సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తే ఊరుకోం: భానుప్రకాశ్ రెడ్డి
ABN , Publish Date - Aug 26 , 2026 | 11:48 AM
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో.. అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను అన్యమత ప్రదేశ్‌గా మార్చారంటూ జగన్‌పై దుయ్యబట్టారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 26: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో.. అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను అన్యమత ప్రదేశ్‌గా మార్చారంటూ జగన్‌ను దుయ్యబట్టారు. హిందూ దేవాలయాలు, దేవతలపై దాడులు చేసి విగ్రహాల చేతులు నరికి వేశారని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని ఎవరైనా నాశనం చేయాలని చూస్తే రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు బీజేపీ కంకణబద్ధమై ఉందన్నారు.
విజయసాయిరెడ్డి ఆరోజు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే సనాతన ధర్మంపై మాట్లాడి ఉంటే బాగుండేదని భానుప్రకాశ్ అభిప్రాయపడ్డారు. అన్యాయం జరిగినప్పుడే మాట్లాడాలని.. అప్పుడే ఆ నిజాయితీకి గుర్తింపు ఉంటుందన్నారు. బయటికి వచ్చిన తర్వాత మాట్లాడితే దానికి విలువ తగ్గుతుందని చెప్పుకొచ్చారు. కాకినాడలో సౌజన్య ‘లవ్ జిహాద్’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని తెలిపారు. హిందూ సమాజానికి తామున్నామని భరోసా ఇస్తున్నామని అన్నారు. దేశంలో కొన్ని వేల మంది యువతులు, మహిళలు ‘లవ్ జిహాద్’కు బలైపోతున్నారని వ్యాఖ్యానించారు. సాదిక్ లాంటి దర్మార్గుల వెనుక కర్త, కర్మ, క్రియ ఎవరో గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సాదిక్ కుట్రపై లోతుగా విచారణ జరిపి, శిక్షించాలని ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు.
సమాజంలో ఉన్న సాదిక్ లాంటి వెధవవలు, దుర్మార్గులు, నీచులను గుర్తించాలని భాను ప్రకాశ్ కోరారు. బాధితులు ఏక్షణంలోనైనా సహాయం కోసం సంప్రదించేలా ప్రభుత్వమే ‘టోల్ ఫ్రీ’ నంబర్ ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి సమాచారం ఇవ్వాలని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేవరకు వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసుల రక్షణ కూడా బాధితులకు ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై ఏపీ డీజీపీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని భాను ప్రకాశ్ రెడ్డి కోరారు.
ఇవి కూడా చదవండి...
కాకినాడలో జిమ్ ట్రైనర్ దారుణ హత్య.. కర్రతో గొంతులో పొడిచి..
మదర్ థెరిసా నిస్వార్థ సేవలను మననం చేసుకుందాం: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News