పూర్తి నివేదిక మా ముందు ఎందుకు ఉంచలేదు?
ABN , Publish Date - Feb 27 , 2026 | 05:15 AM
ఓ మైనింగ్ కంపెనీ వివాదంలో బోయకొండ రిజర్వ్ ఫారెస్ట్ సరిహద్దుకు సంబంధించి రెవెన్యూ, అటవీ, మైనింగ్ శాఖ ఉమ్మడిగా సర్వే చేసి సమర్పించిన...
చిత్తూరు డీఎఫ్‌వో, రేంజ్ అధికారిపై హైకోర్టు ఆగ్రహం
అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ఓ మైనింగ్ కంపెనీ వివాదంలో బోయకొండ రిజర్వ్ ఫారెస్ట్ సరిహద్దుకు సంబంధించి రెవెన్యూ, అటవీ, మైనింగ్ శాఖ ఉమ్మడిగా సర్వే చేసి సమర్పించిన ఇరవై పేజీల నివేదికలో 4 పేజీలను మాత్రమే అఫిడవిట్‌కు జత చేయడంపై హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు స్వయంగా తమ ముందు హాజరుకావాలని చిత్తూరు జిల్లా డీఎ్‌ఫవో, ఫారెస్ట్ రేంజ్ అధికారిని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చంద్రమాకులపల్లి గ్రామ పరిధిలో 2.880హెక్టార్ల విస్తీర్ణంలో మైనింగ్ కార్యకలాపాలు నిలిపివేయాలని పలమనేరు డివిజనల్ మైన్స్ అండ్ జియాలజీ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సూర్య రాక్స్ సంస్థ యజమాని హైకోర్టును ఆశ్రయించారు.