సైబర్ నేరాలకు మరణశిక్ష.. కీలక బిల్లుకు మయన్మార్ పార్లమెంట్ ఆమోదం
ABN , Publish Date - Jul 28 , 2026 | 05:17 PM
మయన్మార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరాలకు పాల్పడిన వారికి మరణశిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: సైబర్ నేరాలను అరికట్టేందుకు మయన్మార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా రూపొందించిన కొత్త బిల్లుకు మయన్మార్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం సైబర్ నేరాల్లో దోషులుగా తేలిన వారికి మరణశిక్ష విధించే అవకాశం ఉంటుంది.
ఇటీవల కాలంలో సైబర్ మోసాలు, ఆన్‌లైన్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో మయన్మార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఆన్‌లైన్ మోసాలు, ప్రజల వ్యక్తిగత సమాచార దుర్వినియోగం వంటి నేరాలను అరికట్టేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.
Also Read:
ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టు కోచ్‌గా జినడిన్ జిదాన్.. 2030 వరకు ఒప్పందం
మనీ ప్లాంట్‌తో పాటు ఈ 2 మొక్కలు ఉంటే సంపద రెట్టింపు.!