Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Mar 12 , 2026 | 07:24 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Mar 12, 2026 21:35 IST

    కర్షకులకు కూటమి ప్రభుత్వ ఉగాది కానుక

    • రేపు అన్నదాత సుఖీభవ 3.0 సాయం

    • 46.85 లక్షల మందికి రూ.6వేల చొప్పున జమ

  • Mar 12, 2026 20:01 IST

    ఇరాన్‌ నూతన సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ తొలి హెచ్చరిక

    • గల్ప్‌లోని అమెరికా సైనిక స్థావరాలను తక్షణం మూసివేయాలి: మొజ్తాబా

    • అమెరికా సైనిక స్థావరాలు మూసివేయకపోతే దాడులు తప్పవు: మొజ్తాబా

    • హర్మూజ్‌ జలసంధి మూసివేత కొనసాగుతుంది: మొజ్తాబా ఖమేనీ

    • శత్రువులపై ఒత్తిడి పెంచేందుకు హర్మూజ్‌ మూసివేత తప్పదు: మొజ్తాబా

    పూర్తి కథనం

  • Mar 12, 2026 20:00 IST

    ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    • పన్ను ఎగవేత లేకుండా పటిష్ట కార్యాచరణ చేపట్టాలి: చంద్రబాబు

    • పరిశ్రమలు, సేవారంగం అభివృద్ధి జరిగితే ఆదాయం: చంద్రబాబు

    • ప్రతిరంగంలో వృద్ధి సాధించి GSDP లక్ష్యం చేరుకోవాలి: చంద్రబాబు

  • Mar 12, 2026 19:59 IST

    గతంలో చెప్పిన అబద్ధాలనే జగన్‌ మళ్లీ ప్రెస్‌మీట్‌లో చెప్పారు: మంత్రి పయ్యావుల కేశవ్

    • వాళ్లు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని మాపై నెట్టేందుకు ప్రయత్నించారు: మంత్రి పయ్యావుల

    • మా ప్రభుత్వం రూ.1.05 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసింది: పయ్యావుల

    • రూ.3.5లక్షల కోట్లు అప్పు చేశామని జగన్‌ అబద్ధాలు చెబుతున్నారు: పయ్యావుల

  • Mar 12, 2026 19:58 IST

    పశ్చిమాసియాలో యుద్ధంతో గ్యాస్ సరఫరాలో అంతరాయం: మంత్రి పొన్నం

    • వంట గ్యాస్, కమర్షియల్ సిలిండర్ల కొరత తీవ్రంగా పెరిగింది: మంత్రి పొన్నం

    • సంక్షోభ సమయంలో కేంద్రం పెదన్న పాత్ర పోషించాలి: పొన్నం ప్రభాకర్

    • గ్యాస్ కొరత లేకపోతే ధరలు ఎందుకు పెంచారో కేంద్రం చెప్పాలి: పొన్నం

  • Mar 12, 2026 19:03 IST

    BRS మూడు ముక్కలైంది: TPCC చీఫ్‌ మహేష్‌గౌడ్

    • దళితులను అవమానించిన బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాలేదు: మహేష్‌గౌడ్

    • కాంగ్రెస్ పునాదుల్లోనే దళిత వాదం ఉంది: మహేష్‌గౌడ్

  • Mar 12, 2026 18:36 IST

    కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్లపై కేంద్రం కీలక ప్రకటన

    • కొన్ని ఎల్‌పీజీ సిలిండర్లు విడుదల చేస్తామన్న పెట్రోలియం మంత్రిత్వ శాఖ

    • లబ్ధిదారులను గుర్తించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన

    • ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయంగా రాష్ట్రాలకు అదనంగా 40,000 కిలోలీటర్ల కిరోసిన్

