ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్..
ABN , First Publish Date - Jan 24 , 2026 | 07:32 AM
ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Jan 24, 2026 20:40 IST
ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక నిర్థారణ: ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్
నాలుగు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.
ఫర్నిచర్ డంప్‌తో సహాయక చర్యలకు ఆటంకం.
భవనం కింద రెండు సెల్లార్లు.
మొదటి సెల్లార్‌లో ఫర్నిచర్ మెటీరియల్ డంప్.
ప్రమాద సమయంలో కార్మికులు రెండో సెల్లార్‌లో ఉన్నారు.
-
Jan 24, 2026 20:32 IST
బండి సంజయ్, ఎంపీ అర్వింద్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు
నాపై, నా కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్న కేటీఆర్.
వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలి.
ఐదు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలి.
లేకుంటే న్యాయం, చట్టపరంగా ముందుకెళ్తా.
-
Jan 24, 2026 20:27 IST
ధరణి అక్రమాలపై ప్రభుత్వానికి ఉన్నతస్థాయి కమిటీ నివేదిక.
ధరణి అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్‌లో సంచలన విషయాలు.
ధరణిలో లొసుగుల వల్లే రిజిస్ట్రేషన్లలో అవకతవకలు.
9 జిల్లాల్లో 35 మండలాల్లో 48 మందిపై క్రిమినల్ కేసులు.
4,848 లావాదేవీల్లో లోటుపాట్లు గుర్తింపు.
1,109 డాక్యుమెంట్లకు రూ.4 కోట్ల చెల్లింపుల బాకీ.
ప్రభుత్వ భూములు కాజేయడంలో పెద్దల పాత్రపై విచారణ.
త్వరలో 31 జిల్లాల్లోనూ ఫోరెన్సిక్ ఆడిట్.
-
Jan 24, 2026 20:24 IST
నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరా.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫోన్.
అగ్ని ప్రమాదానికి దారితీసిన కారణాలపై మంత్రి పొంగులేటి ఆరా.
మంటలు వ్యాపించకుండా పక్క భవనాలు ఖాళీ చేయించాలని ఆదేశాలు.
పోలీస్, ఫైర్ అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు వేగవంతం చేయాలన్న మంత్రి.
అదనపు ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపులోకి తేవాలని మంత్రి పొంగులేటి ఆదేశం.
-
Jan 24, 2026 19:24 IST
ఇస్లాం కంటే ముందు నుంచే భారత్-ఇరాన్ బంధం: ఖమేనీ ప్రతినిధి
ఇస్లాం కంటే వందల ఏళ్ల ముందే ఇరాన్, భారతదేశం మధ్య పటిష్టమైన బంధం..
ఈ బంధం భవిష్యత్తులో కూడా కొనసాగాలి: ఖమేనీ ప్రతినిధి
-
Jan 24, 2026 19:09 IST
ఆపరేషన్ సిందూర్‌పైనే అభిప్రాయ భేదాలు: శశిథరూర్
పార్లమెంటులో పార్టీ నియమావళిని ఎప్పుడూ ఉల్లంఘించలేదు: ఎంపీ శశిథరూర్
ఆపరేషన్ సింధూర్ విషయంలో పార్టీతో అభిప్రాయభేదాలు: ఎంపీ శశిథరూర్
-
Jan 24, 2026 19:04 IST
కేంద్ర బడ్జెట్ 2026.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..
ప్రతి ఏడాదీ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
కేంద్ర బడ్జెట్-2026కు సమయం సమీపిస్తున్న తరుణంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
-
Jan 24, 2026 18:52 IST
135 పరుగులకే.. న్యూజిలాండ్ ఆలౌట్..
అండర్ 19 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మ్యాచ్..
36.2 ఓవర్లలో 135 పరుగులకు కివీస్ ఆలౌట్..
-
Jan 24, 2026 18:32 IST
నుమాయిష్ ఎగ్జిబిషన్ సందర్శన వాయిదా వేసుకోండి: సజ్జనార్
నుమాయిష్ సందర్శకులకు సీపీ సజ్జనార్ కీలక సూచన చేశారు.
నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభన.
ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని సందర్శకులు తమ ఎగ్జిబిషన్ పర్యటనను ఇవాళ వాయిదా వేసుకోవాలని కోరిన సీపీ.
