ప్రజా సమస్యల పరిష్కారంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కృషి విశేషమైనది: ఎమ్మెల్యే విజయ్ కుమార్
ABN , Publish Date - Mar 12 , 2026 | 04:34 PM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేపట్టిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండా’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయ్ కుమార్ అభినందించారు. ప్రజల సమస్యలను నేరుగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడంలో ఇలాంటి వేదికలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లా, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ప్రజల గొంతుకగా వారి సమస్యలను ఎప్పటికప్పుడు ఎలుగెత్తి చూపుతున్న ఏబీఎన్- ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)... ఆయా సమస్యల పరిష్కారానికి ఆచరణీయ పద్ధతిలో ముందుకు కదులుతోంది. ఇందులో భాగంగా అధికారులు- ప్రజాప్రతినిధులు, ప్రజలకు మధ్య వారధిగా ఈరోజు (గురువారం) అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం పంచాయతీలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘సెజ్’ పునరావాస కాలనీ అభివృద్ధి కమిటీ చైర్మన్ బైలపూడి శ్రీరామదాసు పర్యవేక్షణలో పంచాయతీ కార్యాలయంలో ఇవాళ ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ (MLA Sundarapu Vijaykumar) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కృషి విశేషమైనది..
ప్రజాసమస్యల పరిష్కారంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కృషి విశేషమైనదని ఎమ్మెల్యే విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేపట్టిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమాన్ని అభినందించారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన ‘ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి’ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలను నేరుగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడంలో ఇలాంటి వేదికలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలైన డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ‘జల్ జీవన్ మిషన్‘ పథకం ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇచ్చి, స్వచ్ఛమైన మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ పనులను పూర్తి చేసి, మెరుగైన రవాణా సౌకర్యాల కోసం రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. యువతకు, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా ఎమ్మెల్యే రెండు కీలక ప్రకటనలు చేశారు.
డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తాం..
సెజ్ (SEZ) పరిధిలోని గ్రామాల్లో విద్యార్థుల సౌకర్యార్థం అధునాతన డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. నియోజకవర్గంలో విద్యార్థులు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా యలమంచిలిలోనే ఒక కొత్త కాలేజీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
గంజాయిపై ఉక్కుపాదం..
యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్న గంజాయి మహమ్మారిపై ఎమ్మెల్యే విజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. నియోజకవర్గంలో గంజాయి సాగు, రవాణా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం..
ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని మాటిచ్చారు. ప్రతి గ్రామంలో ప్రాథమిక వసతులు కల్పించడానికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవడం సంతోషకరమని ఎమ్మెల్యే విజయ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వదేశీ రక్షణ తయారీకి సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ ఊతం: మంత్రి నారాయణ
మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు
జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం
Read Latest International News And Telangana News And AP News And Telugu News