-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 28th July 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jul 28 , 2026 | 06:42 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jul 28, 2026 21:47 IST
అమరావతి: రెండోరోజు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం
రాష్ట్ర వ్యాప్తంగా 2,18,619 ఇళ్లను సందర్శించిన టీడీపీ శ్రేణులు
ప్రజలను కలిసి ప్రభుత్వ పథకాలు వివరించిన నాయకులు
రెండేళ్ల కూటమి పాలన విజయాలను వివరించిన నేతలు
-
Jul 28, 2026 21:46 IST
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో ఏలేరు ఆయకట్టుకు సాగునీరు
ఏలేరు ఆయకట్టుకు 1000 క్యూసెక్కులు విడుదలకు ఏర్పాట్లు
ఆయకట్టు చివరి భూములకు నీరు అందేలా కాలువల్లో పూడికతీత
పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో నిరంతరాయంగా నీరు విడుదల
-
Jul 28, 2026 20:23 IST
భారీ వర్షం నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలి: జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
కలుషిత నీరు సరఫరా అవకాశం ఉన్నందున ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: అశోక్ రెడ్డి
ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు అప్రమత్తంగా ఉండాలి: జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
-
Jul 28, 2026 20:18 IST
CRDAపై సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
విజయవాడ, గుంటూరుతో కలిపి అమరావతి అభివృద్ధి: సీఎం చంద్రబాబు
రాజధాని అంటే 29 గ్రామాలు మాత్రమే కాదు.. గుంటూరు, విజయవాడ సమాహారంగా చూడాలి
రోడ్ల నిర్మాణం, పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి: సీఎం చంద్రబాబు
ఇకపై రాజధాని పనులను స్వయంగా పరిశీలిస్తా: సీఎం చంద్రబాబు
-
Jul 28, 2026 20:17 IST
తెలంగాణ రాష్ట్ర టెలివిజన్ అవార్డులకు ప్రభుత్వం శ్రీకారం
టీవీ రంగంలో ప్రతిభకు ప్రోత్సాహమే లక్ష్యం: మంత్రి కోమటి రెడ్డి
పూర్తి పారదర్శకతతో అవార్డుల ఎంపిక: మంత్రి కోమటిరెడ్డి
TV సీరియల్స్, నాన్ ఫిక్షన్, డాక్యుమెంటరీలకు అవార్డులు
న్యూస్ ఛానల్స్ యాంకర్లు, ప్రెజెంటర్లకూ అవార్డుల ప్రతిపాదన
-
Jul 28, 2026 20:16 IST
అమరావతి: రాజధాని పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
కాంట్రాక్ట్ సంస్థలు, అధికారులతో సీఎం చంద్రబాబు రివ్యూ
స్పీడ్, క్వాలిటీ, డెలివరీ లక్ష్యంగా పనులు: సీఎం చంద్రబాబు
పనుల వేగం మరింత పెంచాలి: సీఎం చంద్రబాబు
నిర్దేశిత సమయానికి పనులు పూర్తికావాలి: సీఎం చంద్రబాబు
-
Jul 28, 2026 20:15 IST
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశాలు
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పొన్నం
-
Jul 28, 2026 20:00 IST
మెదక్: ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టుకి జలకళ
భారీ వర్షాలతో నిండుకుండలా వనదుర్గ ప్రాజెక్టు
హర్షం వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతులు
-
Jul 28, 2026 20:00 IST
హైదరాబాద్: మాజీ MLA పెద్ది సుదర్శన్‌రెడ్డి హెల్త్ బులిటెన్ విడుదల
విషమంగానే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యం: వైద్యులు
గుండె పల్స్ పడిపోవడంతో నాడీ వ్యవస్థ స్తంభించింది: వైద్యులు
మరో 72 గంటల పాటు పర్యవేక్షణ కొనసాగుతుంది: వైద్యులు
-
Jul 28, 2026 19:59 IST
హైదరాబాద్: గచ్చిబౌలి ORRపై ప్రమాదం
ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
మృతులు ప్రణీతి, సురేందర్‌గా గుర్తింపు
మృతులు యాదాద్రి భువనగిరి జిల్లా వాసులు
-
Jul 28, 2026 19:44 IST
మెదక్: తూప్రాన్‌లో భారీ సైబర్ మోసం
నకిలీ ట్రేడింగ్ యాప్‌తో రూ.72.69 లక్షలకు టోకరా
యూట్యూబ్ ప్రకటన చూసి వాట్సాప్ గ్రూపులో చేరిన బాధితుడు
నకిలీ యాప్ డౌన్‌లోడ్ చేయించిన సైబర్ నేరగాళ్లు
నకిలీ లాభాలు చూపించి లక్షల రూపాయలు కాజేసిన మోసగాళ్లు
డబ్బు విత్‌డ్రా చేయాలంటే మరింత నగదు చెల్లించాలని డిమాండ్
తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
-
Jul 28, 2026 19:40 IST
ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డిని చట్ట పరిధిలో విచారిస్తాం: DCP శ్రీనివాస్
ఉదయ్ కృష్ణారెడ్డిపై అభియాగాలు ఉన్నాయి: ABNతో డీసీపీ శ్రీనివాస్
కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుంది: ABNతో డీసీపీ శ్రీనివాస్
-
Jul 28, 2026 19:34 IST
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలు చోట్ల వర్షం