-
Jan 24, 2026 17:37 IST
మహబూబాబాద్ మండలం బలరాంతండాలో విషాదం
బావిలో పడి తండ్రి మదన్(40), కుమారుడు జశ్వంత్(2) మృతి.
కుమారుడిని రక్షించేందుకు బావిలో దూకిన తండ్రి.
ప్రమాదవశాత్తు ఇద్దరూ మృతి.
-
Jan 24, 2026 17:21 IST
అగ్ని ప్రమాదం స్థలాన్ని పరిశీలించిన సీపీ సజ్జనార్, కలెక్టర్
అగ్నిప్రమాద ఘటనా స్థలంలో పరిస్థితిని పర్యవేక్షించిన సీపీ సజ్జనార్, కలెక్టర్
రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది: సీపీ సజ్జనార్
లోపలికి వెళ్లేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నిస్తోంది.
దట్టమైన పొగ వల్ల రెస్క్యూ టీమ్ లోపలికి వెళ్లలేకపోతోంది..
సెల్లార్ అంతా ఫర్నిచర్ ఉండడంతో కష్టంగా రెస్క్యూ.
బాధితుల ఫోన్ రింగ్ అవుతోంది.
రెస్క్యూకి మరికొంత సమయం పట్టే అవకాశం.
-
Jan 24, 2026 16:54 IST
ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం.. వెలుగులోకి సంచలన విషయాలు..
నాంపల్లి అగ్నిప్రమాద భవనం హిందీ ప్రచార సభ పేరుతో నిర్మాణం.
దాతల విరాళాలతో 1960లోనే భవన నిర్మాణం.
అచ్యుత్‌రెడ్డి ఇచ్చిన ల్యాండ్‌లో హిందీ ప్రచార సభ పేరుతో నిర్మాణం.
కొన్నేళ్లుగా అక్రమార్కుల చేతుల్లోకి భవనం, షాపులు ఏర్పాటు.
షాపులను వెంటనే ఖాళీ చేయాలని గతంలోనే హైకోర్టు ఆదేశాలు.
హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమార్కుల కార్యకలాపాలు.
కోర్టులో కేసు ఉన్నా షాపులు నడుపుతూ అక్రమార్కుల దందా.
-
Jan 24, 2026 16:31 IST
అహ్మదాబాద్‌లో విమానం ప్రమాదానికి సంబంధించి ఎయిర్ ఇండియాకు అందిన బీమా సొమ్ము.
రూ.1,100 కోట్లను ఎయిర్ ఇండియాకు అందించిన బీమా సంస్థలు.
ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు మరో 25 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించనున్న బీమా సంస్థలు.
ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమైందని తెలిపిన బీమా సంస్థలు.
-
Jan 24, 2026 16:07 IST
యాదాద్రి: ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఆదర్శ వివాహం

ఎలాంటి ఆడంబరం లేకుండా చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో వివాహం.
చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకి చెందిన యువ ఐపీఎస్ అధికారిని శేషాద్రిని రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి పెళ్లి చేసుకున్నారు.
కుత్బుల్లాపూర్ డీసీపీగా ఉన్న శేషాద్రిని రెడ్డి, ఐఏఎస్ ట్రైనింగ్‌లో ఉన్న శ్రీకాంత్ రెడ్డి.
వివాహానికి హాజరైన పలువురు ఉన్నతాధికారులు.
-
Jan 24, 2026 16:07 IST
హైదరాబాద్: నాంపల్లి ఫర్నీచర్ షాపులో భారీ అగ్నిప్రమాదం
నాలుగంతస్తులకు వ్యాపించిన మంటలు, అదుపుచేసిన ఫైర్ సిబ్బంది.
షాపులో చిక్కుకున్న ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు.
ఫర్నీచర్ షాపులో డంప్‌ను జేసీబీలతో క్లియర్ చేయిస్తున్న పోలీసులు.
రోబో సాయంతో కొనసాగుతున్న ఫైర్ సిబ్బంది రెస్క్యూ.
దట్టంగా అలముకున్న పొగ, లోపలికి వెళ్లేందుకు ఆటంకం.
-
Jan 24, 2026 15:43 IST
తెలంగాణలో అమల్లోకి వచ్చిన వాహనాల స్పాట్ రిజిస్ట్రేషన్లు.

