అమరావతి అంటే 29 గ్రామాలు కాదు.. విజయవాడ-గుంటూరుతో కలిపి అభివృద్ధి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 28 , 2026 | 08:48 PM
అమరావతి అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంటే కేవలం 29 గ్రామాలు మాత్రమే కాదని, విజయవాడ–గుంటూరు నగరాలతో కలిపి సమగ్ర అభివృద్ధి ప్రాంతంగా చూడాలని స్పష్టం చేశారు..
అమరావతి, జులై 28: రాష్ట్ర రాజధాని అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని కేవలం 29 గ్రామాలకు మాత్రమే పరిమితమైన రాజధానిగా కాకుండా.. విజయవాడ, గుంటూరు నగరాలతో కలిపి సమగ్రాభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. మంగళగిరిలో జరిగిన CRDA సమీక్ష సమావేశంలో ఆయన రాజధాని అభివృద్ధి పనులపై కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి అమరావతి కేంద్ర బిందువుగా ఉండాలని పేర్కొంటూ.. రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
రాజధాని నిర్మాణ పనుల్లో ఇకపై తానే స్వయంగా పర్యవేక్షణ చేపడతానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. పనుల్లో జాప్యానికి తావులేకుండా అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటూ ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు, విశాలమైన రహదారులు, పర్యావరణ హిత అభివృద్ధితో అమరావతిని ఆదర్శ రాజధానిగా రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
విదేశీయులే లక్ష్యంగా కోట్ల రూపాయల సైబర్ మోసం.. ప్రధాన నిందితుడి అరెస్ట్
నేనెక్కడికీ పారిపోలేదు: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
Read Latest Telangana News And Telugu News