నేడు పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి.. నివాళులర్పించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jan 24 , 2026 | 08:57 AM
దివంగత టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవి 21వ వర్ధంతి సందర్భంగా ఆయనకు టీడీపీ నేతలు ఘన నివాళులు అర్పిస్తున్నారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన నేతగా ఆయన ప్రత్యేక స్థానం సంపాదించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఆంధ్రజ్యోతి, జనవరి 24: మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి సందర్భంగా ఆయనకు టీడీపీ నేతలు ఘన నివాళులు అర్పిస్తున్నారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన నేతగా పరిటాల రవీంద్ర ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.
ప్రజాసేవనే ధ్యేయంగా రాజకీయ జీవితాన్ని కొనసాగించిన ఆయన.. అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అనంతపురం జిల్లా ప్రజల విశ్వాసాన్ని పొందారని చెప్పారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు సీఎం చంద్రబాబు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పరిటాల అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఘోర రోడ్డుప్రమాదాలు.. స్పాట్ లోనే ఇద్దరి మృతి..
ప్రియుడి కోసం తమ్ముడితో కలిసి భర్తను చంపిన భార్య..