ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్
ABN , Publish Date - Mar 12 , 2026 | 06:49 PM
హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్ఎంసీ గొప్ప శుభవార్త చెప్పింది. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేవారికి భారీ ఊరటనిస్తూ.. ‘వన్ టైమ్ సెటిల్‌మెంట్’ను ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, మార్చి 11: హైదరాబాద్ నగరవాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) గొప్ప శుభవార్త చెప్పింది. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేవారికి భారీ ఊరటనిస్తూ.. ‘వన్ టైమ్ సెటిల్‌మెంట్’(OTS)ని ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2025-26 సంబంధించి ఆస్తి పన్నును ఈ నెల 31వ తేదీలోకా చెల్లిస్తే, వడ్డీపై ఏకంగా 90 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది.
ఆస్తిపన్ను బకాయిలను ww.ghmc.gov.in పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. అలాగే MyCURE యాప్, మీ సేవ కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ సెంటర్లలోనూ చెల్లించవచ్చు. ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ తెలిపింది. ఈ మేరకు కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆస్తి పన్నుకు సంబంధించిన పెండింగ్ బిల్లులు సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ వచ్చిందంటే.. హాలీవుడ్ వచ్చినట్లే: సీఎం రేవంత్‌రెడ్డి
గ్యాస్ సంక్షోభం.. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్
For More TG News And Telugu News