హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. రోడ్లన్నీ జలమయం
ABN , Publish Date - Jul 28 , 2026 | 06:46 PM
గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో ట్రాఫిక్ స్తంభించింది. హైడ్రా, డీఆర్ఎఫ్, జీహెచ్‌ఎంసీ మాన్సూన్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
హైదరాబాద్, జులై 28: గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైడ్రా, డీఆర్ఎఫ్, జీహెచ్‌ఎంసీ మాన్సూన్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. కుండపోత వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, ఎల్‌బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అదే సమయంలో బేగంపేట్, సికింద్రాబాద్, మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కొంపల్లి, ఓల్డ్ సిటీ, అంబర్‌పేట్, కాచిగూడ ప్రాంతాల్లోనూ కుండపోత వర్షం పడటంతో రహదారులపై భారీగా నీరు నిలిచింది. పలుచోట్ల వాహనాలు ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించి, ఉద్యోగులు, ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు వీచడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడటంతో రాకపోకలకు ఆటంకం కలిగింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హైడ్రా, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF), జీహెచ్‌ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. నీరు నిలిచిన ప్రాంతాల్లో డ్రైనేజీలను శుభ్రం చేస్తూ, ట్రాఫిక్‌ను నియంత్రించే చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించగా, వర్షం కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి...
విదేశీయులే లక్ష్యంగా కోట్ల రూపాయల సైబర్ మోసం.. ప్రధాన నిందితుడి అరెస్ట్
నేనెక్కడికీ పారిపోలేదు: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
Read Latest Telangana News And Telugu News