సంగారెడ్డి జిల్లా దిగ్వాల్లో 3.5, జహీరాబాద్‌లో 2.3, కోహిర్‌లో 2.1 సెంటీమీటర్ల వర్షం
మెదక్ జిల్లా వెల్దుర్తిలో 2.9, కాగజ్ మద్దూర్‌లో 2.7, చేగుంటలో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
-
Jul 28, 2026 19:28 IST
ములుగు: మంగపేట మండలంలో ఈదురుగాలుల బీభత్సం
కోమటిపల్లి అడవుల్లో భారీ సంఖ్యలో నేలకూలిన వృక్షాలు
-
Jul 28, 2026 19:27 IST
కర్నూలు: ఎమ్మిగనూరులో భారీ వర్షం.. మార్కెట్ అధికారుల నిర్లక్ష్యం
వ్యవసాయ మార్కెట్‌లో తడిసిన వేలాది వేరుశెనగ సంచులు
గిట్టుబాటు ధర లేక రైతుల ఆందోళన
మార్కెట్‌కు 23 వేల సంచుల వేరుశెనగ రాక
సరుకు వాపసు తీసుకెళ్లేందుకు సంచికి రూ.30 వసూలు చేస్తున్నారని రైతుల ఆరోపణ
-
Jul 28, 2026 19:23 IST
తూ.గో.: గోపాలపురం మండలం కరిచర్లగూడెం దగ్గర పులి సంచారం
పామాయిల్ తోట దగ్గర దూడను చంపి లాక్కెళ్లిన పులి
-
Jul 28, 2026 19:22 IST
విజయనగరం: ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేశ్ సమీక్ష
పలు కీలక అంశాలపై చర్చ
-
Jul 28, 2026 19:01 IST
హైదరాబాద్: కలెక్టర్లతో సీఎస్ సంజయ్ జాజు టెలికాన్ఫరెన్స్
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: సీఎస్
అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలి: సీఎస్
-
Jul 28, 2026 18:59 IST
అవినీతిపై తెలంగాణ ఏసీబీ దూకుడు
1983 తర్వాత రికార్డు స్థాయిలో కేసుల నమోదు
2026 రెండో త్రైమాసికంలో అత్యధిక కేసులు
-
Jul 28, 2026 18:24 IST
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం
రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్
మరో గంటపాటు కుండపోత వాన: IMD
-
Jul 28, 2026 18:14 IST
పోలీసుల అదుపులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
మిర్యాలగూడ దగ్గర ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులపై అత్తాపూర్‌లో నమోదైన కేసు
కేసు దర్యాప్తును ఉమెన్స్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేసిన సీపీ సజ్జనార్
-
Jul 28, 2026 18:12 IST
ముద్రగడ సంస్మరణ సభకు మాత్రమే హాజరయ్యా: బొండా ఉమా
సోషల్ మీడియాలో వక్రీకరించి దుష్ప్రచారం చేశారు: బొండా ఉమా
ముద్రగడ సంస్మరణ సభలో నేను కూర్చున్న కుర్చీ పక్కకు అంబటి రాంబాబు వచ్చి పలకరించారు
ఆ సభకు అన్ని పార్టీల నేతలూ వచ్చారు: బొండా ఉమా
కాపు జేఏసీ తరపున నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లాం: బొండా ఉమా
నా మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేశారు: బొండా ఉమా మహేశ్వరరావు
-
Jul 28, 2026 18:07 IST
ఢిల్లి: డీలిమిటేషన్‌పై కేంద్రం స్పష్టత ఇవ్వాలి: కేటీఆర్
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దు: కేటీఆర్
కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి: కేటీఆర్
కొత్తగూడెం రైల్వే డివిజన్ సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి: కేటీఆర్
హైదరాబాద్–కరీంనగర్ రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలి: కేటీఆర్
తెలంగాణ రైల్వే, ఐటీ అభివృద్ధిపై అశ్వినీ వైష్ణవ్‌తో కేటీఆర్ భేటీ
-
Jul 28, 2026 17:12 IST
చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరగాలి: ప్రియాంక గాంధీ
పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధ ఎవరు తీరుస్తారు?: ప్రియాంక గాంధీ
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై యువత ఆగ్రహంతో ఉన్నారు: ప్రియాంక
విద్యార్థులపై దాడి చేయాలని ఎవరు ఆదేశించారు?: ప్రియాంక
ఆందోళన చేసిన విద్యార్థులు తీవ్రవాదులు కాదు కదా?: ప్రియాంక
విద్యార్థులపై లాఠీచార్జ్ చేయాల్సిన అవసరం ఏంటి?: ప్రియాంక గాంధీ
-
Jul 28, 2026 17:03 IST
డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీం కోర్టు విచారణ
డిజిటల్ అరెస్ట్ మోసాలకు 'కిల్ స్విచ్'
వాట్సాప్ సహా చాట్ యాప్స్‌లో సైబర్ నేరాల నివారణపై సుప్రీం దృష్టి
దీర్ఘకాలిక, సందేహాస్పద కాల్స్‌ను నిలిపివేసేలా 'కిల్ స్విచ్' ఏర్పాటుపై విచారణ
బాధితుల రక్షణకు రెండంచెల భద్రతా విధానం ప్రతిపాదించిన అమికస్ క్యూరీ
కాల్ మధ్యలో 'పాప్-అప్ వార్నింగ్' ఇవ్వాలని సుప్రీం కోర్టు సూచన
-
Jul 28, 2026 16:55 IST
మయన్మార్ కీలక నిర్ణయం
సైబర్ నేరాలను అరికట్టేందుకు కొత్త చట్టం
దోషులుగా తేలితే మరణశిక్ష విధించేలా బిల్లు
బిల్లుకు మయన్మార్ పార్లమెంట్ ఆమోదం
-
Jul 28, 2026 16:50 IST
విజయవాడ: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీఐ నాగరాజు రిమాండ్ పొడిగింపు
సీఐ నాగరాజును వర్చువల్‌గా జడ్జి ఎదుట హాజరుపరిచిన అధికారులు
ఆగష్టు 11వరకూ నాగరాజు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు
-
Jul 28, 2026 16:48 IST
టీడీపీ కేంద్ర కార్యాలయానికి బొండా ఉమామహేశ్వరరావు
టీడీపీ త్రిసభ్య కమిటీ ఎదుట హాజరైన బొండా ఉమ
అంబటితో కలిసి వేదిక పంచుకోవడంపై ఉమ వివరణ
-
Jul 28, 2026 16:08 IST
ఢిల్లీ: హైడ్రా పనులను కొనసాగించి తీరుతాం: సీఎం రేవంత్ రెడ్డి
కబ్జా కోరులు హైడ్రా వద్దంటున్నారు: సీఎం రేవంత్
కబ్జాలు చేస్తే బడా బాబులైనా, పేదలైనా ఊరుకోం: సీఎం రేవంత్
గండిపేట బతుకమ్మ కుంటలను ఆక్రమించింది పేదలా.. పెద్దలా: సీఎం రేవంత్
హైడ్రా మేము తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణ: సీఎం రేవంత్
ఏ అధికారిని నియమించాలనే విచక్షణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది : సీఎం రేవంత్ రెడ్డి
-
Jul 28, 2026 15:54 IST
ఢిల్లీ: కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ
తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ
PMAY కింద తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కేటాయించాలి: సీఎం రేవంత్ రెడ్డి
గతంలో గ్రామీణ ఇళ్ల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారు: సీఎం రేవంత్
VB G RAM Gలో అదనపు పనులు కేటాయించాలి: సీఎం రేవంత్
VB G RAM Gలో 10 కొత్త పనులను చేర్చాలి: సీఎం రేవంత్ రెడ్డి
-
Jul 28, 2026 15:51 IST
స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
70 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
11 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ
-
Jul 28, 2026 15:38 IST
హైదరాబాద్: హైడ్రాకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది: మంత్రి శ్రీధర్ బాబు
హైడ్రాపై కోర్టు తీర్పును పూర్తిగా గౌరవిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
చెప్పాల్సిన వాదనలను కోర్టులోనే చెబుతాం: శ్రీధర్ బాబు
హైడ్రాపై బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయి: శ్రీధర్ బాబు
హైడ్రా కేసులో పూర్తి తీర్పు ఇంకా రాలేదు: మంత్రి శ్రీధర్ బాబు
-
Jul 28, 2026 15:27 IST
హైదరాబాద్: మీకు ఎవరైనా నచ్చకపోతే.. వారిని వదిలేయండి: అల్లు అర్జున్
ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశంలో అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు
మీకు ఎవరైనా నచ్చకపోతే వారిని వదిలేయండి: అల్లు అర్జున్
నచ్చనివారిని ట్రోల్ చేయడం, ద్వేషించడం సరికాదు: అల్లు అర్జున్
ఎవరి కోసమో మీ సమయం, డబ్బు వృథా చేయొద్దు: అల్లు అర్జున్
మీ శక్తిని మీ కుటుంబం కోసం వినియోగించండి: అల్లు అర్జున్
-
Jul 28, 2026 15:07 IST
హైదరాబాద్: మంత్రి కోమటిరెడ్డితో టెలివిజన్ అవార్డుల కమిటీ భేటీ
టీవీ అవార్డులకు ప్రత్యేక లోగో, పేరు, కేటగిరీలపై చర్చ
టీవీ అవార్డులకు పీవీ నరసింహారావు పేరు పరిశీలన
గైడ్‌లైన్స్ సిద్ధం చేయాలని కమిటీకి మంత్రి కోమటిరెడ్డి ఆదేశం
-
Jul 28, 2026 15:05 IST
కోర్టు విచారణ వీడియోలపై సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు
కోర్టు ఆడియో, వీడియో రికార్డింగ్స్ వినియోగంపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు
అనుమతి లేకుండా కోర్టు వీడియోలు పోస్టు చేయడంపై నిషేధం విధించిన సుప్రీం కోర్టు
వీడియోలను ఎడిట్, డౌన్‌లోడ్, రీపోస్ట్ చేయటాన్ని నేరంగా పరిగణించిన సుప్రీం
-
Jul 28, 2026 14:30 IST
లోక్‌సభ: పేపర్ లీక్‌లను అరికట్టేందుకే బిల్లు: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రధాని మోదీ కృషి: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
దేశ చరిత్రలోనే ఈ చట్టం ఒక మైలురాయి: జితేంద్ర సింగ్
దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లు జరుగుతున్నాయి: జితేంద్ర సింగ్
కాంగ్రెస్ హయాంలోనూ RRB పేపర్ లీక్ అయ్యింది: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
-
Jul 28, 2026 14:28 IST
పౌర సరఫరాల్లో ఏపీ సంస్కరణలకు కేంద్రం ప్రశంసలు: నాదెండ్ల మనోహర్
రూ.281 కోట్ల బకాయిల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్: మంత్రి నాదెండ్ల
కాకినాడలో స్టీమ్ రైస్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం: మంత్రి నాదెండ్ల
రేషన్ షాపుల ద్వారా 'మీ మార్ట్' కాన్సెప్ట్ అమలు: మంత్రి నాదెండ్ల
త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ రకం బియ్యం విక్రయం: మంత్రి నాదెండ్ల
కిలో రూ.40కి స్వర్ణ రకం బియ్యం విక్రయించడమే లక్ష్యం: మంత్రి నాదెండ్ల మనోహర్
