Share News

ఇరాన్ లారక్ ఐలాండ్‌పై అమెరికా దాడులు.. మూల్యం తప్పదన్న ఐఆర్‌జీసీ..

ABN , Publish Date - Aug 31 , 2026 | 06:43 AM

హోర్ముజ్ జలసంధిలోని లారక్ ఐలాండ్‌లో ఇరాన్‌కు చెందిన లాంచ్ సిస్టమ్స్ మీద అమెరికా దాడులు చేసింది. ఈ విషయాన్ని అమెరికా ఉన్నతాధికారి ధ్రువీకరించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.

ఇరాన్ లారక్ ఐలాండ్‌పై అమెరికా దాడులు.. మూల్యం తప్పదన్న ఐఆర్‌జీసీ..
US Iran War

ఇంటర్‌నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధిలోని లారక్ ఐలాండ్‌లో ఇరాన్‌కు చెందిన లాంచ్ సిస్టమ్స్ మీద అమెరికా దాడులు చేసింది. ఈ విషయాన్ని అమెరికా ఉన్నతాధికారి ధ్రువీకరించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. ‘హోర్ముజ్ జలసంధిలోని లారక్ ఐలాండ్‌లో ఇరాన్‌కు చెందిన రెండు లాంచర్స్‌ మీద అమెరికా సైన్యం ఈ రోజు తెల్లవారుజామున (సోమవారం) దాడులు చేసిందని కచ్చితంగా చెప్పగలను. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ దళాలు హోర్ముజ్‌లో సీమైన్స్ కలిగిన రాకెట్లను పేల్చడానికి సిద్ధమవుతుండగా అమెరికా దాడులు చేసింది’అని ఆయన రాయిటర్స్‌తో తెలిపారు.


అమెరికా దాడులను ఐఆర్‌జీసీ ధ్రువీకరించింది. లారక్ ఐలాండ్‌లో అమెరికా దాడులు చేసిందని.. పలువురు సైనికులు, సామాన్య ప్రజలు గాయపడ్డారని, మరి కొంతమంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. అమెరికా దాడులపై ఐఆర్‌జీసీ తీవ్రంగా స్పందించినట్లు ఇరాన్ స్టేట్ మీడియా తెలిపింది. దాడికి కచ్చితమైన స్పందన ఉంటుందని, భారీ మూల్యం తప్పదని ఐఆర్‌జీసీ హెచ్చరించినట్లు పేర్కొంది. లారక్ ఐలాండ్ హోర్ముజ్ ఐలాండ్‌కు దక్షిణాన, కేశమ్ ఐలాండ్‌కు ఉత్తరాన ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు లారక్ 1100 కిలోమీటర్ల దూరంలో ఉంది.


ఇవి కూడా చదవండి

డ్రోన్ల ద్వారా 24 వేల మందికి వైద్యం

మానసిక దివ్యాంగురాలిపై లైంగిక దాడి

Updated Date - Aug 31 , 2026 | 06:49 AM