Share News

విశాఖలో స్పా సెంటర్లపై మెరుపు దాడులు.. పోలీసుల అదుపులో యువతీ యువకులు

ABN , Publish Date - Aug 31 , 2026 | 09:47 AM

విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లోని స్పా సెంటర్లపై పోలీసులు మెరుపు దాడుల చేశారు. విశాఖలోని మొత్తం121 సెంటర్లపై ఆదివారం రాత్రి ఈ దాడులు నిర్వహించారు.

విశాఖలో స్పా సెంటర్లపై మెరుపు దాడులు.. పోలీసుల అదుపులో యువతీ యువకులు

విశాఖపట్నం,ఆగస్టు31: నగరంలోని వివిధ ప్రాంతాల్లోని స్పా సెంటర్లపై పోలీసులు మెరుపు దాడుల చేశారు. విశాఖలోని మొత్తం121 సెంటర్లపై ఆదివారం రాత్రి ఈ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ఆధారాలను పోలీసులు గుర్తించారు. ఆ క్రమంలో నలుగురు మహిళలు, ముగ్గురు విటులతోపాటు నిర్వాహకులను గాజువాక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే నలుగురు మహిళలను పోలీసులు రక్షించారు. ఆ తర్వాత వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాజువాక, చిన గంట్యాడ, మీయామీ ఆయుర్వేదిక్, థాయ్ స్పాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో పోలీసులు ఈ దాడులు చేశారు.


స్పా ముసుగులో పెద్ద ఎత్తున వ్యభిచారం జరుగుతున్నట్లు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నగర సీపీ ఆదేశాల మేరకు పోలీసులు మెరుపు దాడులు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రాజెక్టు ప్రారంభం కాదు.. కరువు సీమ భవిష్యత్తును మార్చే చారిత్రక ఘట్టం: మంత్రి అచ్చెన్నాయుడు

విశాఖలో రోడ్డు ప్రమాదం.. క్షణాల్లో దగ్ధమైన కారు, డ్రైవర్ సజీవ దహనం

For More AP News And Telugu News

Updated Date - Aug 31 , 2026 | 10:27 AM