Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Aug 31 , 2026 | 07:07 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Aug 31, 2026 21:37 IST

    హైదరాబాద్: చేయూత పెన్షన్ దరఖాస్తు గడువు మరో 15 రోజులపాటు పెంపు

    • మంత్రి సీతక్క ఆదేశాల మేరకు గడువు పెంపు

    • హైదరాబాదులో సర్ ప్రక్రియ, దివ్యాంగుల కోరిక మేరకు దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడగించిన ప్రభుత్వం

  • Aug 31, 2026 21:13 IST

    అంతర్జాతీయ ఫుట్ బాట్‌కు లియోనెల్ మెస్సి గుడ్ బై

    • రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన మెస్సి

    • 207 మ్యాచుల్లో 125 గోల్స్ చేసిన మెస్సి

  • Aug 31, 2026 20:42 IST

    దులీప్ ట్రోఫీ 2026: తిలక్ వర్మ సెంచరీ

    • నార్త్ జోన్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌

    • ఆధిక్యంలో సౌత్ జోన్

    • 225 బంతుల్లో శతకం చేసిన తిలక్

  • Aug 31, 2026 20:29 IST

    కిర్గిస్థాన్‌లో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం

    • ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ

    • ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ సమస్యలపై చర్చ

    • యుద్ధం జరిగినన్ని రోజులు మానవాళి వెనకబడుతుంది: మోదీ

    • శత్రుత్వాన్ని అంతం చేయడానికి మనం కృషి చేయాలి: మోదీ

  • Aug 31, 2026 20:28 IST

    మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం

    • జీపు బోల్తా, నలుగురు నిర్మల్ జిల్లా వాసుల మృతి

    • పలువురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

    • పుణ్యక్షేత్రాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం

  • Aug 31, 2026 19:42 IST

    నల్లగొండలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్

    • మంత్రి కోమటిరెడ్డి క్యాంప్ కార్యాలయంపై సాయంత్రం బీజేపీ దాడి

    • బీజేపీ జిల్లా కార్యాలయంపై ప్రతిదాడి చేసేందుకు కాంగ్రెస్ యత్నం

    • అడ్డుకున్న పోలీసులు, కానిస్టేబుల్ తలకు గాయం

  • Aug 31, 2026 18:19 IST

    హైదరాబాద్: కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భారీ అగ్ని ప్రమాదం

    • మిరాలం ఫిల్టర్ వద్ద ఉన్న ఒక కార్ మెకానిక్ వర్క్‌షాప్‌లో భారీగా ఎగిసి పడుతున్న మంటలు

  • Aug 31, 2026 17:56 IST

    అమరావతి: ఏపీలో ఇద్దరు డీఎస్పీలకు ASP(AR)గా ప్రమోషన్

    • డీఎస్పీలు రామకృష్ణారావు, కోటేశ్వరరావుకు ప్రమోషన్

    • ఏపీ జెన్‌కోకు ASPగా సీహెచ్ రామకృష్ణారావు

    • APPAకు ASPగా డి.కోటేశ్వరరావు

    • 15 రోజుల్లో పోస్టుల్లో చేరాలని స్పష్టం చేసిన ప్రభుత్వం

  • Aug 31, 2026 17:52 IST

    నిజామాబాద్: భావోద్వేగానికి గురైన కవిత

    • కన్నీళ్లు పెట్టుకున్నానని పిరికిదానిననుకోవద్దు: కవిత

    • ఇవి బాధ, ఆవేదనతో వచ్చిన కన్నీళ్లు: కవిత

    • మహాభారతంలో శుకనిలాంటివాడు ప్రశాంత్‌రెడ్డి: కవిత

    • తండ్రి, బిడ్డను విడగొట్టడంలో ప్రశాంత్‌రెడ్డిదే కీలకపాత్ర: కవిత

    • మా మధ్య ప్రశాంత్‌రెడ్డే చిచ్చు పెట్టారు: కవిత

    • ప్రశాంత్‌రెడ్డికి నా ఉసురు తగులుతుంది: కవిత

  • Aug 31, 2026 17:51 IST

    నిజామాబాద్‌: నేను ఎలాంటి తప్పు చేయలేదు: కవిత

    • నేను నిప్పులాంటి నిజామాబాద్‌ బిడ్డను: కవిత

    • ఏ తప్పూ చేయని నన్ను తిహార్‌ జైలులో పెట్టారు: కవిత

    • ED, CBI కేసులు పెట్టి నాలుగేళ్లపాటు వేధించారు: కవిత

  • Aug 31, 2026 17:50 IST

    నిజామాబాద్: తెలంగాణ ఉద్యమం రాజకీయం కోసం చేయలేదు: కవిత

    • స్వరాష్ట్రం వచ్చినా మన బతుకులు మారలేదు: కవిత

    • సమస్యల పరిష్కారానికి కొత్త రాజకీయ శక్తి అవసరం: కవిత

    • తెలంగాణలో చేయాల్సిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి: కవిత

    • కాళేశ్వరంతో ఒక్క ఎకరానికైనా నీళ్లు వచ్చాయా?: కవిత

  • Aug 31, 2026 17:48 IST

    హైదరాబాద్: పదేళ్ల తర్వాత GHMCకి కొత్త లోగో

    • GHMC నుంచి రెండు కార్పొరేషన్లను వేరుచేసిన ప్రభుత్వం

    • 3 కార్పొరేషన్ల కొత్త లోగోలు లాంచ్‌ చేసిన సీఎం రేవంత్

    • GHMC, సైబరాబాద్‌, మల్కాజ్‌గిరి లోగోలు లాంచ్‌

  • Aug 31, 2026 17:20 IST

  • Aug 31, 2026 17:14 IST

    హైదరాబాద్: మూసారాంబాగ్ హైలెవ‌ల్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