-
Jul 28, 2026 14:21 IST
హైదరాబాద్ కాచిగూడలో విషాదం
ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేయబోయి మహిళ మృతి
స్కూటీ అదుపుతప్పి బస్సు కింద పడటంతో ప్రమాదం
-
Jul 28, 2026 14:20 IST
నీట్ EWS కోటా ఆదాయ పరిమితిపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
EWS నిబంధనలపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం
పాండే కమిటీ సిఫార్సులు, అర్హతల మార్గదర్శకాలపై విచారణ
రూ.8 లక్షల వార్షిక ఆదాయ పరిమితి సమంజసమే: సుప్రీం
తదుపరి విచారణ ఆగస్టు 11కి వాయిదా వేసిన ధర్మాసనం
-
Jul 28, 2026 14:05 IST
రాజ్యసభ రేపటికి వాయిదా
-
Jul 28, 2026 13:46 IST
మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో ఉద్రిక్తత
కొనుగోలు చేసిన పంట డబ్బులు ఇప్పించాలంటూ మార్కెట్‌కు తాళం వేసి రైతుల ఆందోళన
పెట్రోల్ పోసుకుని రైతు ఆత్మహత్యాయత్నం
-
Jul 28, 2026 13:33 IST
హైదరాబాద్: లైంగిక ఆరోపణలపై స్పందించిన ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి
నాపై వచ్చిన ఆరోపణలు ముమ్మాటికీ అవాస్తవం: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
నేనెక్కడికీ పారిపోలేదు, సొంతూళ్లోనే ఉన్నా: ఉదయ్ కృష్ణారెడ్డి
చట్టాల మీద నమ్మకం ఉంది.. పోలీసులకు సహకరిస్తా: ఉదయ్ కృష్ణారెడ్డి
ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను: ఉదయ్ కృష్ణారెడ్డి
-
Jul 28, 2026 13:31 IST
జపాన్‌లో భారీ భూప్రకంపనలు
క్యుషూ ప్రాంతాన్ని కుదిపేసిన భూప్రకంపనలు
రిక్టర్ స్కేలుపై 7.1గా తీవ్రత నమోదు
షింకాన్సెన్ రైలు సర్వీసుల నిలిపివేత
సునామీ హెచ్చరికలు జారీచేసినట్టు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడి
పలుచోట్ల అత్యవసర హెచ్చరికలు జారీ
-
Jul 28, 2026 13:22 IST
సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఢిల్లీ టూర్‌పై ఎంపీ అర్వింద్ విమర్శలు
విద్యార్థుల భవిష్యత్తును రేవంత్‌రెడ్డి, కేటీఆర్ నాశనం చేశారు: ఎంపీ అర్వింద్
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుల్లో రేవంత్‌రెడ్డి విఫలం: ఎంపీ అర్వింద్
BRS, కాంగ్రెస్ పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం నిర్వీర్యం: ఎంపీ అర్వింద్
-
Jul 28, 2026 13:14 IST
సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
నేరచరిత్ర లేని విద్యార్థులు, నిరసనకారులను అన్ని రాష్ట్రాల్లో విడిచిపెట్టాలి: సుప్రీంకోర్టు
విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ అంశంలో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
కేంద్రం సహా పలు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
తదుపరి విచారణ ఆగస్టు 3కు వాయిదా
-
Jul 28, 2026 13:08 IST
హెచ్-1బీ వీసాదారులకు గ్రీన్‌కార్డ్ బిల్లు
దీర్ఘకాల నివాసితులకు ఊరట కలిగించే ప్రతిపాదన
మళ్లీ బిల్లు ప్రవేశపెట్టిన అలెక్స్ పాడిల్లా
భారతీయ హెచ్-1బీ ఉద్యోగులకు భారీ ఊరట లభించే అవకాశం
గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్‌కు పరిష్కార యత్నం
ఏడేళ్ల తర్వాత గ్రీన్‌కార్డ్‌కు అవకాశం
-
Jul 28, 2026 13:07 IST
ఏలూరు: నూజివీడులో అర్ధరాత్రి కిడ్నాప్ కలకలం
గుంటూరు వైసీపీ మాజీ MLA మహ్మద్ ముస్తఫా కొడుకు బషీర్‌పై కేసు
కోయిలగూడెం నుంచి గుంటూరు వెళ్తున్న పొగాకు లోడ్ వాహనాన్ని నూజివీడులోని పెట్రోల్ బంకు దగ్గర అడ్డుకున్న ముస్తఫా అనుచరులు
రెండు కార్లలో వచ్చి వాహనాన్ని ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిన ముస్తఫా కొడుకు బషీర్, అనుచరులు
-
Jul 28, 2026 12:55 IST
అమరావతి: పెనమలూరులో మంత్రి నారా లోకేశ్‌కు మద్దతుగా అంగన్‌వాడీల ర్యాలీ
కృతజ్ఞత ర్యాలీని నిరసనగా చూపుతున్నారని వైసీపీపై లోకేశ్ మండిపాటు
ఎక్స్‌లో 'ఫేక్ Vs రియల్' వీడియో విడుదల చేసిన మంత్రి లోకేశ్
-
Jul 28, 2026 12:33 IST
ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డికి సీఎం రేవంత్ నివాళులు
రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్‌రెడ్డి: సీఎం రేవంత్‌రెడ్డి
-
Jul 28, 2026 12:29 IST
విశాఖలో 9 చోట్ల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ: మంత్రి మండిపల్లి
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ప్రతి అరగంటకు బస్సు: మంత్రి మండిపల్లి
భోగాపురం ఎయిర్‌పోర్ట్ అంశంలో వైసీపీది క్రెడిట్ చోరీ: మంత్రి మండిపల్లి
ఎయిర్‌పోర్ట్ అంశంలో వైసీపీది దుష్ప్రచారం: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
