చెప్పిన వివరాల మేరకు పోలీసులు హైవే పక్కన తవ్వకాలు చేపట్టారు. ఇప్పటి వరకు 15 అడుగుల లోతు వరకు తవ్వారు. ఇంకా బాలుడి ఆనవాళ్లు లభించలేదు.
ఇవి కూడా చదవండి
అఫ్గానిస్థాన్‌పై యుద్ధం ప్రకటించిన పాక్
రోబోటిక్ శస్త్ర చికిత్సతో విజయవంతంగా మోకాలు మార్పిడి