షోరూమ్స్‌లో స్పాట్ రిజిస్ట్రేషన్లకు మొగ్గుచూపని వినియోగదారులు.
ఆచరణకు నోచుకోని స్పాట్ రిజిస్ట్రేషన్ల విధానం.
బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తేనే స్పాట్ రిజిస్ట్రేషన్లు.
బ్యాంక్ వివరాలు ఇచ్చేందుకు కస్టమర్ల అభ్యంతరం.
బ్యాంకు డీటెయిల్స్ ఇస్తే చలానాలు కట్ అయ్యే ప్రమాదముందని కస్టమర్ల ఆలోచన.
రిజిస్ట్రార్ ఆఫీసుల్లో లేని నిబంధన ఇక్కడెందుకని ప్రశ్నిస్తున్న కస్టమర్లు.
-
Jan 24, 2026 15:27 IST
హైదరాబాద్: నాంపల్లి ఫర్నీచర్ షాపు గోదాంలో అగ్నిప్రమాదం
గోదాం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చెలరేగిన మంటలు.
మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది.
గోదాంలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం.
-
Jan 24, 2026 15:25 IST
అందరినీ సాక్షిగా పిలిస్తే.. అసలు దోషులెవరు: బండి సంజయ్
కేటీఆర్‌ను సాక్షిగా పిలిచారని మంత్రులు చెబుతున్నారు.
విచారణకు పిలిచామని సజ్జనార్ చెబుతున్నారు.
కేసీఆర్, కేటీఆర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం క్లీన్‌చిట్ ఇస్తోందా?
కేటీఆర్, హరీష్‌రావు సహా అందరినీ సాక్షిగా పిలిస్తే.. ఫోన్ ట్యాపింగ్ దోషులెవరు?
ఫోన్ ట్యాపింగ్ దొంగలను సాక్షులుగా పిలవడమేంటి?
కేసీఆర్ కుటుంబానికి అన్నీ లొట్టపీసు కేసుల్లాగే కనిపిస్తాయి.
-
Jan 24, 2026 12:56 IST
అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థపై నిందలు మోపుతున్నారు: భట్టి
సింగరేణి కార్మికుల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తున్నారు: భట్టి విక్రమార్క
సింగరేణి సంస్థ ప్రోసీజర్స్ ప్రకారమే నిర్ణయాలు: భట్టి
ఆరోపణలు రాగానే టెండర్లు రద్దు చేయాలని చెప్పి వెళ్లిపోయా: భట్టి
తర్వాత అయినా తప్పు గ్రహించి మార్చుకుంటారని భావించా: భట్టి
-
Jan 24, 2026 12:55 IST
సింగరేణిపై కట్టుకథలు ప్రచారం చేస్తున్నారు: డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ ప్రభుత్వంపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు: భట్టి
సింగరేణి ఆత్మగౌరవం దెబ్బతినేలా రాతలు రాస్తున్నారు: భట్టి
ఏ రాబందులు, ఏ గద్దల కోసం రాతలు రాస్తున్నారు?: భట్టి
ఈ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి?: భట్టి
-
Jan 24, 2026 12:19 IST
ఢిల్లీ: రోజ్‌గార్ మేళాలో పాల్గొన్న ప్రధాని మోదీ
61 వేల మందికి నియామకపత్రాలు అందజేసిన మోదీ
దేశవ్యాప్తంగా 45 చోట్ల 18వ రోజ్గార్ మేళా
-
Jan 24, 2026 12:19 IST
చిరు సినిమాపై విచారణ..
