ఇస్లాం ఆవిర్భావం కంటే ముందు నుంచీ భారత్-ఇరాన్ బంధం.. ఖమేనీ ప్రతినిధి..
ABN , Publish Date - Jan 24 , 2026 | 07:15 PM
ఇస్లాం ఆవిర్భావం కంటే వందల సంవత్సరాల ముందే ఇరాన్, భారతదేశం మధ్య పటిష్టమైన బంధం ఏర్పడిందని ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ భారత ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకిమ్ ఇలాహీ పేర్కొన్నారు. ఆ బంధం భవిష్యత్తులో కూడా కొనసాగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇస్లాం ఆవిర్భావం కంటే వందల సంవత్సరాల ముందే ఇరాన్, భారతదేశం మధ్య పటిష్టమైన బంధం ఏర్పడిందని ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకిమ్ ఇలాహీ పేర్కొన్నారు. ఆ బంధం భవిష్యత్తులో కూడా కొనసాగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశ తాత్విక పుస్తకాలను ఇరాన్‌లో అధ్యయనం చేసేవారని అన్నారు. భారత్ భాగస్వామిగా ఉన్న చాబహార్ పోర్టు పురోగతిపై పూర్తి విశ్వాసం ఉందన్నారు (India Iran relations 3,000 years).
'గణితం, ఖగోళ శాస్త్రం, వైద్యంలో భారతదేశం సాధించిన విజయాలను ఇరాన్‌లో అధ్యయనం చేశారు. రెండు పురాతన నాగరికతల మధ్య బంధాన్ని ఇరాన్ ప్రజలు గౌరవిస్తారు. ఇరాన్ సుప్రీం లీడర్ రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు, సహకారం గురించి మాట్లాడుతుంటారు. ఇతర దేశాల ఆంక్షల వల్ల భారత్ ఎప్పుడూ ప్రభావితం కాలేదు. ఇరాన్, భారతదేశం మధ్య పటిష్టమైన బంధం 3000 ఏళ్ల పురాతనమైనది. ఆ సమయంలో భారత దేశ తాత్విక పుస్తకాలను ఇరాన్‌లో అధ్యయనం చేసేవారు' అని హకిమ్ ఇలాహీ పేర్కొన్నారు (India Iran history).
మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యం కోసం ఇరాన్‌లోని చాబహార్ పోర్ట్‌లో భారత్ పెట్టుబడులు పెట్టింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఆ పోర్ట్ టెర్మినల్‌ను భారత్ పదేళ్ల పాటు నిర్వహించనుంది. ఇటీవల ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై అమెరికా 50 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ పోర్ట్ విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చింది (ancient civilisational ties).
కాగా, ఇటీవల ఇరాన్‌లోని నిరసనల అణిచివేతను విమర్శిస్తూ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి అత్యవసర సమావేశంలో ప్రవేశ పెట్టిన తీర్మానానికి భారత్ వ్యతిరేకంగా ఓటు వేసింది. దీంతో భారత ప్రభుత్వానికి ఇరాన్ రాయబారి మహ్మద్ ఫథాలీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఓటింగ్‌కు 25 దేశాలు మద్దతు పలకగా, భారత్, చైనా సహా ఏడు దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. మరో 14 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను.. స్థంభించిన జన జీవనం.. వేల విమాన సర్వీసులు రద్దు..
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎయిరిండియాకు రూ.1,100 కోట్లు..