Share News

విశాఖలో రోడ్డు ప్రమాదం.. క్షణాల్లో దగ్ధమైన కారు, డ్రైవర్ సజీవ దహనం

ABN , Publish Date - Aug 31 , 2026 | 08:51 AM

విశాఖలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆనందపురం-పెందుర్తి సర్వీస్‌ రోడ్డులో లారీని కారు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారు పూర్తిగా దగ్ధమై.. అందులో ఉన్న డ్రైవర్ సజీవ దహనమయ్యాడు.

విశాఖలో రోడ్డు ప్రమాదం.. క్షణాల్లో దగ్ధమైన కారు, డ్రైవర్ సజీవ దహనం
Vizag Road Accident

విశాఖపట్నం, ఆగస్టు 31: జిల్లాలోని ఆనందపురం-పెందుర్తి సర్వీస్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గండిగుండం సత్తరువు కూడలి వద్ద ఓ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగి క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవర్ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైనట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా కాలిపోవడంతో ఘటనాస్థలంలో భయానక పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చి, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.


ఇదిలా ఉండగా.. ప్రమాదం అనంతరం లారీకి చిక్కుకున్న నంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడి వివరాలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గురైన కారు ఏ పరిస్థితుల్లో లారీని ఢీకొట్టిందనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించి.. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నెల్లూరులో రౌడీ షీటర్ దారుణ హత్య

బాకరాపేట ఘాట్‌రోడ్డులో లారీ దగ్ధం.. త్రుటిలో తప్పించుకున్న డ్రైవర్

Updated Date - Aug 31 , 2026 | 09:34 AM