వాట్సాప్‌లో ఫ్రెండ్స్‌కు మెసేజ్.. కానిస్టేబుల్ బలవన్మరణం
ABN , Publish Date - Aug 31 , 2026 | 09:45 AM
హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ తిరుమలనగర్‌లో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. నిభాష్(25) అనే ఏఆర్ కానిస్టేబుల్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
హైదరాబాద్, ఆగస్టు 31: నగరంలోని అంబర్‌పేట్ తిరుమలనగర్‌లో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. నిభాష్(25) అనే ఏఆర్ కానిస్టేబుల్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తాను చనిపోతున్నానంటూ ఆత్మహత్యకు ముందు స్నేహితులకు వాట్సాప్ ద్వారా నిభాష్ సమాచారం అందించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్నేహితులు సూసైడ్ విషయాన్ని పోలీసులకు తెలియజేయగా.. వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికే కానిస్టేబుల్ చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.
లవ్ ఫెయిల్యూరే ఆత్మహత్యకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిభాష్ సూసైడ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
అమెరికాలో వరద బీభత్సం.. 20 మందికి పైగా గల్లంతు
విశాఖలో రోడ్డు ప్రమాదం.. క్షణాల్లో దగ్ధమైన కారు, డ్రైవర్ సజీవ దహనం
Read Latest Telangana News And Telugu News