మియాపూర్‌లో విషాదం.. చదువు రావడం లేదనే మనస్తాపంతో
ABN , Publish Date - Aug 31 , 2026 | 11:21 AM
హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. చదువు సరిగా రావడం లేదనే మనస్తాపంతో 16 ఏళ్ల పదో తరగతి విద్యార్థి మల్లికార్జున్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్, ఆగస్టు 31: మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. చదువు సరిగా రావడం లేదనే మనస్తాపంతో 16 ఏళ్ల పదో తరగతి విద్యార్థి మల్లికార్జున్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మల్లికార్జున్ తండ్రి పెయింటింగ్ పని చేస్తూ కుమారుడిని చదివిస్తున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు దారితీసిన పూర్తి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కన్న బిడ్డ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
విశాఖలో రోడ్డు ప్రమాదం.. క్షణాల్లో దగ్ధమైన కారు, డ్రైవర్ సజీవ దహనం
వాట్సాప్‌లో ఫ్రెండ్స్‌కు మెసేజ్.. కానిస్టేబుల్ బలవన్మరణం
Read Latest Telangana News And Telugu News