'మన శంకరవరప్రసాద్' టికెట్ ధరలపై తెలంగాణ హైకోర్టులో విచారణ
టికెట్ ధరల పెంపుతో వచ్చిన రూ.42కోట్లను రికవరీ చేయాలని పిటిషన్
వసూళ్ల వివరాలు సమర్పించాలని ప్రభుత్వం, GST అధికారులకు హైకోర్టు ఆదేశం
తదుపరి విచారణ వచ్చే నెల 3కు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
-
Jan 24, 2026 12:17 IST
నాగర్‌కర్నూల్: అమ్రాబాద్‌లో పోలీసుల దాడులు
ప్రజా సంఘాల నాయకుల ఇళ్లలో సోదాలు
మావోయిస్టు సభ్యులకు ఆశ్రయం ఇచ్చినట్టు ఆరోపణలు
అడ్ల అంబయ్య, జక్క బాలయ్య నివాసాల్లో తనిఖీలు
ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆధ్వర్యంలో షెల్టర్ ఇచ్చినట్టు సమాచారం
DKSZC సెక్రటరీ సల్మాన్, ఆయన భార్య సుకుమా సహా.. ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Jan 24, 2026 11:35 IST
భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన పంజాబ్ పోలీసులు
పంజాబ్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్‌లో టెర్రర్ మాడ్యూల్ గుర్తింపు
నిషేధిత ఉగ్రసంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు చెందిన ఆరుగురి అరెస్టు
గణతంత్ర దినోత్సవం వేళ భయాందోళన సృష్టించేందుకు కుట్రపన్నిన బీకేఐ
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉగ్ర ముప్పు ఉన్నట్లు నిఘావర్గాల వెల్లడి
-
Jan 24, 2026 11:31 IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతికి స్వల్పగాయం
గాయం కనిపించడంతో ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన
చిన్న గాయమే అని ప్రమాదం లేదంటూ ట్రంప్ వివరణ
దావోస్(స్విట్జర్‌లాండ్) శాంతి మండలి సమావేశాల్లో గాయమైనట్లు వెల్లడి
ఎడమ చేతికి టేబుల్ తగలడంతో గాయమైందని పేర్కొన్న వైట్ హౌస్
-
Jan 24, 2026 10:50 IST
ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి పరిటాల: సీఎం చంద్రబాబు
నేడు మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి
పరిటాల వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు
పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన నేతంటూ ప్రశంస
ప్రజల గుండెల్లో రవీంద్ర ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారన్న చంద్రబాబు
పరిటాలకు నివాళులర్పిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన సీఎం
-
Jan 24, 2026 10:08 IST
డిప్యూటీ సీఎం భట్టి ప్రెస్‌మీట్.. ఎప్పుడంటే
హైదరాబాద్: మ.12గంటలకు డిప్యూటీ సీఎం భట్టి ప్రెస్‌మీట్
కీలక అంశాలపై మీడియాతో మాట్లాడనున్న భట్టి విక్రమార్క
సింగరేణి అంశంలో బీజేపీ, BRS ఆరోపణలపై స్పందించే అవకాశం
-
Jan 24, 2026 10:07 IST
స్థానికల ఎన్నికల్లో సింహం గుర్తుతో తెలంగాణ జాగృతి నేతల పోటీ
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌తో కలిసి పోటీ చేయాలని నిర్ణయం
మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సింహం గుర్తుతో పోటీ
ఇప్పటికే రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వేగం పెంచిన కవిత
పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తి కావడానికి 2, 3 నెలల సమయం పట్టే అవకాశం
అప్పటివరకు ఏఐఎఫ్‌బీ పార్టీకి చెందిన సింహం గుర్తుతో పోటీకి నిర్ణయం
ఏఐఎఫ్‌బీ రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపిన జాగృతి నాయకత్వం
-
Jan 24, 2026 10:07 IST
నెల్లూరు రూరల్‌లో రికార్డుస్థాయిలో అభివృద్ధి పనులు
240 పనులకు శంకుస్థాపన చేసిన టీడీపీ నేత కోటంరెడ్డి
పాల్గొన్న ఇన్‌చార్జ్ మేయర్ రూప్‌కుమార్, కమిసనర్ నందన్
రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర చరిత్రాత్మక ఘట్టం: కోటంరెడ్డి
రూ.27కోట్లతో చేపట్టిన 240 పనులను ఒకేసారి శంకుస్థాపనలు చేపట్టాం: కోటంరెడ్డి
