Share News

వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్‌-1ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 31 , 2026 | 11:45 AM

వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. దోర్నాల మండలం గంటావానిపల్లి వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ వద్ద కృష్ణమ్మకి జలహారతి ఇచ్చి, సారె సమర్పించారు.

వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్‌-1ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

మార్కాపురం, ఆగస్టు 31: వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈరోజు(సోమవారం) ఉదయం దోర్నాల మండలం గంటావానిపల్లి వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ వద్ద కృష్ణమ్మకి జలహారతి ఇచ్చి, సారె సమర్పించారు. కృష్ణా జలాలను తలపై చల్లుకున్నారు. పంచె కట్టుతో సాంప్రదాయంగా పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. జలహారతి ఇచ్చిన అనంతరం కెనాల్ ఒడ్డున కృష్ణమ్మకు సీఎం సాష్టాంగ ప్రణామం చేయడంతో.. రైతులు, మహిళలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించి.. జాతికి అంకితం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ వద్ద గేట్లు ఎత్తి నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేశారు. స్థానిక రైతులతో బటన్ నొక్కించి గేట్లు ఎత్తించారు సీఎం. ఆ వెంటనే కెనాల్ నుంచి పరవళ్లు తొక్కుతూ నల్లమలసాగర్ వైపు కృష్ణా జలాలు మళ్లాయి.


నీటి విడుదలతో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడపలో కరవు ప్రాంతాలకు జలకళ సంతరించుకుంది. 1996 మార్చి 5 న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు.. 30 ఏళ్ల తరువాత దానిని పూర్తి చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

మియాపూర్‌లో విషాదం.. చదువు రావడం లేదనే మనస్తాపంతో

రాజేంద్రనగర్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఐదు బైక్‌ల దగ్ధం

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 31 , 2026 | 01:47 PM