రాజేంద్రనగర్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఐదు బైక్‌ల దగ్ధం
ABN , Publish Date - Aug 31 , 2026 | 11:34 AM
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్‌షాకోట్ డివిజన్ సాయిరాం నగర్ కాలనీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఇంట్లో పార్క్ చేసిన బైక్‌లకు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
రంగారెడ్డి, ఆగస్టు 31: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్‌షాకోట్ డివిజన్ సాయిరాం నగర్ కాలనీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఇంట్లో పార్క్ చేసిన బైక్‌లకు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ఐదు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. బైక్‌లలో పెట్రోల్ ఉండటంతో భారీగా మంటలు భారీ ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బైక్‌లకు ఎవరైనా కావాలనే నిప్పంటించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు(సోమవారం) తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి సంచరించినట్లు పోలీసులు సీసీ ఫుటేజ్‌లో గుర్తించారు. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయా? లేక ఉద్దేశపూర్వకంగా నిప్పంటించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
వాట్సాప్‌లో ఫ్రెండ్స్‌కు మెసేజ్.. కానిస్టేబుల్ బలవన్మరణం
మియాపూర్‌లో విషాదం.. చదువు రావడం లేదనే మనస్తాపంతో
Read Latest Telangana News And Telugu News