    పూర్తి కథనం

  • Mar 12, 2026 18:34 IST

    ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్

    • గ్రేటర్ హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన జీహెచ్ఎంసీ

    • ఆస్తి పన్ను బకాయి చెల్లించేవారికి 'వన్ టైమ్ సెటిల్మెంట్' ఆఫర్

    • ఈనెల 31వ తేదీలోగా చెల్లిస్తే వడ్డీపై ఏకంగా 90 శాతం రాయితీ

    పూర్తి కథనం

  • Mar 12, 2026 18:07 IST

    సోషల్‌ మీడియా ప్రచారాలపై స్పందించిన నటి రష్మిక

    • 8 ఏళ్లుగా నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు: రష్మిక

    • నా పాత ప్రైవేట్ ఆడియోను లీక్‌ చేశారు: నటి రష్మిక

    • నా కుటుంబం, స్నేహితుల ప్రైవసీని దెబ్బతీస్తున్నారు: రష్మిక

  • Mar 12, 2026 18:06 IST

    వంట గ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన

    • ప్రతిరోజు 50లక్షల సిలిండర్లు సరఫరా: కేంద్రం

    • హోర్ముజ్ జలసంధి నుంచే మెజారిటీ శాతం సరఫరా: కేంద్రం

    • హోర్ముజ్ జలసంధిలోని 28 భారత నౌకలు సేఫ్‌గా ఉన్నాయి: కేంద్రం

    పూర్తి కథనం

  • Mar 12, 2026 18:04 IST

    అమ్మోనియా పైప్‌లైన్ లీక్

    • పెద్దపల్లి: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో అమ్మోనియా పైప్‌లైన్ లీక్

    • యూరియా ఉత్పత్తి నిలిపివేసిన అధికారులు

    • మిడిల్ ఈస్ట్‌లో యుద్ధంతో ఇప్పటికే 50శాతం తగ్గిన ఉత్పత్తి

  • Mar 12, 2026 17:47 IST

    కేంద్రమంత్రి నడ్డాకు మంత్రి తుమ్మల లేఖ

    • తెలంగాణకు యూరియా కేటాయించాలని కోరుతూ లేఖ

    • నెలకు 2లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున ఏప్రిల్, మే, జూన్‌కు..

    • యూరియా కేటాయించాలని కేంద్రాన్ని కోరిన మంత్రి తుమ్మల

    పూర్తి కథనం

  • Mar 12, 2026 17:46 IST

    లోక్‌సభలో విపక్ష సభ్యులపై స్పీకర్ ఆగ్రహం

    • సభలో విపక్షాల తీరు సరిగా లేదు: స్పీకర్ ఓం బిర్లా

    • సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలి: స్పీకర్

    • సభ జరగకూడదని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి: స్పీకర్

  • Mar 12, 2026 17:01 IST

    ఇంధన కొరతపై కేంద్రమంత్రి క్లారిటీ..

    • భారత్‌లో పెట్రోలియం కొరత లేదు: కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్

    • ప్రధాని చర్చలతో పరిస్థితులు సర్దుకుంటున్నాయి: హర్దీప్‌సింగ్

    • పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన సరఫరాలో ఎలాంటి కొరత లేదు: హర్దీప్‌సింగ్

    • దేశీయ రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి: హర్దీప్‌సింగ్

    పూర్తి కథనం

  • Mar 12, 2026 16:59 IST

    లోక్ సభలో ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను ప్రస్తావించిన రాహుల్‌గాంధీ

    • పెట్రోలియం మంత్రికి ఎప్‌స్టీన్‌తో సంబంధాలు: రాహుల్

    • ఎప్‌స్టీన్‌తో పరిచయం ఉన్నట్టు పెట్రోలియం మంత్రి అన్నారు: రాహుల్

    • రాహుల్‌ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ అభ్యంతరం

    పూర్తి కథనం

  • Mar 12, 2026 16:57 IST

    వంట గ్యాస్ కొరతపై లోక్‌సభలో రాహుల్‌గాంధీ ప్రసంగం

    • గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది: రాహుల్‌గాంధీ

    • భారత్ వ్యవహారాలను అమెరికా శాసిస్తోంది: రాహుల్

    • రష్యా ఆయిల్‌ను కొనడానికి ఎవరి అనుమతి కావాలి?: రాహుల్

  • Mar 12, 2026 16:39 IST

    ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కామెంట్స్..

