Share News

గ్యాస్ కొరత.. పరిస్థితి చేయి దాటి పోకుండా ఉండేందుకే: మంత్రి ఉత్తమ్

ABN , Publish Date - Mar 12 , 2026 | 03:58 PM

తెలంగాణలో కమర్షియల్ సిలిండర్ల కొరత వాస్తవమేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిత్యం సరఫరా అవుతున్న వంట గ్యాస్ సిలిండర్లలో దాదాపు 86 శాతం డొమెస్టిక్ కనెక్షన్లేనని ఆయన స్పష్టం చేశారు.

గ్యాస్ కొరత.. పరిస్థితి చేయి దాటి పోకుండా ఉండేందుకే: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, మార్చి12: తెలంగాణలో కమర్షియల్ సిలిండర్ల కొరత వాస్తవమేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిత్యం సరఫరా అవుతున్న వంట గ్యాస్ సిలిండర్లలో దాదాపు 86 శాతం డొమెస్టిక్ కనెక్షన్లేనని ఆయన స్పష్టం చేశారు. అలాగే మిగిలిన 14 శాతం మాత్రమే కమర్షియల్ అని వివరించారు. ప్రస్తుతానికి డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి కొరత లేదని తమ శాఖ అధికారులు వెల్లడించారని చెప్పారు. కానీ కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నది వాస్తవమని తెలిపారు.


రాష్ట్రంలో వంట గ్యాస్ తాజా పరిస్థితిపై చర్చించేందుకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు, చమురు కంపెనీల ప్రతినిధులతో శుక్రవారం సమీక్షిస్తామని మంత్రి ఉత్తమ్ వివరించారు. రాష్ట్రంలో రోజూ ఎన్ని కమర్షియల్ సిలిండర్లు అవసరం, సరఫరా ఏ మేరకు ఉంది, గ్యాస్ కొరతకు గల కారణాలు, అందుకు అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలతోపాటు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టేందుకున్న మార్గాలన్నింటిపై చర్చించనున్నట్లు మంత్రి ఉత్తమ్ వివరించారు. అలాగే పూర్తి వివరాలతో రావాలని ఆయిల్ కంపెనీల ప్రతినిధులతోపాటు అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. పరిస్థితి చేయి దాటి పోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.


మరో వైపు.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా గ్యాస్, చమురుకు తీవ్ర కొరత ఏర్పడింది. గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని కేంద్రం చెబుతున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. తెలంగాణలో వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాంతో హోటళ్లు, హాస్టల్స్, మెస్‌లకు అవసరమైన మేర కమర్షియల్ సిలిండర్ల సరఫరా లేకపోవడంతో నగరంలో చాలా ప్రాంతాల్లో అవి మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందుకోసం శుక్రవారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న గవర్నర్

గ్యాస్ సంక్షోభం.. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్

For More TG News And Telugu News

Updated Date - Mar 12 , 2026 | 04:56 PM