    • రూ. 52 కోట్ల వ్యయంతో 400 మీట‌ర్ల పొడ‌వైన బ్రిడ్జి నిర్మాణం

    • మూసీలో ల‌క్షా యాభై వేల క్యూసెక్కుల వ‌రద వ‌చ్చినా ఇబ్బంది త‌లెత్తకుండా బ్రిడ్జి నిర్మాణం

  • Aug 31, 2026 17:12 IST

    ఉత్తరప్రదేశ్‌లో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు

    • శిథిలాల కింద చిక్కుకున్న 15 మంది, మరో 24 మందికి గాయాలు

    • కౌశాంబి జిల్లా పిప్రి పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ప్రమాదం

    UP-Fire-Accident.jpg

  • Aug 31, 2026 16:57 IST

    హుజురాబాద్: సెప్టెంబర్‌ 8 తర్వాత ఎథిక్స్‌ కమిటీపై స్పందిస్తా: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి

    • ఎథిక్స్‌ ఎవరికి ఉన్నాయో కమిటీ ఆలోచించాలి: కౌశిక్‌రెడ్డి

    • బీఆర్ఎస్ బీఫామ్‌పై గెలిచిన వ్యక్తి కాంగ్రెస్‌ కండువా కప్పుకుని తిరుగుతున్నారు: కౌశిక్‌రెడ్డి

    • బీఆర్ఎస్‌లో ఉన్నారా.. కాంగ్రెస్‌లో ఉన్నారా.. అని అడగడం తప్పా?: కౌశిక్ రెడ్డి

    • కేసీఆర్ నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాడుతున్నా: కౌశిక్‌రెడ్డి

  • Aug 31, 2026 16:56 IST

    ఢిల్లీ: ప్రపంచ సవాళ్లలోనూ వేగంగా వృద్ధి చెందుతోన్న భారత ఆర్థిక వ్యవస్థ

    • మొదటి త్రైమాసికంలో 7.8శాతానికి చేరిన భారత జీడీపీ

    • ఆర్‌బీఐ ముందస్తు అంచనాల కంటే మెరుగైన ఫలితాలు నమోదు

    • గతేడాది Q1లో నమోదైన 6.9శాతం కంటే మెరుగైన వృద్ధి

  • Aug 31, 2026 16:54 IST

    మహబూబాబాద్: సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

    • ప్రతి గ్రామం అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: పొంగులేటి

    • ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టారు: పొంగులేటి

    • ప్రజల దీవెనలు, ఆశీర్వాదం ఎప్పుడూ కాంగ్రెస్‌కే: పొంగులేటి

  • Aug 31, 2026 16:49 IST

    నేపాల్: రసువాగఢి జలవిద్యుత్‌ ప్రాజెక్టు టన్నెల్‌లో 93 మంది కార్మికుల గల్లంతు

    • థర్మల్‌ డ్రోన్లతో టన్నెల్‌ చివరి వరకు తనిఖీ చేసినా ఫలించని ప్రయత్నాలు

    • టన్నెల్‌లో ఎంత వెతికినా ప్రాణాలతో ఉన్నవారి జాడ కనిపించని వైనం

  • Aug 31, 2026 16:45 IST

    ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ..

    • కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో సోమవారం జరిగిన సమావేశం

    • రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసి, విస్తరించడంపై చర్చ

    • రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా భేటీ కాబోతున్న ప్రధాని మోదీ

  • Aug 31, 2026 16:41 IST

    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    • హైదరాబాద్‌లో 22 కొత్త మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణానికి ఆమోదం

    • 471.50 MLD సామర్థ్యంతో 22 STPల నిర్మాణం

    • అమృత్ 2.0- ప్యాకేజ్-2 కింద ప్రాజెక్ట్ పనులు

    • ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.1,906.44 కోట్లు

  • Aug 31, 2026 16:10 IST

    హైదరాబాద్: మైక్రో ఫైనాన్స్ కేసులో బాధితులకు న్యాయం చేయాలి: అడ్వకేట్ సుబ్బు

    • సెటిల్‌మెంట్‌కు రాకపోవడంతో బెదిరింపులకు గురిచేస్తున్నారు: అడ్వకేట్ సుబ్బు

    • కేసులు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు: అడ్వకేట్ సుబ్బు

    • బాధితులకు చెల్లింపులు జరిగితే కేసుల విషయంలో వెనక్కి తగ్గేందుకు సిద్ధం: అడ్వకేట్ సుబ్బు

