కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్లపై కేంద్రం కీలక ప్రకటన
ABN , Publish Date - Mar 12 , 2026 | 07:14 PM
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ప్రభావం పలు ప్రధాన నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడుతున్న వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. కొన్ని కమర్షియల్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్లను విడుదల చేయనున్నట్టు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది.
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ప్రభావం పలు ప్రధాన నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లపై పడుతున్న వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. కొన్ని కమర్షియల్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్లను విడుదల చేయనున్నట్టు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ గురువారంనాడు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులను గుర్తించాలని కోరింది. ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయంగా రాష్ట్రాలకు 40,000 కిలోలీటర్ల అదనపు కిరోసిన్ కేటాయించినట్టు తెలిపింది.
'ఎల్‌పీజీ కొరత వస్తుందనే వదంతులతో పలు నగరాల్లో వినియోగదారులు ప్యానిక్ బుకింగ్స్‌కు పాల్పడున్నారు. ఇది సరైనది కాదు. ఎవరూ ప్యానిక్ బుకింగ్స్ చేయవద్దని కోరుతున్నాం. కమర్షియల్ సిలిండర్ లబ్ధిదారులను గుర్తించాలని కూడా రాష్ట్రాలను కోరుతున్నాం. ఇందువల్ల ప్రాధాన్యతా క్రమంలో కమర్షియల్ సిలిండర్లను డెలివరీ చేయగలుగుతాం' అని పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ తెలిపారు. ప్రతి క్వార్టర్‌లోనూ ప్రభుత్వం దాదాపు లక్ష కిలోలీటర్ల కిరోసిన్ రాష్ట్రాలకు కేటాయిస్తోందని, పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలకు అదనంగా 40,000 కిలోలీటర్ల కిరోసిన్ విడుదలకు ఈరోజు ఆదేశాలిచ్చామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
భారత్‌లో ఇంధన కొరత లేదు.. లోక్‌సభలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్
గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది: రాహుల్ గాంధీ