Share News

సైబరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు కొత్త వెబ్‌సైట్‌

ABN , Publish Date - Feb 27 , 2026 | 06:57 AM

సైబరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు కొత్త వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చింది. ఔటర్‌ రింగురోడ్డు సరిహద్దుగా జీహెచ్‌ఎంసీని విస్తరించిన తర్వాత మూడు కార్పొరేషన్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

సైబరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు కొత్త వెబ్‌సైట్‌

హైదరాబాద్‌ సిటీ: సైబరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు కొత్త వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చింది. ఔటర్‌ రింగురోడ్డు సరిహద్దుగా జీహెచ్‌ఎంసీని విస్తరించిన తర్వాత మూడు కార్పొరేషన్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ కోసం వెబ్‌సైట్‌ (www.ghmc.gov.in) ఉండగా, కొత్తగా ఏర్పడిన సైబరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు (www.cmc.te-langana.gov.in) వెబ్‌సైట్‌ను రూపొందించి అందుబాటులోకి తీసుకువచ్చారు.


city1.2.jpgఈ వెబ్‌సైట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని విభాగాల సమాచారంతో పాటు ప్రజలకు అవసరమైన ప్రాపర్టీ ట్యాక్సు, ట్రేడ్‌ లైసెన్సు, జనన, మరణ వివరాల నమోదు, టౌన్‌ప్లానింగ్‌, సెల్ఫ్‌ అసెస్‏మెంట్‌, ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా మై క్యూర్‌ పేరుతో మొబైల్‌ యాప్‌ను నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారానే సైబరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(Cyberabad Municipal Corporation)కు సంబంధించిన సమాచారాన్ని తెలుకోవడంతో పాటు చెల్లింపులు చేసేందుకు లింకులను పొందుపర్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

హమ్మయ్య! గోల్డ్ రేట్ తగ్గిందిగా!

మూడో డిస్కమ్‌ ఏర్పాటులో మరో కీలక అడుగు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 27 , 2026 | 06:57 AM