    • 'అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా' కార్యక్రమం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించడం సంతోషం: ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

    • ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయి: ఎమ్మెల్యే విజయ్

    • ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు: ఎమ్మెల్యే విజయ్

    • నియోజకవర్గంలో డ్రైనేజ్, రోడ్లు, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నాం: ఎమ్మెల్యే విజయ్

    పూర్తి కథనం

  • Mar 12, 2026 16:34 IST

    ఇంధన భద్రతపై ప్రభుత్వం రాజీపడింది: ఎంపీ రాహుల్ గాంధీ

    • లోపభూయిష్ఠమైన విదేశాంగ విధానం వల్లే ఎల్పీజీ కొరత: రాహుల్

    • పార్లమెంటు ఆవరణలో నిరసన సందర్భంగా రాహుల్ ఆగ్రహం

    • మోదీ జీ, ఎల్పీజీ అంటూ నినాదాలు చేసిన ప్రతిపక్షాల ఎంపీలు

    పూర్తి కథనం

  • Mar 12, 2026 15:57 IST

    నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

    • 829 పాయింట్ల నష్టంతో 76,034 వద్ద ముగిసిన సెన్సెక్స్

    • 227 పాయింట్ల నష్టంతో 23,639 వద్ద ముగిసిన నిఫ్టీ

  • Mar 12, 2026 15:52 IST

    వంట గ్యాస్ బుకింగ్ గడువు మరోసారి పెంపు

    • గ్రామాల్లో 25 రోజుల నుంచి 45 రోజులకు పెంపు

    • పట్టణాలు, నగరాల్లో కొనసాగనున్న 25 రోజుల నిబంధన

  • Mar 12, 2026 15:20 IST

    గ్యాస్ కొరత ఉందో లేదో పరిశీలిస్తున్నాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    • పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం: ఉత్తమ్

    • రాష్ట్రంలో 86శాతం డొమెస్టిక్.. 14శాతం కమర్షియల్ గ్యాస్ వినియోగం: ఉత్తమ్

    • ప్రస్తుతం గృహ వినియోగ గ్యాస్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు: ఉత్తమ్

    పూర్తి కథనం

  • Mar 12, 2026 15:19 IST

    వంట గ్యాస్ కొరత.. కాంగ్రెస్ సర్కార్ సమీక్ష

    • హైదరాబాద్: వంట గ్యాస్ కొరతపై రేపు తెలంగాణ ప్రభుత్వం సమీక్ష

    • హాజరుకానున్న సీఎస్, సివిల్ సప్లయ్ అధికారులు

    • హాజరుకానున్న చమురు కంపెనీల ప్రతినిధులు

  • Mar 12, 2026 15:03 IST

    ఏపీలో గ్యాస్ సంక్షోభం.. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్

    • ఇండేన్ IVRS, వాట్సాప్ బుకింగ్‌లు డౌన్

    • గ్యాస్ బుకింగ్‌లకు భారీ డిమాండ్.. ఒకే రోజు మూడు రెట్లు పెరుగుదల

    • గ్యాస్ కోసం డీలర్ల వద్దకు పరుగులు తీస్తున్న ప్రజలు

    పూర్తి కథనం

  • Mar 12, 2026 15:02 IST

    హైదరాబాద్: నెట్ ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్ స్టూడియోస్ కార్యాలయం ప్రారంభం

    • ఐలైన్ స్టూడియోస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

    • నాకు సినిమాలపై ఆసక్తి ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

    • నా బాల్యం నుంచి ఇప్పటివరకూ సినిమాలో అనేక మార్పులు వచ్చాయి: సీఎం రేవంత్ రెడ్డి

    పూర్తి కథనం

  • Mar 12, 2026 14:53 IST

    హైదరాబాద్: మంత్రి పొన్నంతో ప్రొఫెసర్ కోదండరాం, MLC అద్దంకి భేటీ

    • ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన..