60 రోజుల్లో పనులన్నీ పూర్తి చేస్తాం: ఎమ్మెల్యే కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి
-
Jan 24, 2026 10:06 IST
ఈగల టీమ్ ఆధ్వర్యంలో వాకథాన్ ర్యాలీ
విజయవాడ ఆస్టర్ రమేష్ ఆస్పత్రి, ఈగల టీమ్ ఆధ్వర్యంలో వాకథాన్ ర్యాలీ
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ప్రదర్శన
పాల్గొన్న ఈగల ఐజీ రవికృష్ణ, సీపీ రాజశేఖర్‌బాబు, ఆస్పత్రి ఎండీ రమేష్‌బాబు
-
Jan 24, 2026 10:05 IST
దావోస్ నుంచి స్వదేశానికి రానున్న ఏపీ మంత్రి లోకేష్
4 రోజుల సదస్సులో 45 సమావేశాల్లో పాల్గొన్న లోకేష్
పారిశ్రామికవేత్తలకు ఏపీలో పెట్టుబడుల అనుకూలతలు వివరించిన లోకేష్
లోకేష్ చొరవతో ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చిన RMZ సంస్థ
-
Jan 24, 2026 09:04 IST
భార్య చేతిలో భర్త బలి
ప్రకాశం జిల్లా: పెద్దారవీడు మండలంలో వివాహేతర సంబంధానికి భర్త బలి
వివాహేతర బంధానికి అడ్డువస్తున్నాడని భర్త కళ్లలో కారం కొట్టి హత్య
తమ్ముడు, ప్రియుడు అతని స్నేహితుడితో కలిసి పథకం ప్రకారం దారుణం
మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రియుడు పరార్
-
Jan 24, 2026 08:31 IST
కల్తీ నెయ్యి కేసు.. సిట్ చార్జిషీట్ ఇదే..
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సిట్ స్పష్టీకరణ
నెల్లూరు కోర్టులో తుది చార్జిషీటు దాఖలు
12 మంది టీటీడీ ఉద్యోగులు సహా 36 మందిపై అభియోగాలు
భోలేబాబా డెయిరీ కేంద్రంగా కల్తీ దందా: సిట్
ఆ డెయిరీకి అసలు ఆవులే లేవు: సిట్
బయటి నుంచి కూడా పాలు కొనలేదు: సిట్
టీటీడీ పెద్దలు, సరఫరాదారులు కుమ్మక్కు: సిట్
-
Jan 24, 2026 07:58 IST
దుమ్మురేపుతున్న బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ మార్కెట్‌లో రూ.1,59,720కి చేరిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం
రూ.1,46,410కి చేరిన 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర
విజయవాడ, వైజాగ్‌లోనూ దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతున్న ధరలు
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం అత్యల్పంగా రూ.1,54,320
ప్రస్తుతం రూ.3.60లక్షలకు చేరిన కిలో వెండి
-
Jan 24, 2026 07:39 IST
రోడ్డుప్రమాదం.. స్పాట్‌లోనే..
ప్రకాశం జిల్లా: కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం
తెల్లవారుజామున రోడ్డు పక్కన ఆగి ఉన్న మినీ లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరి మృతి
మరో 12మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు
-
Jan 24, 2026 07:32 IST
అమెరికాను వణికిస్తున్న 'ఫెర్న్' మంచు
టెక్సాస్, ఓక్లహోమా రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
అమెరికాలో 800కు పైగా విమానాలు ఆలస్యం, రద్దు
మంచుతుఫాన్‌తో జార్జియా, మిసిసిపీ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటన
మరో 3 రోజులు మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిక
అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచన
-
Jan 24, 2026 07:32 IST
అమెరికా మధ్యవర్తిత్వంలో అబుదాబిలో శాంతి చర్చలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో చర్చలు
చర్చల ప్రారంభానికి ముందే షరతు విధించిన రష్యా
డాన్‌బాస్ నుంచి ఉక్రెయిన్ సేనలు వైదొలగాలని రష్యా షరతు
డాన్‌బాస్ ప్రాంతం కీలకమైన అంశమేనన్న ఉక్రెయిన్
రేపటి వరకు కొనసాగనున్న రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు
-
Jan 24, 2026 07:32 IST
ఢిల్లీ: నేడు 18వ రోజ్గార్ మేళా
ఉదయం 11 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా..
18వ రోజ్గార్ మేళాలో పాల్గొననున్న ప్రధాని మోదీ
61 వేల మందికి నియామకపత్రాలు అందజేయనున్న మోదీ
దేశావ్యాప్తంగా 45 చోట్ల 18వ రోజ్గార్ మేళా