జనవరి 1 నుంచి సంజీవని సేవలు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 26 , 2026 | 04:00 PM
2027, జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బుధవారం రాజధాని అమరావతిలో వైద్య ఆరోగ్య సేవలు, సంజీవని ప్రాజెక్ట్ సేవలపై ఆయన సమీక్షించారు.
అమరావతి, ఆగస్టు 26: 2027, జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బుధవారం రాజధాని అమరావతిలో వైద్య ఆరోగ్య సేవలు, సంజీవని ప్రాజెక్ట్ సేవలపై ఆయన సమీక్షించారు. కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో అమలు చేసిన ప్రాజెక్ట్ ఫలితాలను ఆధారంగా చేసుకుని కార్యాచరణ రూపొందించాలని వారికి సీఎం సూచించారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీర పాండ్యన్‌తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీలో పాపం చేసిన వారెవ్వరూ శిక్షల నుంచి తప్పించుకోలేరు: కొల్లు రవీంద్ర
తెలంగాణ వేదికగా ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’
For AP News And Telugu News