    • హామీల అమలుకు కమిటీ ఏర్పాటుపై ప్రాథమిక సమావేశం

    • ఉద్యమకారుల డిమాండ్స్ గుర్తించి అధ్యయనం చేయాలని నిర్ణయం

  • Mar 12, 2026 14:30 IST

    పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

    • మహబూబ్‌నగర్‌: భూత్పూర్ మండలం వెల్కిచర్లలో దారుణం

    • ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య

  • Mar 12, 2026 13:52 IST

    తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన

    • మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు

    • ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు స్కూల్

    • పరీక్ష కేంద్రాలు ఉన్న స్కూళ్లలో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 వరకు స్కూల్

    పూర్తి కథనం

  • Mar 12, 2026 13:44 IST

    కరీంనగర్‌: హోటళ్లు, గ్యాస్‌ రీఫిల్లింగ్‌ సెంటర్స్‌పై టాస్క్‌ఫోర్స్‌ దాడులు

    • అక్రమంగా గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తున్న పలువురిపై కేసులు నమోదు

  • Mar 12, 2026 13:25 IST

    పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీంకోర్టు విచారణ

    • కేసును డిస్పోజ్‌ చేసిన సుప్రీంకోర్టు

    • ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ క్లీన్‌చిట్

    • స్పీకర్‌ ఆదేశాలను అధికారికంగా ప్రకటించాలని ధర్మాసనం ఆదేశం

    పూర్తి కథనం

  • Mar 12, 2026 13:23 IST

    మలయాళ నటుడు హరి మురళి మృతి

    • ఇంట్లో శవమై కనిపించిన నటుడు

    • మృతదేహాన్ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన కుటుంబసభ్యులు

  • Mar 12, 2026 13:18 IST

    ఇరాన్‌తో కొనసాగుతున్న అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం

    • తొలి 6 రోజుల్లో అమెరికాకు రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు

    • వ్యయం వివరాలు వెల్లడించిన అమెరికా రక్షణశాఖ అధికారులు

  • Mar 12, 2026 13:16 IST

    జయశంకర్‌ భూపాలపల్లి: బస్టాండ్‌లో కండక్టర్‌ను కొట్టిన మహిళ

    • పోలీసులకు ఫిర్యాదు చేసిన కండక్టర్, కేసు నమోదు

  • Mar 12, 2026 13:15 IST

    హైటెక్‌ సిటీలో నెట్‌ఫ్లిక్స్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

    • దేశంలోనే నెట్‌ఫ్లిక్స్‌ రెండో ప్రధాన కార్యాలయం ప్రారంభం

    • నెట్‌ఫ్లిక్స్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తున్నాం: సీఎం రేవంత్‌

    • హైదరాబాద్‌ అన్ని అవకాశాలను కల్పిస్తుంది: సీఎం రేవంత్

    • మా ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుంది: సీఎం రేవంత్‌

  • Mar 12, 2026 13:10 IST

    మాజీ ఎమ్మెల్సీ కవిత నివాసానికి సీబీఐ అధికారులు

    • కవితకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన సీబీఐ

    • నోటీసులు అందుకున్న కవిత భర్త అనిల్‌

    • లిక్కర్‌ కేసులో కవితకు రౌస్‌ అవెన్యూ కోర్టు క్లీన్‌చిట్‌

    • ఢిల్లీ హైకోర్టులో అప్పీల్‌ చేసిన సీబీఐ

    • హైకోర్టు నోటీసులు ఇచ్చేందుకు కవిత నివాసానికి సీబీఐ

  • Mar 12, 2026 12:39 IST

    ఢిల్లీ: లోక్‌సభ 2 గంటలకు వాయిదా

    • దేశంలో గ్యాస్ కొరతపై చర్చించాలని నోటీసు ఇచ్చిన రాహుల్ గాంధీ

    • రాహుల్ గాంధీ ఇచ్చిన నోటీసుపై చర్చకు సిద్ధమన్న కేంద్రం

  • Mar 12, 2026 12:26 IST

    సుంకాల వసూలు కోసం ట్రంప్‌ '301' ఆయుధం

    • 1974 అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301

    • భారత్‌ సహా 16 దేశాలపై దర్యాప్తునకు ట్రంప్ ఆదేశం

    • సుంకాల వసూలు జాబితాలో లేని కెనడా

  • Mar 12, 2026 12:08 IST

    హైదరాబాద్‌: మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు అంతిమయాత్ర

    • కాసేపట్లో జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

  • Mar 12, 2026 12:08 IST

    లోక్‌సభలో స్పీకర్‌ ఓం బిర్లా ప్రసంగం

    • నిన్న అవిశ్వాసం వీగడంతో లోక్‌సభకు స్పీకర్‌ ఓం బిర్లా

    • భారత ప్రజల ప్రతిబింబం పార్లమెంట్‌: ఓం బిర్లా

    • సభా నియమాలకు కట్టుబడే అందరికీ అవకాశాలు: ఓం బిర్లా

    • నిబంధనల ప్రకారమే సభ నడిపిస్తున్నాం: స్పీకర్‌ ఓం బిర్లా

    • ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నామనేది అవాస్తవం: ఓం బిర్లా

