Share News

ఆమె వల్లే ఫామ్‌లోకి వచ్చా.. సూర్యకుమార్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jan 24 , 2026 | 05:55 PM

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఫామ్ అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో సూర్య చెలరేగి ఆడాడు. ఈ నేపథ్యంలో సూర్య ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. పేలవమైన ఫామ్‌‌లో ఉన్నప్పుడు తన భార్య దేవిషా శెట్టి ఇచ్చిన సలహా వల్లే తిరగి ఫామ్ అందుకున్నానని సూర్య చెప్పుకొచ్చాడు.

ఆమె వల్లే ఫామ్‌లోకి వచ్చా.. సూర్యకుమార్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Suryakumar Yadav

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఫామ్ అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో సూర్య(82*) చెలరేగి ఆడాడు. స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్(76) కూడా అదరగొట్టాడు. దీంతో 209 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 15.2 ఓవర్లలోనే ఛేదించింది. మ్యాచ్ అనంతరం సూర్య, ఇషాన్ సంభాషించుకున్నారు. ఈ నేపథ్యంలో సూర్య ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. పేలవమైన ఫామ్‌‌లో ఉన్నప్పుడు తన భార్య దేవిషా శెట్టి ఇచ్చిన సలహా వల్లే తిరిగి ఫామ్ అందుకున్నానని సూర్య(Suryakumar Yadav) చెప్పుకొచ్చాడు.


‘కొన్నిసార్లు మనకు ఇంట్లో కూడా కోచ్ ఉంటారు. వారెవరో కాదు మన జీవిత భాగస్వామి. దేవిషా శెట్టి(Devisha Shetty) నన్ను దగ్గరి నుంచి చూసింది. ఆమెకు నా మనసు కూడా తెలుసు. ఇటీవల ఆమె నాకు ఓ సలహా ఇచ్చింది. ఆరంభంలో దూకుడు తగ్గించి కాస్త నెమ్మదిగా ఆడాలని కోరింది. ఆ సలహాను న్యూజిలాండ్‌తో తొలి రెండు మ్యాచుల్లో పాటిస్తూ జాగ్రత్తగా ఆడాను. ఇన్నింగ్స్ ఆరంభంలో నెమ్మదిగా తను చెప్పినట్టే ఆడాను. నేను నెట్స్‌లో చక్కగా బ్యాటింగ్ చేస్తున్నానని చెబుతూనే ఉన్నా. కానీ మ్యాచ్‌లలో స్కోరు చేస్తేనే పూర్తి స్థాయిలో నమ్మకం కలుగుతుంది. 2-3 రోజులుగా బాగా విశ్రాంతి తీసుకున్నా. ఇంటికి వెళ్లాను. సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నా. గత మూడు వారాలు బాగా ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు నా మైండ్ సెట్ చాలా బాగుంది. దాని ఫలితం ఇప్పుడు నా ఆటలో కనిపిస్తోంది’ అని సూర్య అన్నాడు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్ 2026: బంగ్లాదేశ్‌పై వేటు.. స్కాట్లాండ్‌ను రిప్లేస్‌మెంట్‌గా ప్రకటించిన ఐసీసీ

ఇది టీమిండియాకు శుభపరిణామం.. సూర్య ఫామ్‌పై స్పందించిన సునీల్ గావస్కర్

Updated Date - Jan 24 , 2026 | 05:58 PM