అండర్-19 వరల్డ్ కప్.. న్యూజిలాండ్ 135 పరుగులకే ఆలౌట్
ABN , Publish Date - Jan 24 , 2026 | 06:20 PM
అండర్ 19 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్లు బులవాయో వేదికగా తలపడుతున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్‌ను 37 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన కివీస్ 135 పరుగులకే ఆలౌటైంది.
ఇంటర్నెట్ డెస్క్: అండర్ 19 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్లు బులవాయో వేదికగా తలపడుతున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్‌ను 37 ఓవర్లకు కుదించారు. పిచ్ తడిగా ఉండటంతో టాస్ కూడా ఆలస్యమైంది. అయితే టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుని తొలుత కివీస్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే టీమిండియా కుర్రాళ్ల ధాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. 36.2 ఓవర్లలోనే 135 పరుగులకు కివీస్ ఆలౌటైంది. టీమిండియాకు 136 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒకానొక దశలో 22 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్.. జాకబ్ కాటర్(23), జస్కరన్ సంధు(18) నిలవడంతో కాస్త గాడిన పడింది. వీరిద్దరూ స్పల్ప వ్యవధిలోనే ఔటవ్వడంతో 69/7తో కివీస్ మళ్లీ కష్టాల్లో పడింది.
ఈ దశలో కల్లమ్ శాంసన్(37*), సెల్విన్ సంజయ్(28) జట్టును ఆదుకున్నారు. కల్లమ్ శాంసన్‌నే టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లంతా టీమిండియా కుర్రాళ్ల ధాటికి పెవిలియన్‌ను క్యూ కట్టారు. భారత బౌలర్లలో ఆర్ఎస్ అంబరీష్ 4, హెనిల్ పటేల్ 3 వికెట్లతో కివీస్ ఓటమిని శాసించారు. ఖిలాన్ పటేల్, మహ్మద్ ఎనాన్, కనిష్క్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ 2026: బంగ్లాదేశ్‌పై వేటు.. స్కాట్లాండ్‌ను రిప్లేస్‌మెంట్‌గా ప్రకటించిన ఐసీసీ
ఇది టీమిండియాకు శుభపరిణామం.. సూర్య ఫామ్‌పై స్పందించిన సునీల్ గావస్కర్