పశ్చిమగోదావరి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్.. నిలిచిపోయిన పలు రైళ్లు
ABN , Publish Date - Aug 31 , 2026 | 09:33 AM
పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనతో నిడదవోలు, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో పలు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పశ్చిమగోదావరి, ఆగస్టు 31: జిల్లాలోని చాగల్లు సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటన ప్రభావంతో నిడదవోలు, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో పలు రైళ్లు నిలిచిపోయాయి. ముఖ్యంగా ప్రయాణికుల రైళ్ల రాకపోకలపై ప్రభావం పడటంతో స్టేషన్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు రైళ్ల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు.. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ప్రాంతంలో రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పిన బోగీలను తొలగించి రైల్వే ట్రాక్‌ను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ట్రాక్ క్లియర్ అయ్యే వరకు పలు రైళ్లను నిలిపివేయడం లేదా ఆలస్యంగా నడిపించే అవకాశం ఉంది. దీంతో నిడదవోలు, రాజమండ్రి స్టేషన్లతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రయాణికులపై ఈ ప్రభావం పడుతోంది. రైల్వే అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, రైళ్ల రాకపోకలను సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నారు. ప్రయాణికులు రైల్వే అధికారుల సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి
శ్రేయస్‌కు బ్యాకప్‌గా తిలక్ వర్మ!.. గంభీర్, అగార్కర్ ప్లాన్ అదేనా?
మాతృదేశానికి పయనమైన 90 ఏళ్ల డా.భానుమతి ఇవటూరి - డాలస్‌లో సన్మానం