  • Aug 31, 2026 16:03 IST

    నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

    • 307 పాయింట్ల నష్టంతో 76,957 దగ్గర ముగిసిన సెన్సెక్స్

    • 95 పాయింట్ల నష్టంతో 24,080 దగ్గర ముగిసిన నిఫ్టీ

  • Aug 31, 2026 16:00 IST

    హైదరాబాద్: యూత్‌ కాంగ్రెస్‌ నేతల తీరుపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఆగ్రహం

    • బీజేపీ ఆఫీస్‌పై దాడిచేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?: బండి సంజయ్‌

    • రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తోందా.. లేదా?: బండి సంజయ్‌

    • జాతీయ పార్టీ స్టేట్‌ ఆఫీస్‌కు రక్షణ కల్పించే బాధ్యత లేదా?: బండి సంజయ్‌

    • కాంగ్రెస్ నాయకత్వం తక్షణం స్పందించాలి: బండి సంజయ్‌

    • లేకపోతే కాంగ్రెస్ కార్యాలయాలను దిగ్బంధిస్తాం: బండి సంజయ్‌

  • Aug 31, 2026 15:38 IST

    హైదరాబాద్: గాంధీ భవన్‌ ముట్టడికి వచ్చిన బీజేవైఎం

    • బీజేవైఎం నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు

    • గాంధీ భవన్‌పైకి కోడిగుడ్లు విసిరిన బీజేవైఎం

    • గాంధీ భవన్ ముందు భారీ బందోబస్తు

  • Aug 31, 2026 15:09 IST

    విశాఖ: దివ్యాంగ లబ్ధిదారులకు స్కూటీల అందజేత

    • జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో కార్యక్రమం

    • హాజరైన ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కవిత

    • జిల్లాలో 51 మందికి త్రిచక్ర స్కూటీల పంపిణీ

  • Aug 31, 2026 15:01 IST

    ఢిల్లీ: రేపు రామ్‌లీలా మైదానంలో సీపీఐ భారీ ర్యాలీ

    • రాజ్యాంగం, లౌకికవాద పరిరక్షణే లక్ష్యంగా ర్యాలీ

    • పాల్గొననున్న డి.రాజా సహా పలువురు జాతీయనేతలు

  • Aug 31, 2026 15:00 IST

    హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై కీలక ఉత్తర్వులు

    • మల్లన్నసాగర్‌ నుంచి ఘన్‌పూర్‌ వరకు 2 పైప్‌లైన్ల ఏర్పాటు

    • ఒక్కో పైప్‌లైన్‌ సామర్థ్యం 10 టీఎంసీలు

  • Aug 31, 2026 14:58 IST

    సిద్దిపేట: 22A జీఓ రద్దు చేయాలి: ఎంపీ రఘునందన్‌

    • భూ భారతితో రైతుల కష్టాలు తీరుతాయన్నారు: రఘునందన్‌

    • రైతులు, పేదలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవట్లేదు: రఘునందన్

    • మున్సిపల్ కార్మికులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు: రఘునందన్

    • ఢిల్లీకి సూట్‌కేసులు మోస్తున్నారు: రఘునందన్‌

  • Aug 31, 2026 14:46 IST

    హైదరాబాద్‌: వివేకా హత్య కేసుపై నాంపల్లి CBI కోర్టు విచారణ

    • తమను కేసు నుంచి తప్పించాలని నిందితులు ఎర్ర గంగిరెడ్డి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ డిశ్చార్జ్‌ పిటిషన్లు

    • ఎంపీ అవినాష్ మినహా కోర్టుకు హాజరైన మిగతా నిందితులు

    • తదుపరి విచారణ సెప్టెంబర్‌ 15కి వాయిదా

  • Aug 31, 2026 14:41 IST

    ఏపీ లిక్కర్‌ రవాణా స్కాం కేసుపై సుప్రీంకోర్టు విచారణ

    • రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్టులపై సుప్రీం విచారణ

    • రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

    • ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్‌ చేసిన ప్రభుత్వం

    • తదుపరి విచారణను వాయిదా వేసిన CJI ధర్మాసనం

  • Aug 31, 2026 13:59 IST

    ఏపీలో 2024లో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వచ్చింది: సీఎం చంద్రబాబు

    • అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు: సీఎం చంద్రబాబు

    • మోదీ సహాయం, పవన్‌ సహకారంతో వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించుకున్నాం: సీఎం చంద్రబాబు

    • 1996లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశా, ఇప్పుడు ప్రాజెక్టు ప్రారంభించి జాతికి అంకితం చేశా: సీఎం చంద్రబాబు

  • Aug 31, 2026 13:46 IST

    సెప్టెంబర్‌ 5న CJP ఇండియా గేట్ మార్చ్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

    • ప్రతిఒక్కరూ చట్ట పరిధిలోనే వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం: సుప్రీంకోర్టు

    • శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వాలదే: సుప్రీంకోర్టు

    • తదుపరి విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

  • Aug 31, 2026 13:29 IST

    హైదరాబాద్‌: నాంపల్లి బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

    • బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన యూత్ కాంగ్రెస్

    • బీజేపీ కార్యాలయానికి నల్లరంగు పూసి నిరసన

    • అడ్డుకున్న పోలీసులతో యూత్ కాంగ్రేస్ నేతల వాగ్వాదం

    • బిహార్‌లో విద్యార్థులపై కాల్పులు, జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలపై యూత్‌ కాంగ్రెస్‌ నిరసన

  • Aug 31, 2026 13:12 IST

    వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అరుదైన ఘనత

    • గ్లోబల్ ట్రెండింగ్‌ తొలిస్థానంలో వెలిగొండ ప్రాజెక్ట్

    • CBN Fulfills Veligonda Dream పేరిట హ్యాష్‌ట్యాగ్

  • Aug 31, 2026 13:10 IST

    హైదరాబాద్‌: నర్సు హత్య కేసులో కీలక పరిణామం

    • నర్సుపై అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం నివేదిక

    • రేప్‌ సెక్షన్‌ ఆల్టర్‌ చేయనున్న పహాడీ షరీఫ్‌ పోలీసులు

    • అత్యాచారం చేసినట్లు అంగీకరించిన నిందితుడు సనా ఉల్లా

  • Aug 31, 2026 13:07 IST

    కూటమి ప్రభుత్వ సంకల్పానికి సజీవ సాక్ష్యం వెలిగొండ ప్రాజెక్టు: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్

    • నాలుగు జిల్లాల ప్రజల దశాబ్దాల కల సాకారానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు: పవన్‌

    • లక్షలాది మంది తాగు, సాగు నీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టు వెలిగొండ: పవన్

    • ప్రాజెక్ట్ కోసం భూములు త్యాగం చేసినవారికి ధన్యవాదాలు: పవన్‌

    • చంద్రబాబు దూరదృష్టి, సంకల్పంతో కరవు ప్రాంతంలో జలసిరులు: పవన్

  • Aug 31, 2026 13:05 IST

    హైదరాబాద్: తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన MIM MLC మీర్జా రహ్మత్‌ బేగ్‌

    • AI వీడియోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు: రహ్మత్‌ బేగ్‌

    • ఫేక్‌ వీడియోలపై ఈనెల 26న పోలీసులకు ఫిర్యాదు చేశా: రహ్మత్‌ బేగ్‌

    • నేను ఏ తప్పూ చేయలేదు: MLC మీర్జా రహ్మత్‌ బేగ్‌

  • Aug 31, 2026 12:54 IST

    హైదరాబాద్‌: 1000 రోజుల పాలనపై TPCC చీఫ్‌ మహేష్‌గౌడ్‌

    • వెయ్యి రోజుల్లో రైతులకు భరోసా ఇచ్చాం: మహేష్‌గౌడ్‌

    • అన్ని వర్గాల ఆశయాలకు అనుగుణంగా పాలన: మహేష్‌గౌడ్‌

    • అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లుగా ప్రభుత్వ పాలన: మహేష్‌గౌడ్‌

    • ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకం వమ్ముచేయం: మహేష్‌గౌడ్‌

    • ప్రజలు మళ్లీ ఆశీర్వదించేలా పనిచేస్తాం: మహేష్‌గౌడ్‌

  • Aug 31, 2026 12:47 IST

    సిద్దిపేట: 22A జీఓ రద్దు చేయాలని బీజేపీ డిమాండ్‌

    • ధరణి కంటే భూ భారతి అధ్వాన్నంగా ఉంది: TBJP చీఫ్‌ రాంచందర్‌రావు

    • 22Aతో 50 లక్షల మందికి ఇబ్బందులు: రాంచందర్‌రావు

    • తప్పులను ప్రభుత్వం సరిదిద్దుకోవట్లేదు: రాంచందర్‌రావు

    • ప్రభుత్వాలు మారినా దోపిడీ విధానాలు మారలేదు: రాంచందర్‌రావు

    • వేలాది ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చారు: TBJP చీఫ్‌

  • Aug 31, 2026 12:35 IST

    మార్కాపురం: గంటావానిపల్లిలో సీఎం చంద్రబాబు బహిరంగ సభ

  • Aug 31, 2026 12:33 IST

    కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై BRS నిరసనలు

    • సెప్టెంబర్ 2నుంచి వారంపాటు BRS కార్యక్రమాలు

  • Aug 31, 2026 12:32 IST

    మీరు భారీ మూల్యం చెల్లించుకుంటారు.. ఖలిస్థానీలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వార్నింగ్

    • న్యూయార్క్‌లో భారత జాతీయ జెండాను తొక్కిన ఖలిస్థానీలు

    • ఆర్ఎస్ఎస్ చీఫ్ సభ సందర్భంగా ఘటన

    • దేశాన్ని అవమానించడం ఆమోదించబోమన్న కేంద్ర మంత్రి

  • Aug 31, 2026 12:31 IST

    యూఎస్ ఓపెన్: తొలి రౌండ్‌లోనే వీనస్ విలియమ్స్ ఔట్

    • మహిళల సింగిల్స్‌లో కెనిన్‌పై 6-2, 7-6(8/6) తేడాతో వీనస్ ఓటమి

  • Aug 31, 2026 12:24 IST

    పెట్రోల్‌లో ఇథనాల్‌ శాతం అంశంపై సుప్రీంకోర్టులో పిల్‌

    • పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ శాతం వెల్లడించాలనే పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

    • సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం సూచన

    • పెట్రోల్ బిల్లులపై ఇథనాల్ శాతం నమోదు చేయాలని PIL

    • కేంద్రం తరఫున అభ్యంతరం వ్యక్తంచేసిన అటార్నీ జనరల్

  • Aug 31, 2026 12:11 IST

    విశాఖ: AIG ఆస్పత్రికి మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన

    • రూ.2 వేల కోట్ల పెట్టుబడి, 1000 పడకల ఆస్పత్రి

    • ఆస్పత్రి నిర్మాణంతో 9 వేల మందికి ఉపాధి

    • 9 ఎకరాల్లో ఆస్పత్రి, 2.5 ఎకరాల్లో నర్సింగ్ కాలేజ్‌

    • ఒకే క్యాంపస్‌లో వైద్య సేవలు, శిక్షణ, పరిశోధన

    • రెండేళ్లలో ఆస్పత్రి నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యం

  • Aug 31, 2026 11:57 IST

    హైదరాబాద్: సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో విదేశాంగ శాఖ ఉన్నతాధికారి భేటీ

    • మంత్రి శ్రీధర్‌బాబుతో జాయింట్ సెక్రటరీ అల్పన సమావేశం

    • తెలంగాణ ఐటీ, పరిశ్రమల రంగాలపై చర్చ

  • Aug 31, 2026 11:49 IST

    హైదరాబాద్: MIM పార్టీకి తలనొప్పిగా MLC రహ్మత్ బేగ్ వ్యవహారం

    • MLC పదవి రాజీనామాకు రహ్మత్ బేగ్ నిరాకరణ

    • లైంగిక ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేయాలని ఒవైసీ ఆదేశం

    • మజ్లిస్ ఆదేశాలు పట్టించుకోని MLC బేగ్

    • రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన బేగ్

    • ప్రస్తుతం పరారీలో MLC రహ్మత్ బేగ్

  • Aug 31, 2026 11:37 IST

    వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్‌-1 ప్రారంభం

    • వెలిగొండ ఫేజ్‌-1 ప్రారంభించిన చంద్రబాబు

    • తొలిదశను జాతికి అంకితం చేసిన చంద్రబాబు

    • కృష్ణా నీటికి జలహారతి, పైలాన్‌ ఆవిష్కరణ

    • నల్లమలసాగర్‌కు నీరు విడుదల చేసిన సీఎం

    పూర్తి కథనం

  • Aug 31, 2026 11:19 IST

    రంగారెడ్డి: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని సాయిరాం నగర్‌ కాలనీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం

    • ఇంట్లో పార్క్ చేసిన బైక్‌లకు ఒక్కసారిగా అంటుకున్న మంటలు

    • మంటలు విస్తరించడంతో ఐదు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధం

    • బైక్‌లలో పెట్రోల్ ఉండటంతో భారీగా ఎగిసిపడిన మంటలు

  • Aug 31, 2026 11:12 IST

    ఢిల్లీలో మరో నిర్భయ ఘటన

    • కశ్మీర్ గేట్ ప్రాంతంలో గ్యాంగ్‌ రేప్‌

    • ప్రైవేట్ బస్సులో ఉత్తర్‌ప్రదేశ్ మైన్‌పురి బాలికపై అత్యాచారం

    • డ్రైవర్ కుల్దీప్‌, కండక్టర్ సందీప్ అరెస్ట్‌

    • బస్సును సీజ్‌ చేసిన ఢిల్లీ పోలీసులు

    • ఆగస్టు 4న ఘటన

  • Aug 31, 2026 11:10 IST

    ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో భారీ డంప్‌ సీజ్‌

    • మావోయిస్టుల మందుపాతరల స్వాధీనం

    • కూంబింగ్ నిర్వహిస్తున్న కేంద్ర బలగాలు

    • అటవీ ప్రాంతంలో దొరికిన మావోయిస్టుల డంప్‌

  • Aug 31, 2026 11:01 IST

    ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం

    • ట్రక్కు-కారు ఢీకొన్న ఘటనలో నలుగురి మృతి

    • నోయిడా జిల్లా జేవార్ దగ్గర ఘటన

  • Aug 31, 2026 10:43 IST

    మార్కాపురం జిల్లా చేరుకున్న సీఎం చంద్రబాబు

    • దోర్నాల మండలం గంటావానిపల్లిలో చంద్రబాబు

    • కాసేపట్లో వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభించనున్న చంద్రబాబు

  • Aug 31, 2026 10:36 IST

    ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ కేసు.. రంగంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)

    • CBI చార్జ్‌షీట్ల ఆధారంగా విచారణ ప్రారంభించిన ED

    • PMLA కింద కేసు నమోదు చేసిన ED

    • కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలపై ED దృష్టి

    • 13 మంది నిందితుల ఛార్జ్‌షీట్ వివరాలు, సాక్షుల వాంగ్మూలాలు, కీలక పత్రాలు EDకి అందజేయనున్న CBI

