Share News

మదర్ థెరిసా నిస్వార్థ సేవలను మననం చేసుకుందాం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 26 , 2026 | 11:33 AM

పేదలు, అనాథల సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మథర్ థెరిసా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.

మదర్ థెరిసా నిస్వార్థ సేవలను మననం చేసుకుందాం: సీఎం చంద్రబాబు
CM Chandrababu

అమరావతి, ఆగస్టు 26: పేదలు, అనాథల సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మథర్ థెరిసా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ప్రేమారాహిత్యంతో బాధపడుతున్న వారిని మదర్ థెరిసా అక్కున్న చేర్చుకున్నారని తెలిపారు. ఆమె నిస్వార్థ సేవలను స్మరించుకుందాం అంటూ సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా సీఎం చంద్రబాబు తెలియజేశారు.


సీఎం చంద్రబాబు పోస్ట్..

‘సాటిమనిషిలోని బాధను తొలగించడమే దైవత్వం. పేదరికం, ప్రేమరాహిత్యంతో బాధపడుతున్న నిస్సహాయులను అక్కున చేర్చుకుని ప్రేమను పంచి, సపర్యలు చేశారు మదర్ థెరిసా. ఈరోజు ఆ మహనీయురాలి జయంతి సందర్భంగా విశ్వవ్యాప్తమైన ఆమె నిస్వార్థ సేవలను, దివ్య చరితను మననం చేసుకుందాం’ అంటూ ఎక్స్‌లో ముఖ్యమంత్రి పోస్ట్ చేశారు.


మదర్ థెరిసా జీవితం మానవతా విలువలకు ప్రతీక: పల్లా శ్రీనివాసరావు

మదర్ థెరిసా జయంతి సందర్భంగా విశాఖలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నివాళులర్పించారు. మదర్ థెరిసా చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. పేదలు, అనాథలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రేమ, కరుణతో సేవలందించిన మదర్ థెరిసా జీవితం మానవతా విలువలకు ప్రతీక అని తెలిపారు. సేవే పరమావధిగా, మానవత్వమే మార్గంగా ఆమె అందించిన సేవలు ప్రపంచానికి స్ఫూర్తిదాయకమన్నారు. మదర్ థెరిసా ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని పేదలు, నిరుపేదలకు అండగా నిలవాలని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి...

పొలానికి వెళ్లిన రైతుపై ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి.. 40కి పైగా కుట్లు

కాకినాడలో జిమ్ ట్రైనర్ దారుణ హత్య.. కర్రతో గొంతులో పొడిచి..

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 11:36 AM