Share News

గొడ్డలి పార్టీలో పాపం చేసిన వారెవ్వరూ శిక్షల నుంచి తప్పించుకోలేరు: కొల్లు రవీంద్ర

ABN , Publish Date - Aug 26 , 2026 | 02:53 PM

సీఎం చంద్రబాబు ముందు చూపు కారణంగా జలాశయాల్లో నీటిని నిల్వ చేయటం వల్ల క్లిష్ట పరిస్థితుల్ని సైతం ఎదుర్కోగలుగుతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. జలవనరులపై జగన్ రెడ్డివి అవగాహన లేమి మాటలని వ్యాఖ్యానించారు.

గొడ్డలి పార్టీలో పాపం చేసిన వారెవ్వరూ శిక్షల నుంచి తప్పించుకోలేరు: కొల్లు రవీంద్ర
AP Minister Kollu Ravindra

అమరావతి, ఆగస్టు 26: గొడ్డలి పార్టీలో పాపం చేసిన వారెవ్వరూ శిక్షల నుంచి తప్పించుకోలేరని ఆంధ్రప్రదేశ్ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. బుధవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ఎల్‌ నినోపై అసెంబ్లీలో చర్చ పెడితే ఇంట్లో పడుకున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అభూతకల్పనలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ ఐదేళ్ల పాలన దుర్మార్గాలు.. అసెంబ్లీ వేదికగా బయటపడతాయనే సభకు రాకుండా ఇంటికి పరిమిత మవుతున్నారంటూ వైసీపీ అధినేతపై నిప్పులు చెరిగారు.


తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మెప్పు కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. జగన్ దోపిడీ, ధన దాహానికి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ విధ్వంసానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ పంపులు కాటాకు వేయాలని నాడు జగన్ మాట్లాడ లేదా? అని ప్రశ్నించారు. అదే పట్టిసీమ ప్రాజెక్టు ఎల్ నినో పరిస్థితుల్లో ఆదుకుంటోందని గుర్తు చేశారు.


సీఎం చంద్రబాబు ముందు చూపు కారణంగా జలాశయాల్లో నీటిని నిల్వ చేయటం వల్ల క్లిష్ట పరిస్థితుల్ని సైతం ఎదుర్కోగలుగుతున్నామని చెప్పారు. జలవనరులపై జగన్ రెడ్డివి అవగాహన లేమి మాటలని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. రాయలసీమకు ద్రోహం చేసి ఇప్పుడు కపట ప్రేమ నటిస్తున్నారంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ రెడ్డి తీరును ఎండగట్టారు. తన రాజకీయ స్వార్ధం కోసం 102 టెండర్లను రాయలసీమలో జగన్ రెడ్డి రద్దు చేశాడని మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు.


జగన్ నిర్లక్ష్యం కారణంగానే పోలవరం నిర్మాణ ఖర్చు పెరిగిందని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని తట్టుకో లేకే జగన్ వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నాడని తెలిపారు. బీసీలు బాగు పడటం నచ్చని జగన్‌కు వారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. సొంత కేసులకు కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించిన జగన్ బీసీ రిజర్వేషన్ల కోతను మాత్రం పట్టించుకోలేదన్నారు. మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి కారుమూరి అడ్డంగా దొరికితే రాజకీయ ప్రయోజనాల కోసం బీసీ కార్డు వాడతారా? అంటూ వైసీపీ అధినేత జగన్ తీరు పట్ల మంత్రి కొల్లు రవీంద్ర అసహనం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బ్రో.. కాస్త ఆగు: రాహుల్‌కు కంగనా రనౌత్ కౌంటర్

డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి నుంచి

For TG News And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 03:02 PM