దేశీయ సూచీలు మరింత కిందకు.. సెన్సెక్స్ 750 పాయింట్లు డౌన్..
ABN , Publish Date - Mar 12 , 2026 | 10:32 AM
హోర్ముజ్ జలసంధిలో దాడుల కారణంగా ముడి చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. దీంతో సూచీలపై తీవ్ర ప్రభావం పడింది. అలాగే భారత్‌తో సహా 16 దేశాలు అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అనుసరిస్తున్నాయని పేర్కొంటూ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై ట్రంప్ సర్కారు దర్యాఫ్తునకు ఆదేశించింది.
హోర్ముజ్ జలసంధిలో దాడుల కారణంగా ముడి చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. దీంతో సూచీలపై తీవ్ర ప్రభావం పడింది. అలాగే భారత్‌తో సహా 16 దేశాలు అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అనుసరిస్తున్నాయని పేర్కొంటూ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై ట్రంప్ సర్కారు దర్యాఫ్తునకు ఆదేశించింది. దీంతో కొత్త టారిఫ్‌లు విధించేందుకు అమెరికా మరో ప్రయత్నం చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మరింత పతనమైంది. ఇన్ని వ్యతిరేకతల నేపథ్యంలో గురువారం సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (76,863)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 500 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు దిగజారింది. ఒక దశలో దాదాపు 1000 పాయింట్లు కోల్పోయి 76 వేల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 763 పాయింట్ల నష్టంతో 76,100 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 256 పాయింట్ల నష్టంతో 23,610 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో టాటా పవర్, పెట్రోనాట్ ఎల్‌ఎన్‌జీ, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఎస్ఆర్ఎఫ్, టొరెంట్ పవర్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఇండస్ ఇండ్ బ్యాంక్, అస్ట్రాల్ లిమిటెడ్, జుబిలెంట్ ఫుడ్స్, పిరామిల్ ఫార్మా, అంబర్ ఎంటర్‌ప్రైజెస్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 681 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 873 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 92.35గా ఉంది.
ఇవి కూడా చదవండి..
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు.. కూతురితో కలిసి వీక్షించిన కిమ్..