    • విపక్షాలు మాట్లాడితేనే ప్రజాస్వామ్యం గెలుస్తుంది: ఓం బిర్లా

  • Mar 12, 2026 12:01 IST

    రాజ్యసభ: ఫరూక్‌ అబ్దుల్లా భద్రతపై ఖర్గే ప్రస్తావన

    • కశ్మీర్‌ ప్రజలకు రక్షణ లేకుండా పోయింది: ఖర్గే

    • మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం

  • Mar 12, 2026 12:01 IST

    రాజ్యసభలో విపక్షాల నినాదాలు

    • దేశంలో గ్యాస్‌ కొరతపై విపక్షాల నిరసన

  • Mar 12, 2026 12:00 IST

    పార్లమెంట్‌ వెలుపల విపక్షాల ఆందోళన

    • దేశంలో గ్యాస్‌ కొరతపై విపక్షాల నిరసన

  • Mar 12, 2026 11:59 IST

    టెల్‌ అవీవ్‌ ఎయిర్‌పోర్టులో గందరగోళం

    • ఎయిర్‌ టికెట్ల కోసం ప్రయాణికుల ఘర్షణ

    • ఇజ్రాయెల్‌ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు

    • దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నాలు

  • Mar 12, 2026 11:20 IST

    ఫుట్‌బాల్‌ వరల్డ్ కప్ 2026లో పాల్గొనం: ఇరాన్‌

    • మా ఆటగాళ్లపై అమెరికా దాడి చేసే అవకాశం ఉంది: ఇరాన్

    • గడిచిన తొమ్మిది నెలల్లోనే రెండోసారి మాపై యుద్ధం చేస్తోంది: ఇరాన్

    పూర్తికథనం

  • Mar 12, 2026 11:10 IST

    రంగారెడ్డి: కొత్తూరు మున్సిపాలిటీ పెద్ద షాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

    • బైకును అతివేగంగా ఎదురుగా వచ్చి ఢీకొన్న లారీ

    • ఇంటర్ పరీక్షకు వెళ్తూ ఇద్దరు విద్యార్థుల మృతి

    • మృతులు కొత్తూరుకి చెందిన సూరజ్, బిక్కి గా గుర్తింపు

  • Mar 12, 2026 11:08 IST

    ఇరాన్ యుద్ధంపై మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

    • తప్పుడు ప్రచారం చేసేవారిపై నిఘా పెట్టండి: ప్రధాని మోదీ

    • విపక్షాల సోషల్ మీడియా ప్రచారాన్ని తిప్పికొట్టండి: మోదీ

    • యుద్ధం యావత్ ప్రపంచాన్నే ప్రభావితం చేస్తోంది: ప్రధాని

    • ముందస్తు ఏర్పాట్లు బలంగా చేశాం: ప్రధాని మోదీ

    • అనేక దేశాల కంటే భారత్‌ మెరుగ్గా ఉంది: ప్రధాని మోదీ

  • Mar 12, 2026 11:07 IST

    విజయవాడ: కిడ్నాప్‌ కేసులో పిన్నెల్లి అనుచరుడు వీరభద్రరావు అరెస్టు

    • 2023లో హైకోర్టు లాయర్‌ను నిర్బంధించి హింసించిన పిన్నెల్లి అనుచరులు

    • గతంలో పిన్నెల్లి అనుచరులకు డీఎస్‌పీ పల్లంరాజు, ఎస్ఐ రబ్బానీ సహకారం

    • సస్పెన్షన్‌లో ఉన్న డీఎస్పీ పల్లంరాజు, ఎస్ఐ రబ్బానీ అరెస్టుకు రంగం సిద్ధం

    • దొంగ కేసు పెట్టి ఆస్తులు రాయించుకున్నట్లు బాధితుడు ఫిర్యాదు

  • Mar 12, 2026 11:06 IST

    విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ జెన్కో ఆల్‌టైమ్‌ రికార్డ్‌