-
Jul 28, 2026 12:26 IST
చిత్తూరు: కుప్పం ప్రభుత్వాస్పత్రిని పరిశీలించిన నారా భువనేశ్వరి
స్విమ్స్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పింక్ బస్సు ప్రారంభం
స్విమ్స్ సిబ్బందికి నారా భువనేశ్వరి అభినందనలు
-
Jul 28, 2026 12:11 IST
కృష్ణా: జోసెఫ్ రావణ్ కస్టడీ పిటిషన్‌పై గన్నవరం కోర్టులో వాదనలు
కోర్టుకు వైసీపీ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
గన్నవరం కోర్టుకు వచ్చిన జోసెఫ్ రావణ్ భార్య అనూష
కోర్టు ఆవరణలో మాజీ MLA వంశీని కలిసిన అనూష
-
Jul 28, 2026 12:00 IST
విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
నీట్ నిరసనల సమయంలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
నిర్దోషులపై అక్రమాలకు పాల్పడితే చట్టం ఊరుకోదు: CJI జస్టిస్ సూర్యకాంత్
బాధ్యులను తేల్చనప్పుడు విచారణకు అర్థమే లేదు: సుప్రీం కోర్టు
స్వతంత్ర విచారణ జరగాల్సిందేనన్న అత్యున్నత న్యాయస్థానం
-
Jul 28, 2026 11:58 IST
చలో సంసద్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ
జులై 20 నాటి ఘటనపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం
శాంతియుత ఆందోళన అణచివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం
పెల్లెట్ గన్‌ల వాడకంపై CJI అసహనం
పోలీసుల తీరుపై స్వతంత్ర SITకు ఆదేశాలు
ఎలక్ట్రిక్ లాఠీల వినియోగంపై అభ్యంతరం
-
Jul 28, 2026 11:46 IST
మంగళ మిలన్‌లో కీలక నిర్ణయాలు
ప్రధాని మోదీ నేతృత్వంలో NDA పార్లమెంటరీ పార్టీ 'మంగళ్ మిలన్' సమావేశం
సభలో పేపర్ లీక్ వ్యతిరేక బిల్లును ఆమోదింపజేసుకోవడమే లక్ష్యంగా కూటమి వ్యూహ రచన
ప్రభుత్వ నిర్ణయాలకు అండగా ఉంటూ సభా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని కూటమి ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం
-
Jul 28, 2026 11:39 IST
విశాఖ: వైసీపీ నేతలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సవాల్
జగన్ గానీ, ఆయన కోటరీ గానీ డీఎస్సీపై బహిరంగ చర్చకు రావాలి: రాంప్రసాద్ రెడ్డి
లోకేశ్ విద్యా శాఖ మంత్రి అయ్యాకే విద్యా రంగంలో సంచలనాత్మక నిర్ణయాలు, పెనుమార్పులు: మంత్రి మండిపల్లి
-
Jul 28, 2026 11:36 IST
చార్‌ధామ్ యాత్రకు రెండు రోజులపాటు ఆటంకం
భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో యాత్ర నిలిపివేత
ఉత్తరాఖండ్‌లో పలుచోట్ల భారీవర్షాలు
-
Jul 28, 2026 11:35 IST
తరౌబా: తొలి టెస్ట్ 4వ రోజు ఆట ముగిసే సమయానికి 155 పరుగుల ఆధిక్యంలో వెస్టిండీస్
స్కోర్లు: వెస్టిండీస్ 311, 126/7, పాకిస్థాన్ 282
వరుసగా 5 మెయిడిన్ ఓవర్లు వేసి ప్రపంచ రికార్డు సృష్టించిన విండీస్ బౌలర్ జస్టిన్ గ్రీవ్స్
-
Jul 28, 2026 11:29 IST
ముంబై: బాంబే హైకోర్టును ఆశ్రయించిన నటి శిల్పా శెట్టి భర్త
బిట్‌కాయిన్ మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లను సవాల్ చేస్తూ రాజ్‌కుంద్రా పిటిషన్
PMLA కోర్టు సమన్లను రద్దు చేయాలని పిటిషన్
-
Jul 28, 2026 11:21 IST
కామన్వెల్త్ గేమ్స్-2026లో రజతం సాధించిన అజయ్కు డిప్యూటీ సీఎం అభినందనలు
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో అజయ్ బాబుకు అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
గ్లాస్గోలో పురుషుల 79 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన వల్లూరి అజయ్ బాబు
స్వర్ణ పతకాన్ని స్వల్ప తేడాతో చేజార్చుకున్నా ఛాంపియన్‌గా నిలిచావు: పవన్ కల్యాణ్
-
Jul 28, 2026 11:17 IST
మోదీ వీడియో బ్లాక్ ఘటనపై స్పందించిన మెటా
బ్లాక్ చేయడం సాంకేతిక పొరపాటేనని వీడియోను పునరుద్ధరించామని మెటా ప్రకటన
మెటా తీరుపై కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ ఆగ్రహం
మెటా ఇన్‌స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్‌లకు సమన్లు జారీ
-
Jul 28, 2026 11:06 IST
పార్లమెంట్ ఉభయసభల వాయిదా
మధ్యాహ్నం 2:00 గంటలకు వాయిదా
విద్యార్థులపై లాఠీఛార్జ్ ఘటనపై విపక్షాల నిరసన
-
Jul 28, 2026 11:03 IST
హైదరాబాద్: రైతు నేస్తం 100వ ఎపిసోడ్ ప్రారంభం
వర్చువల్‌గా పాల్గొన్న మంత్రులు తుమ్మల, జూపల్లి, సీఎస్ సంజయ్
2,601 రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం
వర్చువల్‌గా పాల్గొన్న 3 లక్షల మంది రైతులు
-
Jul 28, 2026 11:02 IST
హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లాలో లోయలో పడిన వాహనం
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి
-
Jul 28, 2026 10:49 IST
