Share News

తెలంగాణ ఏసీబీ దూకుడు.. రికార్డ్ స్థాయిలో కేసుల నమోదు

ABN , Publish Date - Jul 28 , 2026 | 06:28 PM

తెలంగాణలో అవినీతి నిర్మూలనపై అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30, 2026 వరకూ తెలంగాణ ఏసీబీ మొత్తం 10 ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులు, 34 ట్రాప్ కేసులు, 23 ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేసింది.

తెలంగాణ ఏసీబీ దూకుడు.. రికార్డ్ స్థాయిలో కేసుల నమోదు
Telangana Anti Corruption Bureau

హైదరాబాద్, జులై 28: అవినీతిపై తెలంగాణ ఏసీబీ ఉక్కుపాదం మోపుతుందని, అవినీతిపై రాజీ లేకుండా చర్యలు కొనసాగిస్తామని ఏసీబీ డీజీ చారు సిన్హా స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30, 2026 వరకూ తెలంగాణ ఏసీబీ మొత్తం 10 ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులు, 34 ట్రాప్ కేసులు, 23 ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేసింది. 1983లో ఏసీబీ ప్రారంభమైన తర్వాత ఒకే త్రైమాసికంలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఏసీబీ డీజీ చారు సిన్హా ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించి, నమోదైన కేసులు, ట్రాప్ ఆపరేషన్లు, దర్యాప్తు పురోగతి, నిందితులపై తీసుకుంటున్న చర్యలపై విస్తృతంగా చర్చించారు.


ఈ సందర్భంగా డీజీ చారు సిన్హా మాట్లాడుతూ..‘అధికారుల సమష్టి కృషి, నిబద్ధత వల్లే ఈ రికార్డు సాధ్యమైంది. అవినీతిపై ఏమాత్రం రాజీ లేకుండా మరింత వేగంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తులు కొనసాగించాలని అన్ని యూనిట్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. నిజాయితీ, ప్రజాసేవే ఏసీబీ ప్రధాన లక్ష్యం. అవినీతి నిర్మూలన కోసం ఇదే దూకుడు కొనసాగిస్తాం’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

సైబర్‌ నేరాలకు మరణశిక్ష.. కీలక బిల్లుకు మయన్మార్‌ పార్లమెంట్‌ ఆమోదం

ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టు కోచ్‌గా జినడిన్ జిదాన్.. 2030 వరకు ఒప్పందం

Updated Date - Jul 28 , 2026 | 06:35 PM