    • 6,101 మెగావాట్లతో రికార్డు స్థాయి విద్యుత్‌ ఉత్పత్తి

    • రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తిపై మంత్రి గొట్టిపాటి హర్షం

  • Mar 12, 2026 11:05 IST

    అభివృద్ధి విషయంలో కలెక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలి: చంద్రబాబు

    • స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌పై కలెక్టర్లు దృష్టి పెట్టాలి

    • పరిశ్రమలు రాని జిల్లాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి

    • వనరులను సరైన రీతిలో ఉపయోగించుకోవాలి

  • Mar 12, 2026 11:04 IST

    ఏబీఎన్‌తో తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌ వినోద్‌

    • పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తెలంగాణపై పడింది: వినోద్‌

    • గల్ఫ్‌ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులతో సంప్రదిస్తున్నాం: వినోద్

    • యుద్ధం కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం: వినోద్‌

    • ట్రంప్‌ ఆధిపత్య ఆలోచనల వల్లే ఇబ్బందులు: వినోద్

  • Mar 12, 2026 10:54 IST

    మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు

    • బాంబు పెట్టామంటూ దుండగులు మెయిల్‌, పోలీసుల తనిఖీలు

  • Mar 12, 2026 10:53 IST

    కాకినాడ: శంఖవరం, ప్రత్తిపాడు మండలాల పరిధిలో పులి సంచారం

    • శంఖవరం, ప్రత్తిపాడు, దారపల్లి, తాడ్వాయి పరిసరాల్లో పులి కదలికలు

    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారుల హెచ్చరికలు

  • Mar 12, 2026 10:52 IST

    రాజమండ్రి కల్తీ పాల ఘటనలో 13కి చేరిన మృతులు

    • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వీరలక్ష్మి (60) మృతి

  • Mar 12, 2026 10:49 IST

    భారత్‌-ఇరాన్ విదేశాంగ మంత్రుల భేటీలో కీలక నిర్ణయం

    • భారత నౌకలకు హోర్ముజ్‌ జలసంధిలో ఇరాన్ అనుమతులు

  • Mar 12, 2026 10:48 IST

    తిరుపతి: చంద్రగిరి మండలంలో ఏనుగుల గుంపు సంచారం

    • చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలో గజరాజుల బీభత్సం

    • వరి, మామిడి తోటలను ధ్వంసం చేసిన ఏనుగులు

  • Mar 12, 2026 10:37 IST

    భారీ నష్టాల్లో దేశీయ సూచీలు

    • ప్రస్తుతం సెన్సెక్స్ 750 పాయింట్ల నష్టంతో ఉంది

    • నిఫ్టీ 256 పాయింట్ల నష్టంతో ఉంది

    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 92.35గా ఉంది

    పూర్తికథనం

  • Mar 12, 2026 10:36 IST

    సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండోరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌

    • సూపర్‌ సిక్స్‌, సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్య..

    • వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై చర్చ

    • శాంతిభద్రతలపై ఎస్పీలతో సమీక్షించనున్న సీఎం చంద్రబాబు

  • Mar 12, 2026 10:28 IST

    తగ్గిన బంగారం, వెండి ధరలు..

    • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,220

    • నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.1090 మేర తగ్గుదల

    • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,700 దగ్గర ఉంది

    • నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.1000 మేర తగ్గుదల

    • హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 2.9 లక్షలకు దిగి వచ్చింది

    పూర్తికథనం

  • Mar 12, 2026 09:37 IST

    ఒమన్‌ సలాలా పోర్టుపై ఇరాన్‌ డ్రోన్‌ దాడి

    • ఇరాన్‌ దాడిలో ఒమన్‌ ఆయిల్‌ ట్యాంక్‌లు దగ్ధం

    • కొన్ని డ్రోన్లను కూల్చివేసిన ఒమన్‌ రక్షణ సంస్థ

  • Mar 12, 2026 09:27 IST

    నిజామాబాద్‌: ఇందల్వాయి కాంగ్రెస్‌ మాజీ ఎంపీపీ గోపి హత్య

    • గోపిపై కత్తితో దాడిచేసి హత్య చేసిన మేనల్లుడు సతీష్‌

    • పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు సతీష్‌

  • Mar 12, 2026 09:26 IST

    ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ భీకర దాడులు

    • లెబనాన్‌ నుంచి హెజ్బొల్లా రాకెట్‌ దాడులు

    • టెల్‌ అవీవ్‌పై బాలిస్టిక్‌ మిస్సైల్స్‌తో ఇరాన్ దాడి

    • మిస్సైల్స్‌ను అడ్డుకున్న ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థ

