Share News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 15 మంది నవజాత శిశువుల సజీవదహనం

ABN , Publish Date - Aug 26 , 2026 | 10:21 AM

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 15 మంది నవజాత శిశువులు సజీవదహనం అయ్యారు.

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 15 మంది నవజాత శిశువుల సజీవదహనం
Fire Accident in Pakistan

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 'పాకిస్థాన్ ఇన్‌పేషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్' (PIMS) ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది నవజాత శిశువులు సజీవదహనమయ్యారు. ఆసుపత్రిలోని గైనకాలజీ వార్డులోని నర్సరీలో ఇవాళ(బుధవారం) ఉదయం ఈ ప్రమాదం సంభవించిందని స్థానిక మీడియా వెల్లడించింది.


ఏసీ కంప్రెసర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో ప్రత్యేక వార్డులో మొత్తం 16 మంది శిశువులు ఉండగా, కేవలం ఒక్క శిశువును మాత్రమే రక్షించగలిగామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి, సహాయక చర్యలు చేపట్టారు. ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాల వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌తో మా సంబంధాల్లో మీ జోక్యం వద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్..

కొద్దిగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 26 , 2026 | 10:39 AM