ప్రేమ వివాహం చేసుకున్నాడని నవ వరుడి దారుణ హత్య
ABN , Publish Date - Feb 27 , 2026 | 10:11 AM
తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ద్వారపూడి శివారు వేములపల్లిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడిని.. యువతి కుటుంబ సభ్యులు దారుణంగా హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
తూర్పుగోదావరి జిల్లా, ఫిబ్రవరి 27: జిల్లాలోని మండపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ద్వారపూడి వేములపల్లిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడిని.. యువతి కుటుంబ సభ్యులు దారుణంగా హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. వేములపల్లికి చెందిన సూర్య ప్రకాశ్, సంధ్యలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు వారి ప్రేమకు అభ్యంతరం చెప్పారు. దీంతో గురువారం అన్నవరంలో సూర్య ప్రకాశ్-సంధ్య వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలిసి యువతి కుటుంబం ఆగ్రహంతో రగిలిపోయింది. సంధ్య సోదరులు.. సూర్య ప్రకాశ్ ఇంటికి వెళ్లి రాళ్లతో దాడిచేసి చంపేశారు.
సంధ్య ప్రస్తుతం రాయవరంలోని డిప్యూటీ తహశీల్దార్ గా పనిచేస్తున్నారు. వేములపల్లికి చెందిన వస్త్ర వ్యాపారి కుమారుడు సూర్య ప్రకాశ్. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడమే హత్యకు కారణమయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి:
ముదిరిన సరిహద్దు వివాదం.. అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ భారీ వైమానిక దాడులు
సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కు కొత్త వెబ్‌సైట్