  • Aug 31, 2026 10:27 IST

    హైదరాబాద్‌: అంబర్‌పేటలో AR కానిస్టేబుల్‌ ఆత్మహత్య

    • ప్రేమ విఫలమవడంతో ఉరేసుకుని కానిస్టేబుల్‌ నిభాష్‌(25) ఆత్మహత్య

    • ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్నేహితులకు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చిన నిభాష్‌

    • కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు

  • Aug 31, 2026 10:11 IST

    పహాడీ షరీఫ్‌లో నర్సుపై అత్యాచారయత్నం కేసులో దర్యాప్తు ముమ్మరం

    • కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం హత్య కేసును గుర్తుచేసిన ఘటన

    • పోలీసుల అదుపులో బిహార్‌కు చెందిన నిందితుడు సైనా ఉల్లాఖాన్

  • Aug 31, 2026 09:32 IST

    ఎస్‌సీఓ సదస్సు కోసం కిర్గిస్థాన్‌ చేరుకున్న ప్రధాని మోదీ

    • బిష్కెక్‌లో ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల ఘన స్వాగతం

    • బిష్కెక్‌లో ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం

    • 'భారత్ మాతా కీ జై' నినాదాలతో హోరెత్తిన పరిసరాలు

    • రెండు రోజుల పాటు పలు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్న ప్రధాని

    • రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ భేటీ అయ్యే అవకాశం

  • Aug 31, 2026 09:31 IST

    విశాఖ: గాజువాకలో స్పా సెంటర్లపై పోలీసుల దాడులు

    • సీపీ బాగ్చి ఆదేశాలతో 121 స్పా సెంటర్లలో తనిఖీలు

    • గాజువాక చినగంట్యాడ మియామీ ఆయుర్వేదిక్‌, థాయ్‌ స్పాపై దాడులు

    • స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు

    • పోలీసుల అదుపులో నలుగురు మహిళలు, ముగ్గురు విటులు, నిర్వాహకులు

  • Aug 31, 2026 09:23 IST

    నెల్లూరు: ఏఎస్ పేటలో మద్యం మత్తులో యువకుల హల్‌చల్

    • నగరాఖానా సెంటర్ దగ్గర మద్యం సేవిస్తున్న యువకులను ప్రశ్నించిన స్థానికులు

    • కత్తులు, సీసాలతో స్థానికులు, పోలీసులపై దాడికి యత్నం

  • Aug 31, 2026 09:23 IST

    తూ.గో.: దేవరపల్లి మం. ఎర్నగూడెం దగ్గర కానిస్టేబుల్‌పై ఆగంతకుల దాడి

    • టూ వీలర్‌ తనిఖీల్లో భాగంగా బ్యాగులో ఏముందని ప్రశ్నించిన కానిస్టేబుల్

    • కానిస్టేబుల్‌పై కత్తితో ఇద్దరు అగంతకులు దాడి, పరారీ

    • గాయపడిన కానిస్టేబుల్‌ వెంకటేశ్వరరావు రాజమండ్రికి తరలింపు

  • Aug 31, 2026 09:22 IST

    తూ.గో.: చాగల్లు దగ్గర పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

    • నిడదవోలు-రాజమండ్రి స్టేషన్లలో నిలిచిన పలు రైళ్లు

  • Aug 31, 2026 09:18 IST

    కడప: మైదుకూరు MLA పుట్టా సుధాకర్‌, ఆయన కుమారుడు రవికుమార్‌పై బెంగళూరులో కిడ్నాప్ కేసు నమోదు

    • రియల్ ఎస్టేట్ వ్యాపార సంబంధాల్లో భాగంగా కేసు నమోదు

    • రియల్ ఎస్టేట్ వ్యవహారంతో తమకెలాంటి సంబంధం లేదు: MLA పుట్టా సుధాకర్

  • Aug 31, 2026 09:09 IST

    సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

    • వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తున్న సీఎం చంద్రబాబుకు మంత్రి రాంప్రసాద్ అభినందనలు

    • వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం.. సీఎం చంద్రబాబు సంకల్పానికి నిదర్శనం: మంత్రి

    • 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న వెలిగొండ కల సాకారం: మంత్రి

  • Aug 31, 2026 09:07 IST

    ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసుల దశాబ్దాల కల వెలిగొండ ద్వారా మరికాసేపట్లో నెరవేరనుంది: మంత్రి గొట్టిపాటి

    • అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు: మంత్రి గొట్టిపాటి రవికుమార్

    • వెలిగొండ ప్రారంభంతో పాటు హార్టీకల్చర్ హబ్‌లో జిల్లాను చేర్చి, మార్కాపురం ప్రత్యేక జిల్లాగా ప్రకటించిన ఘనత కూటమి ప్రభుత్వానిది: మంత్రి

