Share News

ఇరాన్‌తో మా సంబంధాల్లో మీ జోక్యం వద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్..

ABN , Publish Date - Aug 26 , 2026 | 07:30 AM

ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు మరింత కఠినతరం అవుతున్న వేళ చైనా కీలక హెచ్చరిక చేసింది. ఇరాన్‌తో తమ దేశానికి ఉన్న సంబంధాల్లో అమెరికా జోక్యం కుదరదని బీజింగ్ స్పష్టం చేసింది.

ఇరాన్‌తో మా సంబంధాల్లో మీ జోక్యం వద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్..
China warns US

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు మరింత కఠినతరం అవుతున్న వేళ చైనా కీలక హెచ్చరిక చేసింది. ఇరాన్‌తో తమ దేశానికి ఉన్న సంబంధాల్లో అమెరికా జోక్యం కుదరదని బీజింగ్ స్పష్టం చేసింది. తమ సార్వభౌమ హక్కులు, చట్టబద్ధమైన ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అమెరికా విధిస్తున్న ఏకపక్ష ఆంక్షలను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది. ఇరాన్‌తో చట్టబద్ధమైన వాణిజ్య, ఆర్థిక సంబంధాలను కొనసాగించడం తమ హక్కు అని స్పష్టం చేసింది (China Iran relations).


ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు అమెరికా ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేస్తోంది. ఇరాన్‌తో వ్యాపారం చేసే సంస్థలు, దేశాలపై కూడా ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉందని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవడం ద్వారా ఆ దేశానికి వచ్చే ఆదాయాన్ని తగ్గించడం అమెరికా వ్యూహంలో కీలకంగా మారింది. అయితే ఈ విషయంలో చైనా పాత్ర అత్యంత కీలకం. ఇరాన్‌కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటి. ముఖ్యంగా ఇరాన్ చమురు ఎగుమతులకు చైనా ప్రధాన మార్కెట్‌గా ఉంది (US Iran sanctions).


ఇరాన్ విషయంలో అమెరికా చర్యలను చైనా బహిరంగంగా వ్యతిరేకించడం వల్ల ఇప్పటికే అనేక అంశాల్లో విభేదాలు ఉన్న రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది (China warns US, Iran sanctions). ఇరాన్‌తో వ్యాపారం చేస్తున్న చైనా కంపెనీలు లేదా ఆర్థిక సంస్థలపై అమెరికా ఆంక్షలు విధిస్తే.. బీజింగ్ కూడా ప్రతిచర్యలకు దిగే అవకాశం కనబడుతోంది. ఇరాన్‌ను ఆర్థికంగా ఒంటరి చేయాలని అమెరికా ప్రయత్నిస్తున్న సమయంలో చైనా అడ్డుగా నిలిచింది. ముఖ్యంగా ఇంధన రంగంలో ఇరాన్, చైనా మధ్య సంబంధాలు అమెరికా ఆంక్షల వ్యూహానికి పెద్ద సవాలుగా మారాయి.


ఈ వార్తలనూ చదవండి:

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల!

Updated Date - Aug 26 , 2026 | 07:32 AM