Share News

కేంద్ర బడ్జెట్ 2026: తొలి ప్రసంగం నుంచి హల్వా సాంప్రదాయం వరకు.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..

ABN , Publish Date - Jan 24 , 2026 | 05:18 PM

కేంద్ర బడ్జెట్ అంటే ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, ఎదురుచూపులు. ఒక ఆర్థిక సంవత్సరంలో దేశం గమనాన్ని నిర్దేశించేంది కేంద్ర బడ్జెట్. కేంద్ర బడ్జెట్-2026కు సమయం సమీపిస్తున్న తరుణంలో అనేక ఆసక్తికర సాంప్రదాయాలు, చారిత్రక విశేషాల గురించి తెలుసుకుందాం.

కేంద్ర బడ్జెట్ 2026: తొలి ప్రసంగం నుంచి హల్వా సాంప్రదాయం వరకు.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..
Indian Budget facts

కేంద్ర బడ్జెట్ అంటే ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, ఎదురుచూపులు. ఒక ఆర్థిక సంవత్సరంలో దేశం గమనాన్ని నిర్దేశించేది కేంద్ర బడ్జెట్. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కేంద్ర బడ్జెట్-2026కు సమయం సమీపిస్తున్న తరుణంలో అనేక ఆసక్తికర సాంప్రదాయాలు, చారిత్రక విశేషాల గురించి తెలుసుకుందాం (Union Budget 2026).


1. భారత్ తొలి బడ్జెట్ ప్రసంగం

స్వాతంత్ర్యం తర్వాత భారతదేశ తొలి కేంద్ర బడ్జెట్‌ను 1947, నవంబర్ 26న అప్పటి ఆర్థిక మంత్రి ఆర్.కె. షణ్ముఖం చెట్టి ప్రవేశపెట్టారు. కాగా, బ్రిటిష్ పాలనలో భారతదేశ తొలి కేంద్ర బడ్జెట్‌ను ఏప్రిల్ 7, 1860న సమర్పించారు. బ్రిటిష్ పాలనలో అప్పటి భారతదేశ ఆర్థిక మంత్రి జేమ్స్ విల్సన్ ఈ బడ్జెట్‌ను సమర్పించారు (Indian Budget facts).

2. బడ్జెట్ సమయంలో మార్పు

బ్రిటిష్ పాలనలో కేంద్ర బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. బ్రిటన్ కంటే భారతదేశం చాలా గంటలు ముందు ఉన్నందున అక్కడి కాలపు సాంప్రదాయం ప్రకారం సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశపెట్టేవారు. 1999 నుంచి ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ ప్రవేశపెట్టే విధానం అమల్లోకి వచ్చింది. ఇక, 2017 నుంచి ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. అంతకుముందు ఫిబ్రవరి నెల చివరి రోజున ప్రవేశపెట్టే వారు.

nirmala.jpg


3. హల్వా సాంప్రదాయం

బడ్జెట్‌కు కొన్ని రోజుల ముందు ఆర్థిక మంత్రి హల్వా కార్యక్రమం నిర్వహిస్తారు. ఆర్థిక శాఖ కార్యాలయంలో పెద్ద పాత్రలో హల్వాను తయారు చేసి, బడ్జెట్ రూపకల్పనలో పాల్గొన్న అధికారులకు పంచుతారు. హల్వా పంచే కార్యక్రమం జరిగితే బడ్జెట్ ముద్రణ ప్రక్రియ ప్రారంభమైందని అర్థం. ఈ కార్యక్రమం అనంతరం అధికారులు 'లాక్-ఇన్' కాలంలోకి వెళ్తారు. అంటే బడ్జెట్ పూర్తయ్యే వరకు బయట ప్రపంచంతో వారికి సంబంధం ఉండదు (halwa ceremony budget).


4. బ్రీఫ్‌కేస్ నుంచి బహిఖాతా వరకు

గతంలో ఆర్థిక మంత్రులు బడ్జెట్ పత్రాలను లెదర్ బ్రీఫ్‌కేస్‌లో పార్లమెంట్‌కు తీసుకువచ్చేవారు. అయితే 2019లో ఆ సాంప్రదాయానికి స్వస్తి పలికి, బహిఖాతాను పరిచయం చేశారు. ఇది ఆధునికతతో పాటు దేశీయ విలువలను ప్రతిబింబించింది (Union Budget history).

budget2.jpg


5. నిర్మలా సీతారామన్ రికార్డు

ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే వరుసగా అనేక బడ్జెట్లు ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు (Nirmala Sitharaman budget). యూనియన్ బడ్జెట్-2026 కూడా ఆమె చేతుల మీదుగానే రానుంది. ఇక, భారతదేశ చరిత్రలో అత్యంత పొడవైన బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు నిర్మలా సీతారామన్ పేరిట ఉంది. 2020లో ఆమె 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. అంతకు ముందు, 2019లో సీతారామన్ 2 గంటల 17 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు. ఆ తర్వాతి సంవత్సరం తన రికార్డును తానే బద్దలుకొట్టారు.


ఇవి కూడా చదవండి..

అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను.. స్థంభించిన జన జీవనం.. వేల విమాన సర్వీసులు రద్దు..

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎయిరిండియాకు రూ.1,100 కోట్లు..

Updated Date - Jan 24 , 2026 | 06:15 PM