  • Aug 31, 2026 08:56 IST

    మూడు దశాబ్దాల వెలిగొండ కలను సాకారం చేసిన సీఎం చంద్రబాబు: మంత్రి అచ్చెన్నాయుడు

    • 1996లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు చేతుల మీదుగానే వెలిగొండ జాతికి అంకితం కావడం చరిత్రాత్మక ఘట్టం: మంత్రి

    • సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవకు వెలిగొండ నిలువెత్తు నిదర్శనం: మంత్రి

    • వెలిగొండతో కరవు ప్రాంత రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు: మంత్రి అచ్చెన్నాయుడు

  • Aug 31, 2026 08:40 IST

    కడప: లింగాల మం. పండ్లతోటలకు మరోసారి జాతీయస్థాయి గుర్తింపు

    • వెలిదండ్ల గ్రామంలో అవకాడో పంట పండించిన వరదారెడ్డి అనే రైతును ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ

    • మన్ కీ బాత్ లో రైతు వరదారెడ్డిని ప్రశంసించిన ప్రధాని

  • Aug 31, 2026 08:39 IST

    విశాఖ: ఆనందపురం-పెందుర్తి సర్వీస్‌ రోడ్డులో ప్రమాదం

    • గండిగుండం సత్తరువు సర్కిల్‌ దగ్గర లారీ-కారు ఢీ, డ్రైవర్ సజీవదహనం

    • కారు నంబర్‌ప్లేట్ ఆధారంగా మృతుడిని గుర్తించేందుకు పోలీసుల యత్నం

  • Aug 31, 2026 08:37 IST

    నేపాల్‌-టిబెట్‌ వరదల్లో 790కి చేరిన మృతుల సంఖ్య

    • నేపాల్‌-టిబెట్ వరదల్లో 2,500 మందికి పైగా గల్లంతు

    • టన్నెల్‌లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు కొనసాగుతున్న చర్యలు

    • నేపాల్‌లో భారత్‌ ప్రత్యేక సహాయక బృందాల చర్యలు

  • Aug 31, 2026 08:36 IST

    వెయ్యి రోజుల పాలనపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన

    • రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం: తెలంగాణ ప్రభుత్వం

    • 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు పంట రుణమాఫీ

    • రైతు భరోసా కింద రూ.36 వేల కోట్ల సాయం

    • వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.1.68 లక్షల కోట్లు

  • Aug 31, 2026 08:26 IST

    ముస్లిం దేశాల ఐక్యతకు ఇరాన్‌ అధినేత మొజ్తబా పిలుపు

    • గల్ఫ్‌ దేశాల మధ్య ఐక్యత లేకపోవడంతో పాలస్తీనాతో పాటు మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతలు: ఇరాన్‌

    • ముస్లిం దేశాల మధ్య అనైక్యతతో శత్రువులకు ప్రయోజనం: ఇరాన్‌

  • Aug 31, 2026 07:53 IST

    భారత్‌కు మరో ఐదు S-400 క్షిపణి వ్యవస్థలు

    • S-400 క్షిపణి వ్యవస్థల కొనుగోళ్ల టెండర్లకు రష్యా స్పందన

    • నవంబర్‌లో ఐదో స్క్వాడ్రన్‌ను సరఫరా చేస్తాం: రష్యా

  • Aug 31, 2026 07:45 IST

    తిరుపతి: చంద్రగిరి మం. బాకరాపేట దగ్గర రోడ్డు ప్రమాదం

    • పైపుల లోడ్‌తో వెళ్తూ కొండ గట్టును ఢీకొని లారీ దగ్ధం

    • మహారాష్ట్ర నుంచి తిరుపతి వస్తుండగా ఘటన

    • లారీ నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్న డ్రైవర్‌

  • Aug 31, 2026 07:44 IST

    కర్నూలు: మంత్రాలయం శ్రీమఠంలో ఓ భక్తురాలి బంగారు ఆభరణాలు చోరీ

    • 22 తులాల బంగారు ఆభరణాలు, 2 తులాల డైమండ్ నెక్లెస్ చోరీకి గురైనట్టు బాధితురాలి వెల్లడి

    • పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు

  • Aug 31, 2026 07:35 IST

    ఇరాన్ రాకెట్ లాంచర్ల లక్ష్యంగా అమెరికా దాడులు

    • హోర్ముజ్ జలసంధి దగ్గర లారక్ ద్వీపంలో రాకెట్ లాంచర్లపై దాడి

    • సీమైన్ల రాకెట్లను ప్రయోగించేందుకు ఇరాన్ సిద్ధం కావడంతో దాడి

    • దాడుల నేపథ్యంలో లారక్ ద్వీపం పరిసరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు

    పూర్తి కథనం

  • Aug 31, 2026 07:35 IST

    ఏలూరు: పోలవరం ప్రాజెక్ట్ పరిసరాల్లో పులి సంచారం

    • 3 రోజులుగా ముంపు గ్రామాల్లో తిరుగుతున్న పులి

    • పి.రెగ్యులేటర్ సమీపంలో పులి దాడిలో గేదె, ఆవు మృతి

    • పోలవరానికి 7 కి.మీ. దూరంలో పులి సంచారం

  • Aug 31, 2026 07:34 IST

    తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్‌కు భద్రత కుదింపు

    • జెడ్ ప్లస్‌ నుంచి జెడ్‌కు తగ్గించిన ప్రభుత్వం

    • భద్రతా సిబ్బంది 54 నుంచి 34 మందికి తగ్గింపు

  • Aug 31, 2026 07:34 IST

    నెల్లూరు: ఆర్టీఓ ఆఫీస్‌ దగ్గర రౌడీషీటర్‌ సాయితేజ దారుణ హత్య

    • రాళ్లతో కొట్టిచంపిన అగంతకులు

    • బీవీనగర్‌కు చెందిన రౌడీషీటర్‌ సహా మరికొందరిపై అనుమానం

    • పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సాయితేజ

    పూర్తి కథనం

  • Aug 31, 2026 07:32 IST

    తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

    • మంచిర్యాల, నిజామాబాద్‌, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలకు వర్ష సూచన

  • Aug 31, 2026 07:32 IST

    నేడు హైకోర్టులో మంత్రి కొండా సురేఖ మాజీ OSD పిటిషన్ విచారణ

    • హత్యాయత్నం కేసు కొట్టేయాలని సుమంత్‌ పిటిషన్‌

  • Aug 31, 2026 07:31 IST

    నేడు వైసీపీ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ

    • SIR ప్రక్రియ ముగిసేవరకు స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని పిటిషన్‌

  • Aug 31, 2026 07:31 IST

    నేడు నిజామాబాద్‌లో TRS పాంచజన్య సంకల్ప సభ

    • పార్టీ ఏర్పాటు తర్వాత తొలిసారి సొంతగడ్డకు కవిత

  • Aug 31, 2026 07:30 IST

    2వ రోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన

    • జోగుళాంబ అమ్మవారిని దర్శించుకోనున్న కిషన్‌రెడ్డి

    • గద్వాల రైల్వేస్టేషన్‌ పరిశీలించనున్న కిషన్‌రెడ్డి

    • బీజేపీ నేతలతో సమావేశం కానున్న కిషన్‌రెడ్డి

  • Aug 31, 2026 07:26 IST

    నేటితో ముగియనున్న APNGOల గడువు

    • NGOలను చర్చలకు పిలవనున్న ఏపీ ప్రభుత్వం

  • Aug 31, 2026 07:24 IST

    అస్సాం: కామరూప్ జిల్లా ఖేత్రీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం

    • వ్యాన్‌-కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురి మృతి, పలువురికి గాయాలు

  • Aug 31, 2026 07:23 IST

    కిర్గిస్థాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన

    • నేడు, రేపు షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు

    • రష్యా అధ్యక్షుడు పుతిన్‌, కిర్గిస్థాన్‌ అధ్యక్షుడు ఝుపరోవ్‌తో చర్చలు జరపనున్న మోదీ

  • Aug 31, 2026 07:22 IST

    నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

    • వెలిగొండ ప్రాజెక్ట్‌ ఫేజ్‌-1 ప్రారంభించనున్న సీఎం

    • కృష్ణా నీటికి జలహారతి, పైలాన్ ఆవిష్కరించనున్న సీఎం

    • నల్లమలసాగర్‌కు నీరు విడుదల చేయనున్న చంద్రబాబు

    • బహిరంగసభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

  • Aug 31, 2026 07:17 IST

    హైదరాబాద్‌: నేడు మూసారంబాగ్‌ వంతెన ప్రారంభం

    • మూసారంబాగ్‌ బ్రిడ్జిని ప్రారంభించనున్న సీఎం రేవంత్‌

    • రూ.52 కోట్లతో 400 మీటర్ల పొడవు వంతెన నిర్మాణం

  • Aug 31, 2026 07:15 IST

    నేడు విశాఖలో మంత్రి లోకేశ్ పర్యటన

    • AIG ఆస్పత్రికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన

    • హెల్త్‌కేర్, అకడమిక్ అండ్ రీసెర్చ్ హబ్ ఏర్పాటు

    • రూ.2 వేలకోట్ల పెట్టుబడి, 9 వేలమందికి ఉపాధి

    • విశాఖలో 9 ఎకరాల్లో ఆస్పత్రి క్యాంపస్

    • 2.5 ఎకరాల్లో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు

    • సిరిపురం జంక్షన్ దగ్గర కొణిజేటి రోశయ్య విగ్రహావిష్కరణ

  • Aug 31, 2026 07:12 IST

    యాపిల్ కంపెనీ నుంచి టిమ్‌ కుక్ ఔట్‌

  • Aug 31, 2026 07:12 IST

    హైదరాబాద్‌లో ప్రస్తుతం బంగారం ధరలు ఇవీ

    • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,230

    • 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,45,040

    • 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,670

    • కిలో వెండి ధర రూ.2,59,900

    పూర్తి కథనం

  • Aug 31, 2026 07:07 IST

    రష్యాలోని కిరిషి ప్రాంతంలోని చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ దాడి

    • భారీ అగ్ని ప్రమాదంతో చెలరేగిన మంటలు

    • గతంలోనూ ఇదే ప్లాంట్‌పై ఉక్రెయిన్ దాడి