Share News

డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి నుంచి

ABN , Publish Date - Aug 26 , 2026 | 02:06 PM

డిజిటల్ అరెస్ట్ పేరుతో 85 ఏళ్ల రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) అధికారినంటూ గుర్తుతెలియని వ్యక్తి బాధితుడికి ఫోన్ చేశాడు.

డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి నుంచి
Hyderabad digital arrest scam

హైదరాబాద్, ఆగస్టు 26: ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో 85 ఏళ్ల రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) అధికారినంటూ గుర్తుతెలియని వ్యక్తి బాధితుడికి ఫోన్ చేశాడు. ఆయన ఆధార్ వివరాలతో రూ.2.50 కోట్ల మోసం జరిగిందని రిటైర్డ్ ఉద్యోగిని నిందితుడు భయపెట్టాడు. అనంతరం ఈ కేసు నుంచి బయటపడేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వెరిఫికేషన్ పేరుతో నమ్మించి.. తన బ్యాంక్ ఖాతాలో రూ.85.20 లక్షలు జమ చేయాలని బాధితుడికి సైబర్ కేటుగాడు సూచించాడు. నిందితుడి మాటలు నమ్మిన బాధితుడు ఆ మొత్తాన్ని అతను సూచించిన ఖాతాలో జమ చేశాడు.


మరో రూ.42 లక్షలు చెల్లించాలని నిందితుడు డిమాండ్ చేయడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. దీంతో సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన రిటైర్డ్ ఉద్యోగి.. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్(NCRP)లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన తెలంగాణ సైబర్ పోలీసులు.. కోయంబత్తూరులోని IDFC బ్యాంక్ బ్రాంచ్‌లో నిందితుడి ఖాతాను గుర్తించి, అందులో ఉన్న రూ.85.20 లక్షలను ఫ్రీజ్ చేశారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలకు TGCSB డైరెక్టర్ శిఖా గోయల్ సూచించారు.


ఇవి కూడా చదవండి...

రేపు యువతతో ప్రధాని సంభాషణ.. ‘ఖేలో ఇండియా డైలాగ్‌’లో పాల్గొననున్న మోదీ

ధరణితోనే అనేక భూ సమస్యలు.. గత ప్రభుత్వంపై వీహెచ్ ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 02:10 PM