    • దక్షిణ ఇజ్రాయెల్‌లోనూ అలర్ట్

  • Mar 12, 2026 08:18 IST

    ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ కీలక ప్రకటన

    • యుద్ధానికి ముగింపు పలకాలంటే మా షరతులు అంగీకరించాల్సిందే

    • భవిష్యత్‌లోనూ మా దేశంపై ఎవరూ దాడులు చేయకూడదు

    • మా న్యాయపరమైన హక్కులను ప్రపంచం గుర్తించాలి

  • Mar 12, 2026 08:17 IST

    పశ్చిమాసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్‌

    • దేశవ్యాప్తంగా వంటగ్యాస్‌ కొరత

    • తగ్గిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా

    • మూతపడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు

    • గృహ వినియోగదారులు ఆందోళన చెందొద్దు: కేంద్రం

  • Mar 12, 2026 08:17 IST

    ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ డ్రోన్ల బీభత్సం

    • సరికొత్త వ్యూహాలతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌

    • మిలిటరీ బేస్‌లు, పోలీస్‌ స్టేషన్‌లు లక్ష్యంగా దాడులు

  • Mar 12, 2026 08:17 IST

    ఇరాన్‌పై కొనసాగుతున్న ఇజ్రాయెల్‌, US దాడులు

    • యుద్ధంతో ఇరాన్‌లో 1300 మందికిపైగా మృతి

  • Mar 12, 2026 08:16 IST

    అంతర్జాతీయ ఇంధన సంస్థ(IEA) కీలక నిర్ణయం

    • మార్కెట్లపై ఇంధన ఒత్తిడి తగ్గింపు దిశగా చర్యలు

    • అత్యవసర నిల్వల నుంచి 400 మిలియన్‌ బ్యారెళ్ల..

    • చమురు విడుదల చేస్తున్నట్లు IEA ప్రకటన

  • Mar 12, 2026 08:16 IST

    హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం కావూరి సాంబశివరావు అంత్యక్రియలు

    • మహాప్రస్థానంలో కావూరి సాంబశివరావు అంత్యక్రియలు

    • ఉదయం 10.30 గంటలకు కావూరికి నివాళులర్పించనున్న కేటీఆర్‌

  • Mar 12, 2026 08:15 IST

    నేడు లోక్‌సభకు స్పీకర్‌ ఓం బిర్లా

    • అవిశ్వాసం వీగడంతో లోక్‌సభకు రానున్న స్పీకర్‌

  • Mar 12, 2026 08:15 IST

    హైదరాబాద్‌: నేడు హైటెక్‌ సిటీలో సీఎం రేవంత్‌ పర్యటన

    • నెట్‌ఫ్లిక్స్‌ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్

    • మధ్యాహ్నం విద్యుత్‌ శాఖపై సమీక్షించనున్న సీఎం రేవంత్

  • Mar 12, 2026 07:30 IST

    నేడు బంగారం, వెండి ధరలు..

    • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,320

    • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,710

    • ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,63,470

    • 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,49,860

    • హైదరాబాద్‌లో కిలో వెండి ధర దాదాపు రూ.3 లక్షలుగా ఉంది

    పూర్తికథనం

  • Mar 12, 2026 07:28 IST

    అమరావతి: నేడు రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌

    • సూపర్‌ సిక్స్‌, సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్య..

    • వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై చర్చ

    • శాంతిభద్రతలపై ఎస్పీలతో సమీక్షించనున్న సీఎం చంద్రబాబు

    CM-Chandrababu.jpg

  • Mar 12, 2026 07:24 IST

    పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై నేడు సుప్రీంకోర్టు విచారణ

    • 10 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ క్లీన్‌చిట్