యూరియా కోసం కేంద్రానికి లేఖ: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Mar 12 , 2026 | 07:14 PM
ఈ ఏడాది ఖరీఫ్ కోసం ముందస్తుగా యూరియా నిల్వలు సిద్ధం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలో రానున్న మూడు నెలలకు.. ఆరు లక్షల మెట్రిక్ టన్నులు యూరియా కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
హైదరాబాద్, మార్చి 12: ఈ ఏడాది ఖరీఫ్ కోసం ముందస్తుగా యూరియా నిల్వలు సిద్ధం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలో రానున్న మూడు నెలలకు.. ఆరు లక్షల మెట్రిక్ టన్నులు యూరియా కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఏప్రిల్, మే, జూన్‌కు నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం హైదరాబాద్‌లో వెల్లడించారు. ఖరీఫ్ ప్రారంభానికి రాష్ట్రంలో సుమారు 50 వేల టన్నుల ప్రారంభ నిల్వలు మాత్రమే ఉండే అవకాశం ఉందన్నారు.
తెలంగాణలో 70 శాతం పంటలు ఖరీఫ్ సీజన్‌లోనే సాగవుతాయని మంత్రి తుమ్మల వివరించారు. జులై, ఆగస్టులలో యూరియా డిమాండ్ గరిష్ఠంగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. నెలకు సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమవుతుందని తెలిపారు. ఎరువుల పంపిణీ పారదర్శకతకు యూరియా యాప్ తీసుకొచ్చినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుర్తు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న గవర్నర్
గ్యాస్ సంక్షోభం.. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్
For More TG News And Telugu News