కృష్ణా జిల్లా: జంట హత్య కేసును ఛేదించిన పోలీసులు
హత్య కేసును ఛేదించడంలో కృషిచేసిన పోలీస్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ
జూన్ 27న చిన్నగొల్లపాలెంలో చేపల వేటకు వెళ్లిన మామా అల్లుళ్లు శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పలను హత్య చేసిన దుండగులు
-
Jul 28, 2026 10:41 IST
పోలవరం: విద్యార్థిని శివాని ఆత్మహత్యపై పోలీసుల ముమ్మర దర్యాప్తు
ఆత్మహత్యను అనుమానాస్పద కేసుగా నమోదు
సీఎం చంద్రబాబు ఆదేశాలతో కేసుపై పోలీసుల సీరియస్
సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన FSL, క్లూస్ టీమ్స్
సూసైడ్ నోట్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన పోలీసులు
-
Jul 28, 2026 10:30 IST
బంగాళాఖాతంలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం
బెంగాల్‌లో హాల్దియా వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం
పశ్చిమ బెంగాల్ భూభాగంపై కొనసాగుతున్న వాయుగుండం
పశ్చిమ బెంగాల్, ఒడిశాలో భారీ వర్షాలు
-
Jul 28, 2026 10:26 IST
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ
టెస్టుల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా
కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
ఆగస్టు 15 నుంచి శ్రీలంకలో 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్న భారత్
-
Jul 28, 2026 10:15 IST
జమ్మూకశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం
39 మంది యాత్రికులకు గాయాలు
కుంగన్ ప్రాంతంలో బస్సు లోయలో పడిపోవడంతో ఘటన
సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
-
Jul 28, 2026 10:14 IST
తమిళనాడు: విల్లుపురంలో రోడ్డు ప్రమాదం
చింతామణి ఫ్లైఓవర్‌పై పలు వాహనాలు ఢీ
ఇద్దరి మృతి, పలువురికి తీవ్ర గాయాలు
ప్రమాద తీవ్రతకు నుజ్జునుజ్జయిన వాహనాలు, కొనసాగుతున్న సహాయక చర్యలు
-
Jul 28, 2026 10:14 IST
కామారెడ్డి: బీబీపేట మండలం మాందాపూర్‌లో విషాదం
పొలంలో ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ శ్రీధర్(26) మృతి
-
Jul 28, 2026 10:13 IST
వెలుగులోకి TVK నేతల ఆడియో లీక్
అవినీతి ఆరోపణలతో ఇప్పటికే కొందరిపై వేటువేసిన ముఖ్యమంత్రి విజయ్
సీఎం విజయ్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
TVK పాలనలోనే అవినీతి ఎక్కువ: ప్రతిపక్షాలు
-
Jul 28, 2026 10:06 IST
హైదరాబాద్: హైడ్రాపై హైకోర్టు తీర్పుతో TG ప్రభుత్వం కసరత్తు
సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లే యోచన
న్యాయ నిపుణులతో సంప్రదింపులు
సీఎం రేవంత్ ఆదేశాలతో AGతో సీఎస్ చర్చలు
ఢిల్లీ పర్యటన నుంచి సీఎం రాగానే తుది నిర్ణయం
-
Jul 28, 2026 10:03 IST
విజయనగరం: నేడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో సమావేశం
మంత్రి లోకేశ్ సారథ్యంలో ఏర్పాట్లు పర్యవేక్షించనున్న మంత్రులు, MLAలు
ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
-
Jul 28, 2026 09:51 IST
జనగామ: పాలకుర్తి మం. ఈరవెన్నులో నలుగురు యువకులు పరస్పరం కత్తులతో దాడి
తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన నలుగురు యువకులు
ఇద్దరి పరిస్థితి విషమం, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు
విచారణ జరుపుతున్న పోలీసులు
-
Jul 28, 2026 09:49 IST
కృష్ణా జిల్లా: రోడ్డు ప్రమాదంలో తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ నున్న సురేశ్ మృతి
బాపులపాడు మం. బొమ్మలూరు హైవేపై(కల్లపరు) టోల్గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఆగిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్న కారు
ఘటనలో తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ నున్న సురేశ్(52) అక్కడికక్కడే మృతి
సురేశ్ భార్య నున్న విమల దేవికి తీవ్ర గాయాలు
-
Jul 28, 2026 09:47 IST
సోనియా, రాహుల్‌తో పాటు సామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్ ప్రతినిధులకు నోటీసులు
ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ED ఛార్జ్‌షీట్ తోసిపుచ్చిన ట్రయల్ కోర్టు
తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ED
FIR లేకుండా ED కేసు విచారణ సాధ్యం కాదు: ట్రయల్ కోర్టు
ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విచారణ కోరిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా
-
Jul 28, 2026 09:09 IST
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీపై ఢిల్లీ హైకోర్టులో ED పిటిషన్
