-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 26th August 2026 BSB
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Aug 26 , 2026 | 06:51 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Aug 26, 2026 07:53 IST
కడప: పులివెందుల అర్బన్ CI శ్రీరామ్‌పై బదిలీ వేటు
కడప వీఆర్‌కు బదిలీ చేసిన డీఐజీ కోయ ప్రవీణ్
వైఎస్ వివేకా కుటుంబ సభ్యుల భూమి కబ్జాకు గురైనట్టు కలెక్టర్, ఆర్డీవోలకు ఫిర్యాదు చేసిన వైఎస్ సునితారెడ్డి
ఓ కబ్జా బ్యాచ్ ఫేక్ పాస్ పుస్తకాలు సృష్టించినట్టు నిర్ధారణ
-
Aug 26, 2026 07:42 IST
హోర్ముజ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
హోర్ముజ్‌లో మందుపాతరలన్నీ తొలగించాం: ట్రంప్
ఇరాన్ కొత్తగా మైన్లు పెడితే కఠిన చర్యలు: ట్రంప్
మైన్లు ఏర్పాటు చేస్తే నౌకలు ధ్వంసం చేస్తాం: ట్రంప్
మైన్ల ఏర్పాటుపై జీరో టాలరెన్స్ విధింపు: ట్రంప్
-
Aug 26, 2026 07:31 IST
అమెరికా-కెనడా మధ్య ట్రేడ్ వార్
ట్రంప్ 50 శాతం సుంకాలకు కెనడా ప్రతీకార సుంకాలు
US వస్తువులపై 20 శాతం సుంకాలు విధిస్తామన్న కెనడా
స్టీల్ ఉత్పత్తులపై ఉన్న 25 శాతం సుంకాలను 50 శాతానికి పెంచుతున్నట్టు కెనడా ప్రకటన
-
Aug 26, 2026 07:26 IST
అమరావతి: ఎల్లుండి ఏపీ JAC అమరావతి రాష్ట్రస్థాయి సదస్సు
ఉద్యోగుల సమస్యలపై ఐక్య ఉద్యమాలకు పిలుపు
-
Aug 26, 2026 07:14 IST
ఏలూరు: నేటి నుంచి ద్వారకా తిరుమల ఆలయంలో పవిత్రోత్సవాలు
ఈ నెల 29 వరకు కొనసాగనున్న పవిత్రోత్సవాలు
-
Aug 26, 2026 07:13 IST
నేడు హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు పర్యటన
ఏపీ సీఎస్ సాయిప్రసాద్ కుమార్తె వివాహ కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు
-
Aug 26, 2026 07:09 IST
నేడు ఖమ్మం జిల్లాలో ఇద్దరు మంత్రుల పర్యటన
వేర్వేరుగా పర్యటించనున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, శ్రీకారం
-
Aug 26, 2026 07:08 IST
హైదరాబాద్: నేడు కూకట్‌పల్లిలో BRS సమావేశం
22A బాధితులతో హరీశ్ రావు భేటీ
-
Aug 26, 2026 07:07 IST
నేడు నిజామాబాద్‌లో TPCC చీఫ్ మహేశ్ గౌడ్ పర్యటన
రెండు రోజులపాటు నిజామాబాద్‌లో మహేశ్ గౌడ్ టూర్
-
Aug 26, 2026 07:07 IST
మేడ్చల్: గంజాయి మత్తులో యువకుల వీరంగం
ర్యాపిడో కారు డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ 10 మంది యువకుల ఘర్షణ
గంజాయి మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో దాడి
పేట్ బషీర్‌బాద్ పీఎస్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలో ఘటన
సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన దృశ్యాలు
-
Aug 26, 2026 07:01 IST
ప.గో.: నర్సాపురం మం. చిన్నలంక దగ్గర బోటు ప్రమాదం
ఇసుక దిబ్బను ఢీకొని బోటు బోల్తా
మత్స్యకారులను రక్షించిన చిన్న లంక గ్రామస్థులు
మత్స్యకారులంతా కాకినాడకు చెందినవారిగా గుర్తింపు
వారం క్రితం కాకినాడ నుంచి బయల్దేరిన బోటు
-
Aug 26, 2026 06:59 IST
సూర్యాపేట: కోదాడ మం. దొరకుంట దగ్గర రోడ్డు ప్రమాదం
కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన బస్సు
ఆరుగురి మృతి, మరో నలుగురి పరిస్థితి విషమం
ప్రమాదంలో మరో 11 మందికి గాయాలు
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు
-
Aug 26, 2026 06:59 IST
ఢిల్లీలో 2,300 దాటిన స్వైన్‌ఫ్లూ కేసులు
అత్యవసర చర్యలు చేపట్టిన ఢిల్లీ ప్రభుత్వం
-
Aug 26, 2026 06:53 IST
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
24క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,63,740
22క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,50,090
కిలో వెండి ధర రూ.2,64,900
-
Aug 26, 2026 06:51 IST
ఉత్తర్‌ప్రదేశ్: యోగి సర్కార్ కీలక నిర్ణయం
60 ఏళ్లు పైబడిన మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం
'లోకమాత అహిల్యాబాయి మాతృశక్తి' యోజన కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం