ప్రణాళికాబద్ధంగానే టీటీడీపై కుట్ర
ABN , Publish Date - Feb 27 , 2026 | 05:06 AM
సీపీ పాలనలో ప్రణాళికాబద్ధంగానే టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విమర్శించారు.
వైసీపీ హయాంలో 200కుపైగా ఆలయాల కూల్చివేత
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ధ్వజం
గుంటూరు(తూర్పు), ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో ప్రణాళికాబద్ధంగానే టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విమర్శించారు. ప్రసాదంలో కల్తీ, పరకామణిలో అక్రమాలు, స్వామి వారి సేవల తగ్గింపు, అన్యమతస్తులకు భూముల కేటాయింపు ఈ కుట్రలో భాగమేనన్నారు. గుంటూరులో గురువారం విలేకరులతో మాట్లాడుతూ 2019-24 కాలంలో 200కుపైగా దేవాలయాల కూల్చివేత, వాటి ఆస్తులు ధ్వంసం చేశారని మండిపడ్డారు. అదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వ చర్యలు, చాగంటి, గరికపాటి లాంటి ప్రవచనకర్తలతో రాష్ట్రంలో ఆధ్యాత్మికత, దేవాలయ సంప్రదాయాలు నిలబడ్డాయని పేర్కొన్నారు. ఝార్ఖండ్ మాదిరిగా మన రాష్ట్రంలోనూ దేవాలయాలను పర్యాటక ప్రాంతాలుగా మార్చాలని సూచించారు. లిక్కర్ స్కామ్ పాత్రధారులతో పాటు అసలైన సూత్రధారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.