ED పిటిషన్‌పై సమాధానం ఇచ్చేందుకు సోనియా, రాహుల్ గాంధీకి 3 వారాల గడువు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ అంశంపై తదుపరి విచారణ సెప్టెంబర్ 10కి వాయిదా వేసిన జస్టిస్ మనోజ్ జైన్ ధర్మాసనం
-
Jul 28, 2026 09:07 IST
తూ.గో.జిల్లా: గోపాలపురం మం. తొక్కిరెడ్డిగూడెం గ్రామ సమీపంలో పెద్ద పులి సంచారం
పెద్దపులి అడుగుజాడలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు
కరకపాడు అడవి నుంచి తొక్కిరెడ్డిగూడెం వైపు వెళుతున్నట్లుగా గుర్తింపు
మూడు బృందాలుగా 30 మంది సభ్యులతో గాలింపు చర్యలు చేపట్టిన అటవీశాఖ
సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
-
Jul 28, 2026 08:49 IST
రంగారెడ్డి జిల్లా: గండిపేట్ మం. ఖానాపూర్ పోచమ్మ ఆలయంలో దొంగల బీభత్సం
ప్రసిద్ధ పోచమ్మ తల్లి దేవాలయంలో అర్ధరాత్రి చొరబడి గుడిని గుల్ల చేసిన దుండగులు
అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలతో పాటు హుండీని ఊడ్చేసిన దొంగలు
దోపిడీ విలువ సుమారు రూ.20 లక్షలపైనే ఉంటుందని అంచనా
-
Jul 28, 2026 08:47 IST
కామన్వెల్త్ గేమ్స్ 2026: తెలుగు కుర్రాడికి రజతం
ఏపీకి చెందిన వల్లూరి అజయ్ బాబుకు రజతం
పురుషుల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మెడల్ సాధించిన అజయ్
రెండు విభాగాల్లో 330 కేజీలతో రెండో స్థానంలో నిలిచిన అజయ్
-
Jul 28, 2026 08:45 IST
ఢిల్లీ: NEET UG నిరసనకారులకు భారీ ఊరట
నమోదు చేసిన అన్ని కేసుల ఉపసంహరణకు అస్సాం, బీహార్ ప్రభుత్వాల నిర్ణయం
ఇదే బాటలో నిర్ణయం తీసుకోనున్న రాజస్థాన్
సీజేపీ ప్రతినిధులకు హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు
-
Jul 28, 2026 08:41 IST
మేము కూడా బాధితులమే: ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం
సివిల్ కేసు నడుస్తుండగానే క్రిమినల్ కేసు నమోదు ఆశ్చర్యకరం: సీతారాం
దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తాం: తమ్మినేని సీతారాం
న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది.. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది: తమ్మినేని
-
Jul 28, 2026 08:39 IST
ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీబిజీ
పార్లమెంట్ భవనంలో వివిధ పార్టీల ఎంపీలతో రేవంత్ భేటీ
మ.3 గంటలకు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌తో రేవంత్ సమావేశం
-
Jul 28, 2026 08:33 IST
వికారాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
పరిగి, పూడూరులో నకిలీ డీఏపీ ఎరువుల దందాపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' కథనానికి స్పందన
ఏబీఎన్ కథనంతో రంగంలోకి విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు
నియోజకవర్గంలో విస్తృత తనిఖీలు చేపట్టిన అధికారులు
-
Jul 28, 2026 08:31 IST
హైదరాబాద్: ధరణి అక్రమాలపై నేడు సెట్ తొలి సమావేశం
ACB డీజీ చారు సిన్హా అధ్యక్షతన భేటీ
ప్రాథమిక కార్యాచరణపై చర్చించనున్న సెట్
నేటినుంచి ధరణిపై సెట్ విస్తృత దర్యాప్తు
-
Jul 28, 2026 08:27 IST
ఇరాక్‌పై ఇరాన్ డ్రోన్ల దాడి.. అమెరికా కాన్సులేట్ సమీపంలో పేలుళ్లు
ఉత్తర ఇరాక్‌లోని కుర్దిస్థాన్ ప్రాంత రాజధాని ఎర్బిల్‌లో తెల్లవారుజామున వరుస పేలుళ్లు
ఎర్బిల్‌కు ఈశాన్యంగా ఉన్న ఖలీఫాన్, సోరాన్ ప్రాంతాల్లో నాలుగు ఇరాన్ డ్రోన్లు దాడి
ఎర్బిల్ నగరం అంతటా ఏడు పేలుళ్ల శబ్దాలు
-
Jul 28, 2026 08:26 IST
అస్సాంలో కొనసాగుతున్న వరద బీభత్సం
68కి చేరిన మృతుల సంఖ్య
వరదలతో 5 లక్షల మంది ప్రజలకు కష్టాలు
-
Jul 28, 2026 08:02 IST
కడప: ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వాహకురాలిని బెదిరించిన కేసులో ఐదుగురి అరెస్ట్
నిందితుల నుంచి రూ.3వేల నగదు, కత్తి స్వాధీనం
బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు: DSP బాలస్వామిరెడ్డి
-
Jul 28, 2026 07:56 IST
అమెరికా సియాటెల్‌లో కాల్పులకు పాల్పడిన 15ఏళ్ల బాలుడి అరెస్ట్
ముగ్గురు వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు
-
Jul 28, 2026 07:49 IST
ఇరాన్‌పై దాడుల అంశంలో గ్యాప్ రాలేదు.. తీసుకున్నాం: ట్రంప్
చర్చలకు సమయం ఇద్దామని ఆగాం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
చర్చలు విఫలమైతే.. మళ్లీ తీవ్ర స్థాయిలో దాడులు చేస్తాం: ట్రంప్
-
Jul 28, 2026 07:45 IST
కడప: పులివెందుల మం. నలపురెడ్డిపల్లె గ్రామంలో వ్యక్తి దారుణ హత్య
నల్లపురెడ్డిపల్లిలో హత్యకు గురైన చెన్నారెడ్డి కాలనీకి చెందిన జింకా అంకాల్(50)
అంకాల్ తలపై రాయితో కొట్టి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
-
Jul 28, 2026 07:31 IST
TDP రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం సూపర్ టేకాఫ్
తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంపై మంత్రి లోకేశ్ సమీక్ష
తొలి రోజే రాష్ట్ర వ్యాప్తంగా 1,39,639 ఇళ్లను సందర్శించిన TDP శ్రేణులు
-
Jul 28, 2026 07:27 IST
విశాఖ: నేడు సింహాచలం గిరి ప్రదక్షిణ
తొలి పావంచ నుంచి గిరి ప్రదక్షిణ
సింహగిరి చుట్టూ 32 కి.మీ. మేర ప్రదక్షిణ
8 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
50 ప్రత్యేక బస్సుల ఏర్పాటు
సింహాచలం కొండపైకి వాహనాల నిరాకరణ
-
Jul 28, 2026 07:26 IST
ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన
నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
తెలంగాణలోని 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, నిజామాబాద్ జిల్లాలకు భారీ వర్షసూచన
-
Jul 28, 2026 07:25 IST
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో షర్మిల ధన్‌ఖడ్‌కు స్వర్ణం
పారా షాట్‌పుట్ ఎఫ్ 57 విభాగంలో షర్మిల ధన్‌ఖడ్‌కు స్వర్ణం
పురుషుల హైజంప్ విభాగంలో సర్వేశ్ కుషారేకు రజతం
79 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో వల్లూరి అజయ్‌బాబుకు రజతం
భారత్‌కు 2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలు
-
Jul 28, 2026 07:13 IST
రేపటి నుంచి కర్నూలు జిల్లాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన
రేపు ఆదోనిలో పార్టీ నేతలు, కార్యకర్తలతో మంత్రి లోకేశ్ భేటీ
ఎల్లుండి పత్తికొండ మం. హోసూర్‌లో సోలార్ పవర్ ప్లాంట్‌కు భూమి పూజ
-
Jul 28, 2026 06:54 IST
నేడు లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ
బిల్లుపై చర్చ తర్వాత ఓటింగ్
-
Jul 28, 2026 06:54 IST
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
రూ.1,45,870కి చేరిన 24 క్యారెట్ల 10గ్రా. బంగారం
రూ.1,33,710కి చేరిన 22 క్యారెట్ల 10గ్రా. పసిడి
కిలో వెండి ధర రూ.2,39,900
-
Jul 28, 2026 06:54 IST
నేడు తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ సమావేశం
ఇటీవలే అసెంబ్లీలో కమిటీల నియామకం
తొలి సమావేశంలో కౌశిక్‌రెడ్డి కేసుపై చర్చించే అవకాశం
గత అసెంబ్లీ సమావేశాల్లో కడియం శ్రీహరిని ఉద్దేశిస్తూ అసభ్యంగా ప్రవర్తించినట్టు కౌశిక్‌రెడ్డిపై ఆరోపణలు
పాడి కౌశిక్‌రెడ్డి కేసును ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేసిన స్పీకర్
ఎథిక్స్ కమిటీతో పాటు నేడు పలు కమిటీల సమావేశం
-
Jul 28, 2026 06:51 IST
ఢిల్లీ పర్యటనలో కేటీఆర్
నేడు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీకానున్న కేటీఆర్
తెలంగాణకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు, ఐటీ రంగం అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణపై వినతిపత్రం ఇవ్వనున్న కేటీఆర్
-
Jul 28, 2026 06:50 IST
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు నేడు భారత జట్టు ప్రకటన
ఆగస్టు 15 నుంచి శ్రీలంక-భారత్ టెస్ట్ సిరీస్
రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్న శ్రీలంక, భారత్
-
Jul 28, 2026 06:49 IST
ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీ బిజీ
నేడు పార్లమెంట్‌కు సీఎం రేవంత్ వెళ్లే అవకాశం
-
Jul 28, 2026 06:48 IST
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
ఉత్తర దిశగా కదులుతున్న తీవ్ర వాయుగుండం
ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన
తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్
-
Jul 28, 2026 06:48 IST
ఢిల్లీ: ఛలో సంసద్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
విద్యార్థులపై పోలీసులు దాడి చేశారని పలు పిటిషన్లు
అన్ని పిటిషన్లను ఒకేసారి విచారించనున్న సుప్రీంకోర్టు
-
Jul 28, 2026 06:47 IST
ఢిల్లీ: నేడు NDA పార్లమెంటరీ పార్టీ 'మంగళ్-మిలన్' సమావేశం
ఉ.9:30 గంటలకు పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని GMC బాలయోగి ఆడిటోరియంలో సమావేశం
హాజరుకానున్న NDA ఎంపీలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వ్యూహంపై చర్చ
-
Jul 28, 2026 06:42 IST
ఢిల్లీ: నేడు సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత సదస్సు
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, కనీస మద్దతు ధరపై చర్చ